Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎంగా ఉన్నప్పుడు సరే… కానీ సొంతిల్లు అనుకుంటోంది, ఖాళీ చేయదట…

October 28, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ………… నేనెక్కడికి వెళ్ళాలి ? J&K మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ! తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.

2005 నుండి ఈ మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ముఫ్తీ ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ లో ఉంటున్నది. అప్పట్లో మెహబూబా ముఫ్తీ తండ్రి అయిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ లో ఉండేవాడు. అప్పటినుండి మెహబూబా ముఫ్తీ అదే ఇంట్లో ఉంటూ వచ్చింది.

అక్టోబర్ 15 న మెహబూబా ముఫ్తీ తో పాటు మాజీ శాసన సభ్యులు అందరూ కూడా గుప్ కార్ రోడ్ లోని ప్రభుత్వ బంగాళా లలో ఉంటున్నారు. ఖాళీ చేయమని నోటీసు అందుకున్న వారిలో నాజిర్ గురేజీ [NazirGurezi] కూడా ఉన్నాడు.

Ads

2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అధికార నివాసాలని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి గాను పదవీ విరమణ చేసిన 6 నెలల లోపు తమ తమ అధికార నివాసాలని ఖాళీ చేయాలని ఎస్టేట్ డిపార్ట్మెంట్ రూల్స్ ని మార్చింది . ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ సవరించిన రూల్స్ ప్రకారం 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటున్న వారందరినీ ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చింది.

గుప్కార్ రోడ్ లోని ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ కి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు మెహబూబా ముఫ్తీ ఉంటున్న ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ కి పాపా -2 [PAPA-2 ] అనే కోడ్ నేమ్ ఉండేది గతంలో. పాపా -2 అంటే టార్చర్ పెట్టే ప్రదేశం అని కోడ్ నేమ్ !

1989 వరకు ఫెయిర్ వ్యూ రెసిడెన్సీ అధికార నివాసం గా ఉండేది కానీ తరువాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ఇంటిని తమ అధీనంలో తీసుకొని దానికి పాపా -2 అనే పేరు పెట్టింది. పాపా -2 అప్పట్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంటరాగేషన్ మరియు టార్చర్ చేయడానికి వాడుకునేది. ఉగ్రవాదు లని అరెస్ట్ చేసిన తరువాత వాళ్ళని పాపా-2 కి తీసుకొచ్చి రహస్యాలని తెలుసుకోవడానికి ఈ రెసిడెన్సీ లో చిత్రహింసలకి గురిచేసేవాళ్ళు. ఎవరన్నా ఉగ్రవాది హఠాత్తుగా కనిపించకపోతే వాళ్ళు పాపా -2 లో ఉండి ఉండవచ్చు అని అనుకునేవారు అప్పట్లో.

అలా 1989 నుండి 1996 వరకు పాపా -2 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలోనే ఉండేది. 2003 తరువాత దానిని పునర్నిర్మించి ఆధునిక సదుపాయాలు కల్పించారు. 2005 లో అప్పటి J&K ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అధికార నివాసం గా మారిపోయింది.

గత 17 ఏళ్లుగా ఫెయిర్ వ్యూ నివాసంలో ఉంటూ వచ్చిన మెహబూబా ముఫ్తీ కి ఇప్పుడు ఆ నివాసం ఖాళీ చేయడానికి ఇష్టపడడం లేదు. ఉచితంగా ఉంటూ వచ్చిన దాన్ని ఖాళీ చేసి అంతే సౌకర్యాలు ఉన్న మరో ఇంటిలోకి వెళ్లాలంటే పాపం బాధగా ఉందిట ! మెహబూబా ముఫ్తీ చాలా బీదరికంలో ఉంది మరి ! ఎంత బీదరికం అంటే పిల్లలు బ్రిటన్ లో చదివి అక్కడే స్థిరపడిపోయేంత బీదరికంలో ఉంది !

పాపం అమాయక కాశ్మీరీ యువతకేమో పోలీసుల మీద రాళ్ళు వేసినందుకు కాను రోజుకి 500 ఇచ్చేదీ ! తన పిల్లలు మాత్రం బ్రిటన్ లో హాయిగా చదువులు పూర్తి చేసుకొని అక్కడే స్వంత ఇళ్ళు కొనుక్కొని హాయిగా ఉంటున్నారు ! ఇప్పుడు పెద్ద బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చేసరికి బాధగా ఉంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటూ బీద అరుపులు అరుస్తున్నది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions