Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పటికే పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలు… ఐనా పెళ్లాడింది జయంతి…

January 15, 2023 by M S R

Bharadwaja Rangavajhala………..   ఆలోచనల ఓవర్ ఫ్లో .. పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ చిత్రం. ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడితో సహా హాజరయ్యారు. పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు … జయంతి.

పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జయంతి వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పుడు జయంతికి అది రెండోపెళ్లి. ఆ రెండో పెళ్లి చేసుకున్న చందన నిర్మాత గిరిబాబుకూ రెండో పెళ్లే.

సినిమా వాళ్లల్లో ఇలాంటివి అధికం కనిపించడానికి కారణాలు అనేకం … ఇండస్ట్రీలో ఒక అండకోసం ఓ పెద్దమనిషిని ఆశ్రయించడం … దరిమిలా వారు వీరి మీద దాష్టీకం చేయడం … కొంత కాలం భరించి నమస్తే గురూ … అన్జెప్పి బయట పడడం … ఇంతదాన్ని చేస్తే అన్యాయం చేసిందనే ప్రచారాన్ని భరించడం … క్రమంగా మరో వివాహం చేసుకోవడం ఇవన్నీ చాలా మంది వీరోయిన్ల తెరవెనుక కథల్లో కనిపిస్తాయి …

Ads

కొందరు ఈ జర్నీని యాక్సెప్ట్ చేయక డిప్రెస్ అవుతారు … గందరగోళ పడతారు. జీవితన్ని కెరీర్ ను నాశనం చేసుకుంటారు … అయితే ఇయన్నీ పాత రోజుల్లోనే … ఇప్పుడు పర్లేదు … కొంత గ్యానం వచ్చింది ఆ ఏరియాలోనూ … ప్రధానంగా అభిప్రాయబేధాలు వచ్చినప్పుడు విడిపోవడమే మంచిదని చెప్పారుగా పెద్దలు … ఎవరి కోసం ఎవరూ అభిప్రాయాలు మార్చుకోనక్కరలేదు అని కూడా చెప్పారుగా …

మనసులు అర్పణలు ఉండవు. అర్పించుకోడాలు అస్సలు ఉండవు… ఆత్రేయ గారన్నట్టు ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాననయ్యాను లాంటి సినిమాలు వాస్తవంలో ఉండవు. అందాక ఎందుకు.. ? ఎఫ్ బిలో ఒకరి అభిప్రాయాలు ఓ దశలో ఓ అంశం మీద నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. వారు అంగీకరిస్తారు. ఆ తర్వాత అదే వ్యక్తి నుంచీ మనం నొచ్చుకునే అభిప్రాయ ప్రకటనలు వెలువడుతాయి. అప్పుడు ఫ్రెండ్షిప్ నుంచీ తప్పుకుంటాం …

ఇక్కడే నాకు తేడా కొట్టుద్ది .. పెతోడూ మనకు అనుకూలమైన అభిప్రాయలే వ్యక్తం చేయాలంటే ఎట్టా … మళ్లీ ఆత్రేయే …. నీ మనసు నీదిరా ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో … ఎదుటివాళ్లను మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు? అట్టాగే భార్యా భర్తల్లో కూడా వారి అభిప్రాయమే ఈవిడా వ్యక్తం చేయాలంటే ఎట్టా కుదరదుగా … అట్నే ఆవిడ అభిప్రాయలే ఈయనా వ్యక్తం చేయాలన్నా కుదరదు కదా … జాతులు విముక్తిని కోరతాయి అన్నాడు కదా స్టాలిన్ … పెళ్లిళ్లు విడిపోడాన్ని కోరుతాయి

బంధం ఎప్పుడూ బంధమే …. అన్నారుగా పెద్దోళ్లు …. నేను పెద్దోళ్లను గౌరవిస్తాను … క్రూర మృగమ్ముల కోరలు వంచెను, ఘోరారణ్యముల ఆక్రమించెను…. అయినా … మడిసి మారలేదు ఆతడి ఆకలి తీరలేదు … ఏదో జయంతి గారి పెళ్లి రిసెప్షను ఫొటో దొరగ్గానే ఇంత ఆవేశపడిపోయి బైటకే ఆలోచించేత్తే ఎట్టా? ఆలోచనలు ఓవర్ ఫ్లో అంటే ఇదే …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions