రేవంత్‌పై తిరుగుబాటు… నిన్నటి నుంచీ తెలంగాణ రాజకీయాల్లో ఒకటే కలకలం… అసలు కాంగ్రెస్‌లో ఇవన్నీ జరగకపోతే ఆశ్చర్యం, జరిగితే పెద్ద వార్తేముంది..? పార్టీకి జాతీయ స్థాయిలో సమర్థ నాయకత్వం లేదు, అన్నింటికీ మించి క్రైసిస్ మేనేజర్లు లేరు… అదొక పెద్ద సమస్య… కాబట్టి ఇది ఇంకా ముదిరి నిజంగానే రేవంత్ పోస్టుకు ఎసరు పెట్టవచ్చు కూడా… అయితే పార్టీ సీనియర్ల బ్లాక్ మెయిలింగుకు రాహుల్ తలొగ్గుతాడా..? ఇదీ అసలు ప్రశ్న…
వలసవాదులు వర్సెస్ ఒరిజినల్స్ అనే సూత్రీకరణ చదువుతుంటేనే నవ్వొస్తుంది… కాంగ్రెస్‌లో ఒరిజినల్స్, వలసవాదులు అనే తేడా ఏమీ ఉండదు… అదొక ప్రవాహం… రకరకాల పాయలుగా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు నేతలు… అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి..! నిజానికి రేవంత్ పోతే ఏమవుతుంది..? ఏమీకాదు, కాంగ్రెస్ మరింత కుదేలవుతుంది… బీజేపీ హేపీ, బీఆర్ఎస్ హేపీ… ఈ సోకాల్డ్ సీనియర్లు ఇప్పటిదాకా కేసీయార్‌కు దీటుగా ఉద్దరించింది ఏమిటట..?
ఈ ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది… రేవంత్ దూకుడు సరే, కానీ తను పీసీసీ పగ్గాలు తీసుకున్నాక పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ అయితే వచ్చింది… పలు భేటీలు, ఆందోళనలతో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది… అంతకుముందు ఏముంది..? కేసీయార్ మాటలకు కౌంటర్ ఇచ్చే దిక్కుకూడా లేదు కదా… కేసీయార్ వరుస దెబ్బలు కొడుతూ, కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేస్తుంటే, చీలికలు పేలికలు చేస్తుంటే ఒక్కరూ సరిగ్గా నిలబడి, భరోసా ఇచ్చింది లేదు…
Ads
ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ గెలిచిన చిన్న ఎన్నిక ఉందా..? మందలుగా ఎమ్మెల్యేలు వెళ్లిపోలేదా..? అప్పుడు సేవ్ కాంగ్రెస్ నినాదం గుర్తు రాలేదా..? ఎస్, కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఓ సందేహం ఉంది… పీసీసీలో కేసీయార్ కోవర్టులు చాలామంది ఉన్నారని..! ఆ సందేహనివృత్తి జరిగేలా పనిచేయాల్సింది కాంగ్రెస్ ముఖ్య నాయకులే… కానీ ఇప్పటికీ చేస్తున్నది ఏమిటి..? పార్టీని మరింత అస్థిరత వైపు తీసుకెళ్తున్నారు… తద్వారా మళ్లీ కేసీయార్‌కే ఉపయోగపడుతున్నారు… పీసీసీ కమిటీల్లో సగం టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారని ఓ ఆరోపణ… అసలు ఆ కమిటీలతో ఒరిగేదేమిటి..? అసెంబ్లీ టికెట్లకు ఆ కమిటీలకు ఏమైనా లింక్ ఉందా..? మరెందుకు ఈ సాకులు..?!
తప్పేముంది..? ఒకసారి పార్టీలోకి వచ్చాక కాంగ్రెస్‌వాళ్లే అవుతారు గానీ, ‘‘పచ్చ కాంగ్రెస్’’ అని వేరే విభాగం ఉందా..? ఇదంతా ఒకవైపు వాదన… మరోకోణం చూద్దాం… రేవంత్‌ను కాదు, అంతకు వందరెట్లు దూకుడు పోకడ ఉన్నవాళ్లకైనా కాంగ్రెసే సరైన వేదిక… వాళ్లు వేరే పార్టీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇమడరు… అదొక అడమెంటాలిటీ… కాకపోతే ముఖ్యమైన పోస్టుల్లో అలాంటివాళ్లను ఉండనివ్వరు… అదీ కాంగ్రెస్ కల్చరే… సో, ఇవన్నీ సహజమే అనుకుని, జరగబోయేది చూడటం రేవంత్ కర్తవ్యం…
లేదంటే వేరే మార్గమేమీ లేదు… మరీ వైఎస్సార్టీపీలోకి పోలేడు కదా… బీజేపీ వాళ్లు అప్పట్లో అప్రోచ్ అయితేనే సీఎం కేండిడేట్ అని ప్రకటించాలని షరతు పెట్టాడని ఓ టాక్ ఉంది… బీజేపీలో అది సాధ్యం కాదు… ఇక వెళ్తే టీడీపీలోకి వెళ్లిపోవాలి… కానీ తెలంగాణ జనం పెద్దగా హర్షించరు… ఉన్న సపోర్ట్ కూడా పోతుంది… బీఆర్ఎస్ మెట్లు కూడా ఎక్కనివ్వడు కేసీయార్…
సో, మిగిలింది సొంత పార్టీ… నిజానికి ఈ కాంగ్రెస్ కోసం తన డబ్బును, తన ఆలోచనల్ని, తన కాలాన్ని వృథా చేసుకున్నాడు రేవంత్… సొంత పార్టీ పెట్టుకుని, పాదయాత్రతో ఇప్పటికే సగం తెలంగాణ కవర్ చేసి ఉంటే, ప్రెషర్ లీడర్‌గా ఎమర్జయ్యేవాడు… సో, ఎంతసేపూ చంద్రబాబు ఆలోచనలను బట్టే కాదు రేవంత్ భయ్యా, సొంత ఆలోచనలకూ పదును పెట్టాలి…!! ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు… చాలామంది కలిసొస్తారు..!!
Share this Article