.
అసలు లక్నో, కలకత్తా జట్ల మధ్య పోటీ అంటేనే ఎవడికీ ఇంట్రస్టు లేదు ఈసారి ఐపీఎల్ సీజన్‌లో… కటువుగా ఉన్నా సరే అదే నిజం… పాయింట్ల టేబుల్‌లో ఒకటి 9వ ప్లేసు, మరొకటి పదో ప్లేసు… రెండు జట్లదీ పరమ పేలవమైన ఆటతీరు… కలకత్తా జట్టును యాజమాన్యం కూడా గాలికి వదిలేసినట్టుంది… ఐతే ఒక ఇంట్రస్టింగ్ ఔట్… మొత్తం ఐపీఎల్ అంపైరింగ్ సిస్టంకు, విచక్షణకు మరకలాగా మిగిలింది… దీనిపై క్రికెట్ ప్రేమికుల్లో బోలెడు చర్చ సాగుతోంది కూడా…
కలకత్తా జట్టు అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్థితిలో రఘువంశీ వచ్చాడు… ఓ షాట్ కొట్టాడు… రన్ కోసం ప్రయత్నించాడు… రెండుమూడు అడుగులు వేయగానే బాల్ ఫీల్డర్ వద్దకు వెళ్లిందని గమనించి, రనవుట్ తప్పించుకోవడానికి హడావుడిగా వెనక్కి తిరిగి, క్రీజు చేరుకోవడానికి పరుగు తీశాడు… క్రీజు చేరాడు కూడా… కానీ ఈలోపు ఫీల్డర్ విసిరిన బాల్ మాత్రం రఘువంశీకి తగిలింది…
Ads
అలా తగలకపోతే, వికెట్ కీపర్ దగ్గరకు చేరేదనీ, లేదా వికెట్లకు నేరుగా తాకేదని లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ డౌటనుమానం… చాన్స్ ఎందుకు వదలాలిలే అనుకుని అప్పీల్ చేశాడు… దేనికీ అంటే… అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద… అంటే ఉద్దేశపూర్వకంగా బాల్‌కు బ్యాటర్ అడ్డుతగిలాడని..! నిజంగా అదే జరిగితే ఔట్ ఇవ్వాల్సిందే… కానీ..?
అక్కడ రఘువంశీ అసలు ఉద్దేశపూర్వకంగా బాల్‌కు అడ్డుతగులుతున్నట్టు ఏమీ లేదు… తను వేగంగా క్రీజు చేరుకోవాలనే ప్రయత్నించాడు, అంతే… కానీ థర్డ్ అంపైర్ ఏం చేశాడు..? కావాలనే ఆ బాల్ స్టంప్స్ వైపు వెళ్లకుండా, అడ్డుకోవడానికి ప్రయత్నించాడు అని ఫిక్సయిపోయి ఔట్ ఇచ్చాడు… రఘువంశీ షాక్… కానీ ఎన్ని రీప్లేలు చూసినా సరే, రఘువంశీ దురుద్దేశం ఏమీ కనిపించలేదు… కానీ ఔటయ్యాడు…
- అఫ్‌కోర్స్, తప్పుడు అంపైరింగ్ నిర్ణయాలు క్రికెట్‌లో కొత్త కాదు… టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలావరకు తప్పుడు నిర్ణయాలపై రివ్యూస్ కూడా చోటుచేసుకుంటున్నాయి… కానీ ఇక్కడ ‘తప్పు జరగలేదని’ తెలిసీ ఔట్ ఇచ్చాడు ఆ థర్డ్ అంపైర్ ఎవరో గానీ… ఈ ఐపీఎల్ సీజన్‌కు ఇదొక మరక..!

ఫీల్డర్ విసిరిన బంతి వికెట్లకు తగలకుండా బ్యాటర్ తన చేత్తో అడ్డుకుంటే అవుట్ ఇస్తారు… గతంలో దీనిని ‘Handled the ball’ అనేవారు, ఇప్పుడు దీనిని కూడా అబ్ స్ట్రక్టింగ్ కిందకే మార్చారు… ఫీల్డర్ క్యాచ్ పడుతుంటే కావాలని అడ్డు వెళ్లడం లేదా రన్ అవుట్ చేసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి వికెట్లకు తగలకుండా తన శరీరాన్ని లేదా బ్యాట్‌ను కావాలని అడ్డుపెట్టడం కూడా ఈ కేటగిరీ కింద అవుట్ ఇస్తారు…
రన్ తీసేటప్పుడు ఫీల్డర్ బంతిని విసిరే దారిలో కావాలని అడ్డంగా వెళ్తే అప్పుడు కూడా అవుట్ ఇస్తారు… ఒకవేళ బ్యాటర్ తనను తాను గాయం నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా బంతి తగిలితే, అంపైర్లు దానిని అవుట్‌గా పరిగణించరు…. బ్యాటర్ కావాలని ఆటంకం కలిగిస్తేనే ఈ వికెట్ ఇస్తారు…. గతంలో ఇదే విధంగా యూసఫ్ పఠాన్ అవుట్ అయ్యాడు… కానీ రఘువంశీ ఔట్ విషయంలో తన దురుద్దేశం ఏమీలేదు, ఐనా ఔట్ నిర్ణయానికి గురయ్యాడు…
ఈ మ్యాచు గురించి ఇంకా చెప్పాల్సింది ఉంది… 1) స్కోర్లు టై కావడంతో, సూపర్ ఓవర్ ఆడారు… కలకత్తా బౌలర్ సునీల్ నరైన్ ఒక పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు… దాంతో ఆ జట్టు తరఫున రింకూ సింగ్ ఫస్ట్ బాల్‌కే ఒక ఫోర్ బాది కలకత్తాకు గెలుపు అందించాడు… 2) ఈ మ్యాచులో లక్నో బౌలర్ మొహిసిన్ ఖాన్ 5 వికెట్లు తీశాడు, అరుదైన ఘనతే…
3) రింకూ సింగ్ ఫీల్డింగ్ గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదా, ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో టాప్ వన్ ఫీల్డర్… ఈ మ్యాచులో నాలుగు క్యాచులు ప్లస్ సూపర్ ఓవర్‌లో ఒకటి … ఒకటయితే టాప్ క్లాస్ క్యాచ్…
Share this Article