………… By….. Bharadwaja Rangavajhala……………. బాలయ్య … బాలయ్య అంటే ఇవాళారేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించి ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే… తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేస్తారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన బాలయ్య … ఉన్నట్టుండి నిర్మాతగా మారారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా. దీంతో తన కథలతోనే స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. సక్సస్ అయ్యాడు.
బాలయ్య మద్రాసు గిండీ కాలేజ్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. తాపీ చాణక్య డైరక్ట్ చేసిన ఎత్తుకుపైఎత్తు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సుమారు 350 చిత్రాల్లో విభిన్న పాత్రలు చేసి ఏ కారక్టర్ ఇచ్చినా బాలయ్య శక్తి మేరకు నటించేస్తాడనే పేరు సంపాదించారు. కారక్టర్ రోల్స్ హీరో రేంజ్ లో చేయడం బాలయ్య స్పెషాల్టీ. టాలెంటుకు తగ్గ పాత్రలు రాలేదనే కసితో స్వంత చిత్ర నిర్మాణానికి దిగారు బాలయ్య. అలా తీసిన మొదటి చిత్రం చెల్లెలి కాపురం.
భారత చలనచిత్ర చరిత్రలో నటుడిగా రాణించి, ఆపై సినిమాలకు కథలు సమకూర్చి, నిర్మాతగా మారి, దర్శకత్వం నెరపి నాలుగు విభాగాల్లో ప్రజ్ఞాపాటవాల్ని చాటిన వారిలో బాలయ్య ఒకరు… వి.శాంతారామ్, రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, ఎన్.టి.రామారావు తదితరులు కూడా ఇదే రూట్ లో వెళ్లి తమ సత్తా ప్రూవ్ చేసుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకునే బాలయ్య తన మొదటి సినిమాకు తనే కథ సమకూర్చుకున్నారు. దర్శకుడుగా విశ్వనాథ్ అనుకున్నారు. బాలయ్య అప్పట్లో తుఫాన్ అనే పత్రికలో తెలుపు నలుపు అనే కథ రాశారు. దాన్నే తను ప్రారంభించిన అమృతా ఫిలింస్ తొలిచిత్రంగా తెరకెక్కించాలనుకున్నారు.
Ads
నవయుగ పర్వతనేని చంద్రశేఖరరావుగారితో చెప్తే … విశ్వనాథ్ ను డైరక్టర్ గా పెట్టుకోమని ఎడ్వైజ్ చేశారు. విశ్వనాథ్ నలుపు తెలుపు కథను మరింత సాన పెట్టారు. సినిమా అద్భుత విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించింది. విశ్వనాథ్ సూచన మేరకే తొలిచిత్రంలో శోభన్ ను హీరోగా తీసుకున్నారు బాలయ్య. ఆ తర్వాత సినిమా కోసం కూడా శోభన్ నే సంప్రదించారు బాలయ్య. నువ్వు కలర్ లో తీస్తే చేస్తాననడంతో కృష్ణకు మారారు. డైరక్టర్ మాత్రం విశ్వనాథే. సినిమా పేరు నేరమూ శిక్షా. డోస్టోవస్కీ క్రైమ్ అండ్ పనిష్ మెంట్ తెలుగునాట కూడా పాపులర్ అయిన నవల.
శిక్ష అనేది మనిషి అంతరంగాన్ని మార్చగలగాలనే కాన్సెప్ట్ తో సాగే ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. బాలయ్య తను తీసిన సినిమాలన్నిటికీ కథలు తనే తయారు చేసుకునేవారు. పైగా ఫ్యామ్లీ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పించేట్టుగా తీసేవారు. అశ్లీలత, అసభ్యత దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. పర్పస్ ఫుల్ మూవీస్ తీస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని నమ్మి తీసిన చిత్రాలే బాలయ్య సినిమాలన్నీ. నేరమూ శిక్షలో బాలయ్య నటుడుగా కూడా ఒక మెట్టు పైకెక్కాడు. నేరమూ శిక్షా ఎంతటి పేరు తెచ్చుకుందంటే. .. తమిళ సూపర్ స్టార్ తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎమ్జీఆర్ ఆ సినిమా చూసి మెచ్చుకోవడమే కాదు … తమిళ హక్కులు తీసుకుని తన బ్యానర్ లో రీమేక్ చేశారు. తెలుగులో బాలయ్య చేసిన కారక్టర్ ఆయనతోనే చేయించారు. రాజశ్రీ వారు అదే సినిమాను హిందీలో శిక్షా పేరుతో రీమేక్ చేశారు. అక్కడా అద్భుతమైన విజయం చవిచూసిందా చిత్రం.
వెంటనే బాలయ్యను పిల్చి మేకప్ చేసి కొన్ని షాట్స్ తీసి చక్రపాణిగారికి చూపించారు. ఆయన ఓకే అనడంతో అగ్గిరాజుగా బాలయ్య కంటిన్యూ అయ్యారు. ఈనాటి బంధం ఏనాటిదో తర్వాత మురళీ మోహన్ హీరోగా ప్రేమ పగ తీశారు బాలయ్య. ఈ చిత్రానికీ ఎస్.రాజేశ్వర్‌రావు నే కంటిన్యూ చేశారు. కలసిన హృదయాలలోన లాంటి హృద్యమైన గీతాలున్నాయి. బాలయ్య సంగీతం విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. కె.వి.మహదేవన్, ఎస్.రాజేశ్వరరావు, ఎమ్.ఎస్.విశ్వనాథన్ లాంటి సంగీత దిగ్గజాలతో ఆయన తన చిత్రాలకు సంగీతం చేయించుకున్నారు. నేరమూ శిక్షతో మొదలు పెట్టి అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో, ప్రేమ పగ ఇలా వరుసగా అమృతా వారి నాలుగు చిత్రాలకు సంగీతం అందించారు రాజేశ్వర్‌రావు.
Share this Article