దక్షిణాఫ్రికాల తెల్లోడు మోహన్ దాస్ కరంచంద్ ను రైలుడబ్బలకెల్లి కిందికి నూకకుంటె మనకు సొతంత్రం రాకపొయ్యుండె…!
బ్రిటీషోడు మనల బాగజేసుడు “వైట్ మాన్ బర్డెన్” అన్న తీర్న అయ్యదేవర కాళేశ్వరరావు సారు తెలంగాణను బాగజేసుడు “ఆంధ్రమాన్ బర్డెన్” అనకపొయ్యుంటె జయశంకర్ సారుకు విడిపోదామనే పిచ్చి పట్టకుండె..!
సుమన్ జైలుకువోకపోతె శిరంజీవి మెగాస్టారు కాకపోతుండె..!
సుమన్ సచ్చిపోకుంటె, ప్రభాకర్ ఈటీవీలనే పనిజేస్తుండె…!
ప్రజారాజ్యం గిట్ల పవర్లకొస్తె, జనసేన జాడకు లేకపోతుండె..!
మియామల్కోవా పుట్టకుంటె, ఆర్జీవీకి పిచ్చులు పుట్టకుంటుండె…!
ఎన్టీవోడిని కాంగిరేసోళ్లు రాజ్యసభకు పంపితె, తెలుగుదేశం పార్టీ పుట్టకవోతుండె..!
తెలుగుదేశం పార్టీ గిట్ల 1983 ల పుసుక్కున ఓడిపోతె, శెంద్రబాబు సారు కాంగ్రెసును ఇడువకపోతుండె..!
శెంద్రబాబు సారు ఓ మంత్రిపదవినిస్తె కేసీఆర్ తెరాస పెట్టకపోతుండె…!
కేటీయార్ సారు కేసీఆర్ కడుపున పుట్టకపోతె, పొట్టకూటి కోసం గచ్చిబౌలిల ఏదో నౌకరు జేస్తుండె..!
పాదయాత్రలు జెయ్యకుట్టె, వయ్యెస్సారు ముక్యమంత్రి కాకుంటుండె..!
వయ్యెస్సారు సచ్చిపోకుట్టె, జగన్ సారు బెంగులూర్లనే ఉంటుండె..!
గా వైయెస్సారు సచ్చిపోంగనే జగన్ను ముక్యమంత్రిని జేస్తె, వయ్యెస్సార్సీ పుట్టకుంటుండె…!
బీజేపీ అలయెన్సు వెట్కోని, ఆంధ్రల శెంద్రబాబు పార్టీ గెలిస్తె లోకేష్ సారు ముక్యమంత్రి ఐతుండె..!
ప్రశ్నలకు సవుదానం దొర్కితె, పవన్ సారే ముక్యమంత్రి ఐతుండె..!
ప్రభువు ప్రార్ధనలింటె పాల్ సారే ముక్యమంత్రి ఐతుండె…!
****
నరేందర్ సారు, అమితం సారు ఇద్దరూ దినాం దేవుండ్లకు ఏమ్మొక్కుతరో ఎర్కేనానుల్లా..?
“దేవుడా..! ఓ మంచి దేవుడా..! కేరలల కమ్యూనిస్టోల్లు శబరిమల జోలికి పోవాల్నంటె ఉచ్చ పడితట్టు జేశినవ్..!
జులూజ్ లల్ల తుర్కోల్ల తోటి దేశపు జెండ మోపిచ్చుకుట్ట స్లోగన్లు ఇప్పిచ్చినవ్..!
నలబై ఏండ్ల కచ్చీ జవాన్ పోరగాండ్లు ఏ పాటి సద్వుకుట్టుర్రో దునియకు సూపిచ్చినవ్..!
అచ్చంతలకు, ఆరతికి ఫరక్ తెల్వని దేడ్ దిమాకు గాల్లందరిని మాకోసం ఓ #మెజారిటీవోటుబ్యాంకును జేశినవ్..!
మమ్ముల తిట్టెటోల్లు గుడ్క మాకే వోట్లను పెంచే పనిముట్లను జేశినవ్…!
ఉల్లిగడ్డ రేటు కిలకు నూటాబై దాటినా, నాకు ఫరక్ వడదు. మేం బాపనోల్లం, ఉల్లిపాయ తినం అనుకుట్ట మాడికాయ తొక్కు కల్పుకునే పైసల మంత్రి ముచ్చటా,
పాతనోట్లను పాతర వెట్టినా, నోటిని తెర్వని పైసల మంత్రి ముచ్చటా అడగకుట్ట
బడి ముచ్చట యాది మరిశి, గుడి ముచ్చట మాట్లాడుకునే ఈ పాగల్ గాండ్లకు దిమాకు పెంచకు తండ్రీ..!” అని దినాం దండాలు వెడ్తరు. గీ డిల్లల రైతుల కొట్లాటకు గుడ్క ఏదో కనిపించని కారణం ఉండే ఉంటది
****
అందుకని, ఇయ్యాల మన తక్లీఫ్ లన్నిటికి గా సౌతాఫ్రికా రైలుడబ్బల కెంచి గాంధిని కిందికి నూకిన తెల్లతోలు టికెట్ శెకింగోడని నాకర్దమైంది..!………. By…….. Gottimukkala Kamalakar…………………….
Share this Article