బిగ్‌బాస్‌తో అభిజిత్ ఆడుకుంటున్నాడా..? అభిజిత్‌తో బిగ్‌బాస్ ఆడుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పగలిగినవారికి వచ్చే బిగ్‌బాస్ సీజన్లో నేరుగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు… నవ్వొస్తున్నదా..? నిజంగానే నవ్వులాట యవ్వారంగా మారింది బిగ్‌బాస్ ధోరణి… జనం నవ్వుకునేట్టుగా మారింది… బిగ్‌బాస్ ఏ సీజనైనా, ఏ భాషైనా సరే… కంటెస్టెంట్ల నడుమ పోటీ ఉంటుంది… కానీ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ మాత్రం బిగ్‌బాస్‌కూ అభిజిత్కూ నడుమ పోటీ సాగుతోంది… నిజంగా అభిజిత్ పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు…
అందరిలాగా బిగ్‌బాస్ ఏదో చెప్పగానే తను చేసేయడు… దాని వెనుక ప్లాన్ ఏముందా అని థింక్ చేస్తాడు… వద్దనుకుంటే బ్లంట్గా రెఫ్యూజ్ చేస్తాడు… చేయను అంటే ఇక చేయడు అంతే… బయటికి వెళ్లడానికైనా రెడీ… దాన్ని బిగ్‌బాస్ ఏమీ సీరియస్‌గా తీసుకోడు… పదే పదే అభిజిత్‌ను ట్రాపుల్లోకి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు… ఇరిటేట్ చేస్తాడు… టెస్ట్ పెడతాడు… అభిజిత్ ఏం చేస్తాడో చూద్దాం, నేనూ ఆడుకుంటానోచ్ అన్నట్టుగా ఉంటుంది ధోరణి…
ఇప్పటికి చాలాసార్లు బిగ్‌బాస్ చెప్పినవి అభిజిత్ తిరస్కరించాడు… ఈరోజు కూడా అంతే… అభిజిత్‌ను మరింత పరీక్షించడానికి అన్నట్టుగా బిగ్‌బాస్ ఓ ప్లాన్ వేశాడు… సరే, వేస్తే వేశాడు, మరి ఆ దిక్కుమాలిన ప్లాన్‌నైనా సరిగ్గా అమలు చేసి, ఆటను రక్తికట్టించాలి కదా… అభిజిత్‌ను క్రాస్ చేయాలి, కార్నర్ చేయాలి కదా… ఏదో అనివార్యత వైపు నెట్టేయాలి కదా అభిజిత్‌ను… అదేదీ చేయలేక చేతులెత్తేశాడు బిగ్‌బాస్… తుస్…
Ads
ఈ సీజన్ మొత్తం అఖిల్, అభిజిత్, మోనాల్ త్రికోణ లవ్ ట్రాక్ పంచాయితీతోనే సరిపోతోంది… ఎప్పటికప్పుడు తెగదెంపులు, మళ్లీ కొత్త బంధాలు… కిస్సులు, క్లారిఫికేషన్లు, హగ్గులు, అపార్థాలు… పోనీ, ఈ స్క్రిప్టులో మంచి మలుపు ఏమైనా ఉంటుందా అంటే అదీ ఉండదు… టీం స్క్రిప్టు రైటర్లు కొన్నిసార్లు అఖిల్‌ను లాగుతారు, లేదంటే అభిజిత్‌ను లాగుతారు… మళ్లీ ఇప్పుడు కూడా తాజాగా అభిజిత్, అఖిల్, మోనాల్ ఇష్యూయే టేకప్ చేశారు…
మీరు ఇద్దరూ ఆమెను ఏడిపించారు కాబట్టి, మీకు పోటీ పెడతాం, క్విజ్ పెడతాం, అరియానా ప్రశ్నలు అడుగుతుంది, ఎవరు గెలిస్తే వాళ్లు మోనాల్‌ను స్మశానవాటికలో డేట్‌కు తీసుకుపోవాలి అని ఆదేశం… ఛట్, మళ్లీ మళ్లీ మోనాల్ పంచాయితీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు, ఈ పోటీకి అంగీకరిస్తే నేను ఆమెను ఏడిపించినట్టుగా అంగీకరించినట్టే కదా… పైగా ప్రతిసారీ మాకే ఏమిటీ ఈ ఫిట్టింగు, ఏదో ట్విస్టు, తిరకాసు ఉంది అని బ్లంటుగా రెఫ్యూజ్ చేశాడు అభిజిత్… ఇక చేసేదేముంది..? బిగ్‌బాస్ చేతులెత్తేసి, పోనీ, నువ్వయినా తీసుకుపోరా బాబూ అని అఖిల్‌ను ఆదేశించాడు…
పోనీ, అదైనా సరిగ్గా ప్రొజెక్ట్ చేసి ఏడిచారా అంటే అదీ లేదు… స్మశానవాటికి ఇంపాక్ట్ చాలాపేలవంగా ఉంది… ప్రత్యేకించి లైట్లు ఎలా వాడుకోవాలో ఆ సెట్ మెయింటెనెన్స్ చేసేవాడికి వీసమెత్తు తెలియనట్టుగా ఉంది… ఆలోచన బాహుబలి స్థాయిలో, అమలు టీవీ సీరియల్ స్థాయిలో… అసలు ఈ స్మశానవాటిక ఎపిసోడ్ రక్తికట్టాలంటే అది పకడ్బందీగా ఉండాలి… ఆ సెట్‌కు లైటింగు సరిగ్గా ఉండాలి… మంచి చీకట్లో గానీ అది ఎలివేట్ కాదు… కానీ వెనుక వైపు హౌస్‌లో లైట్లు అలాగే ఉంటయ్, గార్డెన్లో వేసిన గ్రేవ్ యార్డులో సెట్లోనూ లైట్ల వెలుతురు… మొత్తం ఫీల్ అట్టర్ ఫ్లాప్… అసలు ఆ సెట్లో సొహెయిల్ పోల్ డాన్స్ దేనికి..? సమాధుల మీద ఓ జంట డేటింగ్ సరే, మళ్లీ దానికి నందికొండా వాగుల్లో అని ఓ పాత పాట వేసి, దానికి అఖిల్ డాన్స్ ఎందుకు..? అంతా చెత్తాచెత్తా చేసేశాడు బిగ్‌బాస్ ఈ టాస్కును…
నిజానికి అరియానాకు అద్దంలో ఓ దెయ్యం మొహం చూపించి, మంచి ప్రోమో కట్ చేసి, నిన్నటి నుంచి భలే ఆసక్తిని క్రియేట్ చేశారు… కానీ దాన్ని అదే టెంపోతో క్యారీ చేయలేకపోయారు… ఏదో జలజ అనే పేరున్న దెయ్యంగా డ్రామాను స్టార్ట్ చేశారు… సొహెయిల్, హారిక, అవినాష్, అఖిల్ జోకులు వేస్తూ, సెటైర్లు వేస్తూ ఆ దెయ్యం ఆడియోపాత్రతో ఆడుకున్నారు… ఆ దెయ్యం ఏదో ఆదేశిస్తే ఎహెపో నువ్వేమైనా బిగ్‌బాస్‌వా అనడిగేశారు, కడిగేశారు… ఆ గ్రేవ్ యార్డ్ తాలూకు సీరియస్ ఫీల్, ఇంపాక్ట్ రాకుండా చేసేశారు… ఈ దెబ్బకు దెయ్యం మాయమై, బిగ్‌బాస్ లెటర్ వచ్చేసింది… ఇది లగ్జరీ టాస్క్ అని అసలు నిజం చెప్పేసి, ఆ కాస్త టెంపోను కూడా తుస్సుమనిపించాడు బిగ్‌బాస్…
లగ్జరీ టాస్క్ అంటేనే రేపు ఏదో పోటీ ఉంటుంది… మరి దానికి ఇంత ముందస్తు డ్రామా అవసరమా..? చెట్టుకు ఆకులు లెక్కపెట్టు అని అభిజిత్‌కు ఆదేశిస్తే… అది బిగ్‌బాస్ నియమాలకు విరుద్ధం, ప్రాపర్టీ ధ్వంసం అవుతుంది, నేను చేయనుపో అంటూ అది కూడా రెఫ్యూజ్ చేశాడు అభిజిత్… రేపు ఈ టాస్క్‌లో అభిజిత్‌కు ఇంకేదో ఫిటింగ్ ఉండబోతోంది… ఇలా మొత్తానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌కూ అభిజిత్కూ నడుమ పోటీలాగే ఉంది… అవును, అదే జరుగుతోంది…!!
Share this Article