నిజమే, ఓ తెలుగు పత్రికలో కనిపించింది ఓ ఇంట్రస్టింగ్ అబ్జర్వేషన్… బాలీవుడ్‌లో హీరోలుగా చెలామణీ అయ్యే పాపులర్ నటులు కూడా ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో కేరక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధపడుతున్నారు… చాలా ఉదాహరణలు కూడా కనిపించాయి… అభినందనీయం… అసలు వాస్తవంగా హీరో అనే పదానికే అర్థం లేదు… జస్ట్, లీడ్ యాక్టర్, లేదా లీడ్ యాక్ట్రెస్… ఈ హీరోయిజాన్ని జనం మీద రుద్ది, ఫ్యానిజాన్ని పెంచి, కంపుకంపు చేసింది మన టాలీవుడ్… అఫ్‌కోర్స్, కొంతవరకు కోలీవుడ్ కూడా… మలయాళ, కన్నడ నటులు కూడా కేరక్టర్ పాత్రల్లో నటించడానికి సై… ఎటొచ్చీ మనవాళ్లే… ఆ హీరో కుర్చీ దిగరు… నటన అక్కర్లేదు… అవే మూస ఫైట్లు, మూస కథలు, మూస గెంతులు, మూస ఐటమ్ సాంగ్స్… ఏజ్ బార్ అయిపోయినా సరే కుర్ర తెల్లతోలు యువతులతో బూతుపాటలు… వీళ్లు సొసైటీకి నీతులు చెబుతారు పైగా…
నాగార్జున ఒక్కడే ఈ సూత్రీకరణలకు కాస్త మినహాయింపు… హిందీ భారీ మూవీ బ్రహ్మాస్త్రలో ఓ చిన్న పాత్ర చేస్తున్నాడు… మలయాళ భారీ సినిమా మరక్కర్‌లో కూడా ఓ పాత్రకు రెడీ అయ్యాడు, ఏమైందో వర్కవుట్ కాలేదు… మరి మిగతా వాళ్లు..? నిల్..! సల్మాన్ ఖాన్ రేంజ్ తెలిసిందే కదా… తను చిరంజీవి హీరోగా రూపొందే గాడ్‌ఫాదర్ సినిమాలో ఓ పాత్ర పోషించబోతున్నాడు… అదే సల్మాన్ ఏదైనా సినిమా సంకల్పిస్తే చిరంజీవి హీరోయేతర పాత్రకు రెడీ అవుతాడా..? నెవ్వర్…! చిరంజీవిదే ఏదో సినిమా, నవాజుద్దీన్ సిద్దిఖి కూడా ఓ పాత్ర పోషణకు సై అన్నాడని ప్రచారం సాగింది, కానీ జరగలేదు…
Ads
ప్రభాస్ నటించే మరో భావీ సినిమా ఆదిపురుష్… అందులో రాముడిగా ప్రభాస్… రావణుడిగా సైఫ్ అలీ ఖాన్… మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌లో ఇద్దరు తెలుగు లీడ్ యాక్టర్స్ సమప్రాధాన్యం ఉన్న కథానాయకులు… కానీ అజయ్ దేవగణ్ ఓ పాత్రకు ఒప్పుకున్నాడు, చేశాడు… అంతెందుకు..? మోహన్‌లాల్ జనతా గ్యారేజీ చేశాడు… మనమంతా సినిమాలో ఓ మామూలు పాత్ర పోషించాడు… చిరంజీవి సైరా సినిమాలో అంతటి అమితాబ్ ఓ పాత్ర చేశాడు… ప్రభాస్ ప్రాజెక్ట్-కె మూవీలో అమితాబ్ చేయనున్నాడు… వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి చేస్తున్నారు… మరక్కార్‌లో అర్జున్, సునీల్ శెట్టి మామూలు పాత్రలు చేశారు…
అఫ్ కోర్స్, ఇప్పుడందరూ పాన్ ఇండియా ట్రెండ్‌లో పడి కొట్టుకుపోతున్నారు కాబట్టి, హిందీ డబ్బింగ్ వెర్షన్లకు సరైన మార్కెటింగ్, హైప్ కావాలి కాబట్టి ఎవరో ఓ హిందీ నటుడిని తెచ్చిపెడుతున్నారు అనుకుందాం… అదే పనిని కన్నడ, తమిళం, మలయాళం నిర్మాతలు చేస్తే… ఈ సోకాల్డ్ తెలుగు హీరాధిహీరులు చిన్న పాత్రలకు అంగీకరిస్తారా..? ఉదాహరణకు… మలయాళంలో బన్నీ అంటే మస్త్ క్రేజ్ ఉంది… ఇదే మోహన్‌లాల్ లేదా ఇంకెవరైనా పెద్ద హీరో ఏదైనా పాన్ ఇండియా భారీ మూవీ తీస్తూ, మలయాళం మార్కెట్ కోసం బన్నీని ఏదైనా పాత్ర చేయమని అడిగితే చేస్తాడా..?! నెవ్వర్…!! పోనీ, సెకండ్ లేయర్ హీరోలు వెళ్లి చేస్తారా..? చేయరు…!!
Share this Article