.
ఆయన తోవన ఆయన పాపం ఫార్మ్ హౌస్ లో పండుకుంటే… ఆ బీజేపీ ఎన్వీఎస్ ప్రభాకర రావు మీడియా వాళ్ళ ఆకలి తీర్చే పెద్ద చర్చ పెట్టాడు
జూన్ 2 కానీ డిసెంబర్లో కానీ BRS పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేసీఆర్ సీఎం అవుతాడని డేట్లతో సహా చెప్పేశాడు
Ads
తద్వారా తిరిగి కేటీఆర్ కు అధికారం అప్పచెప్పి, ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతాడనే ఇంకో కొత్త చర్చ లేవనెత్తారు
ఇంకేముంది మీడియాకు మేత దొరికింది, ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ప్రభాకర రావు వాఖ్యలను పట్టుకుని ముందుగా హరీష్ రావు ను గిల్లారు… కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమేనా? అని
మీడియా వాళ్ళు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ హరీష్ రావు ను గిల్లడం ఇదే మొదటిసారి కాదు
TRS పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి గిల్లుతూనే ఉన్నారు
గిల్లీ గిల్లీ వాళ్లకు చేతులు నొప్పెట్టినాయేమో కానీ హరీష్ రావు నోటి వెంట కేసీఆర్ కు వ్యతిరేకంగా ధిక్కార స్వరం రాబట్టలేకపోయారు
TRS పార్టీని హరీష్ రావు నిట్ట నిలువునా చీల్చేస్తాడని గంపెడు ఆశలు పెట్టుకున్న వారి ఆశల మీద అప్పట్లోనే బిందెడు నీళ్లు జల్లేశాడు
TRS కాస్తా BRS అయ్యింది
అధికారం కోల్పోయింది
అయినా హరీష్ రావు అలానే ఉన్నాడు
ఒక్కమాటలో చెప్పాలంటే హరీష్ రావు కేసీఆర్ కి వీర భక్త హనుమాన్
ప్రస్తుతానికి ఈ ఫెవికాల్ బంధాన్ని ఎవరూ విడదీయలేరు
భవిష్యత్తులో కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు హరీష్ రావు ఇప్పటిలానే విధేయుడిగా ఉంటాడా? లేకపోతే చీలిక బాట పట్టి సొంత కుంపటి పెట్టుకుంటాడా? అనేది కాలమే నిర్ణయిస్తుంది
***
హరీష్ రావు విషయం కాసేపు పక్కనబెట్టి కేసీఆర్ దగరకొస్తే ,
ఆ ఎన్విఎస్ ప్రభాకర రావు చెప్పినట్టు కేసీఆర్ అంత తేలిగ్గా BRS పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి సీఎం అయిపోదామనే మూర్ఖ ఆలోచన అయితే చేయరని అనుకుంటున్నాను
కేసీఆర్ BRS పార్టీని పెట్టుకున్నదే రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్ కు అప్పచెప్పి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని
రాజకీయాల్లో గెలుపోటములు సహజం అన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు
ప్రస్తుతానికైతే కేసీఆర్ ది వేచి చూచే ధోరణే
కేసీఆర్ రెండే రెండు ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు
వాళ్లలో వాళ్ళు కొట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే అధికారం ఒడిసి పట్టుకోవడం మొదటిది
నిజానికి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే
మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దానంతట అదే కుమ్ములాటలతో కూలిపోతుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు
కానీ రేవంత్ ఏం మాయ చేశాడో, అదృష్టమో కానీ అసంతృప్తులను మ్యానేజ్ చేస్తూ కానీ బానే బండి లాక్కొస్తున్నాడు
మిగిలిన పదవీ కాలం వేచి చూసి రాబోయే ఎన్నికల ముందు తిరిగి క్రియాశీలకంగా ఫుల్ టైం రాజకీయాలు చేయడం కేసీఆర్ ముందున్న రెండో ఆప్షన్
కాబట్టి ఈ దశలో కేసీఆర్ తన పార్టీ BRS ను కాంగ్రెస్ లో కలిపేసి సీఎం అవుతారనేది పూర్తిగా ఊహాజనితమైన ఆలోచన
వ్యూహం పన్నడంలో కేసీఆర్ దిట్ట
ప్రత్యేక తెలంగాణా ఇస్తే చాలు TRS ను కాంగ్రెస్ లో కలిపేస్తానని చెప్పి చివరికి ఏం చేశాడో అందరికీ తెలుసు
కేసీఆర్ కి పార్టీ కావాలి
అధికారం కూడా కావాలి
ఆ దిశగానే ఆయన అడుగులు ఉంటాయే కానీ అధికారం కోసం పార్టీని అమ్మేయలేరు
ఒకవేళ ఎన్విఎస్ ప్రభాకర రావు చెప్పినట్టు కేసీఆర్ BRS పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి సీఎం అయితే ఆయనకు అదే ఆఖరి పదవి అవుతుంది!
అదీ సంగతి
అవునూ, కేసీయార్ పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్‌లో గనుక తన పార్టీని విలీనం చేస్తే, ఫాఫం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు..? ఏం చేయాలి..? పాత కాంగ్రెస్, పాత టీడీపీ, పాత టీఆర్ఎస్, పాత ఏబీవీపీ వాసనలతో ఇక ఎటు పోవాలి… అది కదా అసలు పెద్ద ప్రశ్న…… పరేష్ తుర్లపాటి
Share this Article