రిషబ్ శెట్టితో కైలాట్కం, కన్నడ ఇండస్ట్రీతో గోకుడు గట్రా వార్తలు చదివీ చదివీ రష్మిక మంథన ఉత్త తింగరిది అనుకుంటాం గానీ… తను మంచి స్ట్రాటజీతోనే ముందుకు పోతోంది… ఆ వారసుడు సినిమాలో ఓ ఎక్సట్రా ఆర్టిస్టు పాత్రతో సమానంగా నీ పాత్ర ఉంది, జస్ట్ రెండు పాటల కోసం నిన్ను పెట్టుకున్నట్టున్నారు, అందులో ఓ హిట్ సాంగ్ రంజితమే… అంతకుమించి ఆ సినిమాతో నీకొచ్చిన ఫేమ్ ఏముంది..? డబ్బు వచ్చి ఉండవచ్చుగాక, కానీ ఇజ్జత్ పోలేదా అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు ఓ తాజా ఇంటర్వ్యూలో…
నిజానికి మంచి ప్రశ్న… వారసుడిలో పరమ దరిద్రపు ప్రాధాన్యం ఆమె పాత్రకు… కానీ దాన్ని ఆమె భలే సమర్థించుకుంది… రెండు పాటల పాత్రే అని నాకు ముందే తెలుసు, ఆ స్పృహలోనే ఉండి అంగీకరించాను… నాకు విజయ్ సినిమాలో నటించడం కావాలి… అదే టార్గెట్… ఆ పాటలు లేకపోయినా పర్లేదు… సరదాగా నవ్వుతూ విజయ్‌తో కూడా చెప్పాను ఈ సంగతి అని వివరణ ఇచ్చింది… నిజమే… తనకు తమిళంలో ఓ స్టాండ్ కావాలి… అంతకుముందు ఏదో సుల్తాన్ చేసింది గానీ ఎవరూ దేకలేదు…
Ads
ఈసారి విజయ్ పక్కన నటిస్తే అందరి చూపూ ఆమెపై పడుతుంది… తమిళంలో చాన్సెస్ దొరుకుతాయి… ఒక్కసారి తమిళంలో నాలుగు మంచి బ్యానర్లు దొరికితే ఇక కావల్సిందేముంది..? ఎలాగూ తెలుగులో బాగా క్లిక్కయి, మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె… ఇక హిందీలో కూడా గుడ్ బై చేశాక, మిషన్ మజ్ను దొరికింది… ఇప్పుడు యానిమల్ అని మరో సినిమా చేతిలో ఉంది… నువ్వు మరీ భోజ్‌పురి సరుకు, చాన్నాళ్లు ఇక్కడ ఉండలేవు, సామాను సర్దుకో అని కేఆర్కే వంటి తిక్క సమీక్షకులు అప్పుడే ఆమెపై సెటైర్లు వేస్తున్నారు… అంటే హిందీ మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోందన్నమాట…
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మంచి కమర్షియల్ పాత్రలు దొరికితే డబ్బు, ఫేమ్, పాపులారిటీ అదే వస్తుంది… ఆ ఊపులో కొన్నేళ్లు లాగించొచ్చు కెరీర్‌ను… అందుకే ఆమె ‘రెండు పాటల పాత్రయినా నాకు ముద్దే’ అని వ్యాఖ్యానించింది… కన్నడం తన మాతృఇండస్ట్రీ… ఇప్పుడు కాస్త ఇబ్బందులున్నా సరే, సెట్ రైట్ చేసుకోవచ్చు… నాలుగు ప్రధాన భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు చేజిక్కించుకుంటే, పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతే, రష్మిక వంటి తారకు ఇంకేం కావాలి..? పైగా ఉదాత్తమైన పాత్రలు, హీరోయిన్ ప్రయారిటీ పాత్రలు అని గిరిగీసుకునే రకం కూడా కాదు… బేశరం రంగ్ తరహా ఎక్స్‌పోజింగ్‌కు కూడా సై అనే తత్వం ఆమెది… సో, స్ట్రాటజీ ఉన్న బుర్రే…
Share this Article