14.9.2022… బుధవారం… బిగ్‌బాస్ షో… రేటింగ్స్ తెలుసా..? 2.16 (హైదరాబాద్ బార్క్)… బిగ్‌బాస్ చరిత్రలో బహుశా ఇది అత్యంత దరిద్రమైన, దయనీయమైన రేటింగ్స్ కావచ్చు… ఏదైనా పనికిమాలిన, పాత చింతకాయ, డబ్బింగ్ సీరియల్‌ను ప్రసారం చేసినా దీనికన్నా ఎక్కువ రేటింగ్సే వస్తయ్… ఇంకా కావాలా..? 16.9.2022… శుక్రవారం 2.21… అంటే వారం ఏదయినా సేమ్… జనం అడ్డంగా తిరస్కరించేశారు… రాంగోపాలవర్మ తీసిన ఆఫీసర్ అనే సినిమాకన్నా డిజాస్టర్ ఇది… పోనీ, మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియా రిజల్ట్ అనుకొండి… టీవీ కోణంలోనే సుమీ…
15.9.2022… గురువారం… 2.25 రేటింగ్స్… అందరి కళ్లూ చల్లబడ్డాయా..? సీపీఐ నారాయణా, కళ్లల్లో నిప్పులు పోసుకుంటివి కదా… ఇప్పుడు నిమ్మలంగా ఉందా..? 13.9.2022… మంగళవారం… సేమ్ సీన్… డౌటే అక్కర్లేదు… జస్ట్ 2.45 రేటింగ్స్… నామినేషన్ల రోజు రేటింగ్స్ బాగుంటయ్, జనం చూస్తారు అంటారా..? 12.9.2022… సోమవారం… 2.60 రేటింగ్స్… సో, అర్థమైంది కదా… ఈ సీజన్ బిగ్‌బాస్ పాపులారిటీ ఏ రేంజులో ఉందో… ఇవన్నీ తాజా ఫిగర్స్…
Ads
చెత్తా కంటెస్టెంట్ల ఎంపిక… గీతూ రాయల్‌కు తప్ప అసలు ఎవరికీ బిగ్‌బాస్ ఆట ఏమిటో తెలియదు… దాని గురించి కూడా మనం సవివరంగానే చెప్పుకున్నాం కదా పొద్దున… సరే, నాగార్జున వేదిక మీదకు వచ్చి, అందరికీ క్లాస్ పీకి, పనిలోపనిగా ఆడించి, పాడించి, కాస్త ఎంటర్‌టెయిన్ చేయాల్సిన వీకెండ్ షోల మాటేమిటి అంటారా..? అది ఇంకా ఏడుపు… దాన్ని కూడా జనం పట్టించుకోవడం లేదు… చాలుచాల్లేవయ్యా… ఈ తొక్కలో ఆటతీరుకు విశ్లేషణలు, క్లాసులు కూడానా అనేస్తున్నారు…
10.9.2022… శనివారం… నాగార్జున వీకెండ్ షో… కంటెస్టెంట్లకు క్లాసులు, ఢాంఢూండుస్… తుస్ రేటింగ్స్ మరీ 3.43 మాత్రమే… బుడగలాగా ఫట్‌మని పేలిపోయింది ఆరోజు షో… పోనీ, ఆదివారం సంగతేమిటో చూద్దామా..? 11.9.2022… ఆదివారం… 3.81… (ఏపీ, తెలంగాణ కూడా కలిపితే ఒకటిన్నరో, రెండో పెరగొచ్చు)… ఇప్పుడు చెప్పండి నాగార్జున బిగ్‌బాస్ వీకెండ్ షో డిజాస్టరా కాదా..? ఈ రేంజ్ ఫ్లాపు ఆశ్చర్యమేమీ కాదు… ఆ షో నడుస్తున్న తీరు అలాగే ఉంది…
ఈ దరిద్రమైన రేటింగుల వెనుక ఏయే కారణాలున్నాయనేది పక్కన పెడితే… తెలుగులో 5 సీజన్ల రెగ్యులర్ బిగ్‌బాస్ షో, ఒక నాన్ స్టాప్ ఓటీటీ షోల సక్సెస్ జర్నీకి బ్రేకులు పడుతున్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తోంది… నాన్ స్టాప్ షోను పరిగణనలోకి తీసుకుపోయినా… పాత అయిదు షోలలో ఇంత దారుణమైన, పేలవమైన సీజన్ లేదు… ఇక్కడ నాగార్జున హోస్టింగ్ ప్రాబ్లమ్ కాదు, తను ఎప్పటిలాగే ఉన్నాడు… ఎటొచ్చీ, ఆ షో ఇప్పుడు ఆ టీంకూ పట్టడం లేదు… జనానికి అస్సలు పట్టడం లేదు…!!
Share this Article