- టెలిమాటిక్స్‌కు ప్రాప్యతను అందిస్తుంది…
- ఐటీ వ్యవస్థల అవరోధరహిత సమగ్రతను అందిస్తుంది…
- నవ-తరం చలన శీలత పరిష్కారాలకు వీలు కల్పిస్తుంది…
- తదుపరి మధ్య-పరిమాణ కనెక్ట్ చేయబడిన…
- ముఖ్య స్తంభంగా ఆవిష్కరణ ఉంది…
- బోర్డు అంతటా ‘అనుభవాలను’ పెంచారు…
- అనేక ‘ప్రథమాలను’ ప్రవేశపెట్టింది… అవును, మీ తలపై జుత్తు మొత్తం పీక్కున్నా ఏమీ అర్థం కాని వాక్యాలివి… ఎక్కడివీ రత్నాలు అనుకుంటున్నారా..? మనసులో ఏదైనా పత్రిక మీద డౌటొస్తున్నదా..? కాదు, మీరు ఊహిస్తున్నట్టు ఈనాడు కానేకాదు… అది క్షుద్రానువాదాలకు తలపండినదే కానీ, ఇది దాని తలదన్నే కాష్మోరా… రిలయెన్స్ జియో ప్లస్ ఎంజీ మోటార్ సంయుక్తంగా జారీచేసిన ఓ ప్రకటనలోని వాక్యాలివి…
కార్పొరేట్ కంపెనీలు ముంబై లేదా ఢిల్లీలో కూర్చుని తమ పీఆర్ విభాగాలకు యాడ్స్, ప్రకటనల్ని రూపొందించే బాధ్యతల్ని అప్పగిస్తాయి… పెద్ద తలకాయలు హిందీ, ఇంగ్లిషు చదివి, అర్థమైనా కాకపోయినా వోకే అనేస్తాయి… వివిధ భాషల్లోకి తర్జుమాల పని ఇంకెవరికో అప్పగిస్తారు… దిక్కుమాలిన అనువాదాలతో వాళ్లు యాడ్స్, ప్రకటనల్ని రిలీజ్ చేసేస్తారు… తరువాత వాటిని పత్రికల్లో చదివి, టీవీల్లో చూసి, రేడియోల్లో విని వెర్రెత్తిపోయే దరిద్రం ఆయా భాషల వినియోగదారులదే… కోల్గేట్ వాడి సమంత ప్రవచిత ‘ఉప్పుజ్ఞానం’ తరహాలో అన్నమాట… కోట్లకుకోట్లు ఖర్చు చేస్తారు కదా… వాళ్ల సంకల్పం ఎక్కువ మంది జనాన్ని రీచ్ కావడమే కదా… మరి అలాంటప్పుడు వివిధ భాషల్లోకి తమ యాడ్స్, తమ ప్రకటనలు ఎలా వెళ్తున్నాయో, వినియోగదారులకు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునే సోయి ఉండకూడదా..? పూర్తిగా తమ సెకండ్ లేయర్ ఉద్యోగుల తెలివితేటల్ని అతిగా నమ్మితే వచ్చే అనర్థం ఇలాగే ఉంటుంది…
ఇప్పుడు మరీ దరిద్రం… ఏదో ఒక ట్రాన్స్‌లేషన్ యాప్ లేదా ట్రాన్స్‌లేషన్ టూల్ (మెకానిక్ ట్రాన్స్‌లేషన్స్, అనగా యాంత్రిక తర్జుమాలు) ఉపయోగించడం… ఈ ఇంగ్లిషు కాపీని పేస్ట్ చేయడం, మనకు కావల్సిన భాషను సెలెక్ట్ చేయడం… అందులో కనిపించిన దాన్ని జనంలోకి వదిలేయడం… అసలు గూగుల్ వంటి సంస్థకే ఈ అనువాదాలు చేతకావడం లేదు… నిజానికి అది కష్టం కూడా… ఒక డిక్షనరీలాగా పదాలకు ఆయా భాషల్లో సరైన అర్థాలు చెప్పడం సులభమే కానీ, పెద్ద పెద్ద వాక్యాల్ని అదే అర్థంలో అనువాదం చేయడం అంత సులభం కాదు… ఈమధ్య ఫేస్‌బుక్ వాడు కూడా గూగుల్ బాటలో మనల్ని బుక్ చేస్తున్నాడు… (నిన్న ఏదో పిచ్చి పత్రిక యాప్ అని రాస్తే సరిపోయేదానికి అనువర్తనం, అనువర్తనం అంటూ ఒకే వార్తలో ఏడెనిమిదిసార్లు రాసి చంపేశాడు…) ఈ తర్జుమా కష్టాల గురించి ఎంత చెప్పినా ఒడవదు, తెగదు కానీ… పైన మనం ఏడు ‘వింత తెలుగు’ పదవాక్యాల ఒరిజినల్ ఇంగ్లిష్ కావాలా..? ఇదుగో…
Ads
- Will provide access to telematics
- Seamless integration of IT systmes
- Will enable robust new-age solutions
- Next mid sized connected
- Innovation as its key pillar
- Across the board ‘Experiences’
- Introduced several ‘Firsts’
Share this Article