.
బీజేపీ వేరు- హిందూ ధర్మం వేరు… బీజేపీకి దీని మీద పేటెంట్ రైట్స్ ఏమీ లేవు… ఈ సోయి యాంటీ బీజేపీ పార్టీలకు లేదు… స్టాలిన్, మమత, అఖిలేష్, లాలూ, లెఫ్ట్ తదితర ప్రతిపక్ష నేతలు వాళ్ల మిథ్యా లౌకిక వాదంతో హిందువుల్ని బీజేపీ వైపు నెట్టేస్తున్నారు… అఫ్ కోర్స్, రామజన్మభూమిని శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించిన కేసీయార్ తక్కువేమీ కాదు…
కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ హిందూ వ్యతిరేకం… కేరళలో, శబరిమల- రుతుమహిళల విషయంలో సీపీఎం ప్రభుత్వం ఎలా హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరించిందో చూశాం కదా… సీపీఐ అయితే ఈ ధోరణి తీసుకున్నందుకు లెంపలేసుకుంది కూడా… బెంగాల్ సరేసరి…
Ads
తమిళనాడులోనూ అంతే, ఇంకా ఎక్కువ… నాస్తికుడు స్టాలిన్ కొడుకు ఏకంగా సనాతన ధర్మం ఓ టైఫాయిడ్, ఓ వైరస్ వ్యాధి అని తీర్మానించేశాడు… తను కాబోయే ముఖ్యమంత్రి అట… తమిళ హిందువుల ఖర్మ… సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..? ఓ గుడి గుట్టపై దీపస్థంభం మీద దీపం వెలిగించుకోవడానికి కూడా అక్కడ పోరాడాల్సి వస్తోంది…
తమిళనాడులో ఎక్కడైనా… గుళ్లు ఉన్న గుట్టల మీద దీపాలు వెలిగించడం ఆనవాయితీ… అరుణాచలం కావచ్చు, మరేదైనా కావొచ్చు… సేమ్, అదే సంప్రదాయం ఉన్న శబరిమలలో కూడా..! ఐతే ఒక గుడిలో దీపం వెలిగించుకోవడానికి న్యాయస్థానాలు అంగీకరించినా సరే, స్టాలిన్ ప్రభుత్వం అణిచివేస్తోంది… సింపుల్, అది 100 శాతం హిందూ వ్యతిరేక పార్టీ కాబట్టి… మనోభావాలు అనే పదం మైనారిటీలకు తప్ప మెజారిటీ ప్రజలకు వర్తిస్తుందని అది గుర్తించదు కాబట్టి…

వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు… మధురై దగ్గర ఓ ప్రాచీన ఆలయం… తిరుప్పరంకుండ్రం… మురుగన్ అంటే కుమారస్వామి దేవాలయం ఉన్న ఊరు… స్వామి వారి ఆరు ముఖ్య దేవాలయాల్లో ఇది ఒకటి… ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి… దీనికి తమిళనాడులోని అన్ని ప్రాంతాలు నుండే కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు…
ఇక్కడ ఓ కొండపై 6 – 8 శతాబ్దాలలో పాండ్య రాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది… ఒక దీప స్తంభం కూడా ఉంది… కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం శతాబ్దాలుగా ఉన్న ఆచారం… 14వ శతాబ్దంలో మధురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది… దేశమంతా ఈ విధ్వంసం జరిగిందే కదా…
విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు… 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి, దానిని సికిందర్ షా దర్గాగా మార్చారు…
హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్య రాజుల శిల్ప కళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికి కనిపిస్తాయి… ఓ క్రోనాలజీలో చెప్పుకుందాం…
1) 1923లో మధురై సబార్డినేట్ జడ్జి ‘ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు, అంతా మురుగన్ ఆలయ ఆస్తి’ అని తీర్పు ఇచ్చాడు.., కేవలం నెల్లి తోపు, అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కులిచ్చి, ఇక్కడ ఎవరూ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు,, సమాధులు నిర్మించడాన్ని నిషేధించించాడు…
2) ఈ తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు సమర్థించింది… హిందూ దేవాలయ ప్రాంతంలో అంతు బలులు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో, 2025 ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతుబలులు నిషేధించింది…
3) ఈ ప్రాచీన దీప స్తంభం మీద ఇకపై ప్రతీ సంవత్సరం దీపం వెలిగించుకోవడానికి హిందు మున్నాని నేత రామరవికుమార్, మరో 10 మంది అనుమతి కోరితే… 2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్) దీప్ థూణ్‌లో వెలిగించడానికి అనుమతి ఇచ్చింది, ఇది ‘తమిళ సంప్రదాయం’ అని, దర్గా హక్కులను ప్రభావితం చేయదని పేర్కొంది…
4) డిసెంబర్ 3వ తేదీన CISF రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది… కానీ మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు… సెక్షన్ 144 క్రింద నిషేదాజ్ఞలు విధించారు…
5) రామా రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసింది… 4వ తేదీన మద్రాస్ హై కోర్ట్ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు సమర్థిస్తూ… దీపం వెలిగించడానికి వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వ అప్పీల్ కొట్టేసింది…
6) ఐనా తమిళనాడు ప్రభుత్వం ఊరుకోలేదు… ఏకంగా సుప్రీంకోర్టు లో ‘అర్జంట్ లిస్టింగ్’ కోరింది… స్పెషల్ మెన్షన్ అవసరం లేదు, నంబరింగ్ చేసి లిస్ట్ చేయండి అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు…
….. చివరకు ప్రభుత్వమే మొండిపట్టుతో దీప్ థూన్‌లో దీపం వెలిగించనివ్వలేదు, కొంత ఉద్రిక్తత, ఘర్షణ తరువాత చివరకు దీప మండపంలో దీపం వెలిగించారు ఎప్పటిలాగే… నిష్ఠురంగా ఉండే నిజం ఏమిటంటే... మెజారిటీ ప్రజలు తమ మతభావాలు, మనోభావాల కోసం తమ ప్రభుత్వాలతోనే పోరాడాల్సిన దురవస్థ బహుశా ప్రపంచంలో ఈ దేశంలో మాత్రమేనేమో..!!
…. సోషల్ మీడియా, మీడియా వార్తలు, పోస్టుల ఆధారంగా పునర్లిఖితం…
Share this Article