ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి షణ్నూ అనబడే ఓ మెంటల్ కేసుకు బ్రేకప్ చెప్పేసింది… సంక్షోభంలో పడిన బంధం మెల్లిమెల్లిగా చక్కబడుతుందేమో అని ఎదురుచూసింది…
కానీ ఏం జరిగింది..? బిగ్‌బాస్ ఫినాలే తరువాత దీప్తిని చూడటానికి రాలేదు… కలవలేదు… ఇద్దరి ఇళ్ల నడుమ అర కిలోమీటర్… ఐనా మొహం చాటేశాడు… ఆమెకు విషయం అర్థమైంది… ఛీకొట్టేసింది, తప్పలేదు… నమ్మకూడని వ్యక్తిని నమ్మాను అనే బాధతో ఆమె రోజూ ఏడుస్తోంది… మరి నాగార్జున బ్రహ్మ బ్రహ్మ అని నెత్తిన మోసిన సదరు షణ్నూ అనే కేరక్టర్ ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న దీప్తిని ఎందుకు ఇగ్నోర్ చేశాడు..? ఇక ఆమె అక్కర్లేదు కాబట్టి… సిరి ప్లానింగ్ మాయలో నిండా మునిగిపోయాడు కాబట్టి… బిగ్‌బాస్ హౌజులోనే ఒకే బెడ్ మీద, ఒకే దుప్పట్లో దూరి ప్లాన్లు వేసుకుని, అమలు చేయడానికి సిద్ధమైపోయారు కాబట్టి… ఈ రెండు ప్రేమకథల్లో అసలు విలన్ సిరియే కాబట్టి… ప్లానింగ్ అంతా తనదే కాబట్టి…
‘‘ఒసేయ్, ఆ ముద్దులేమిటి..? ఆ హగ్గులేమిటే సిగ్గులేనిదానా’’ అంటూ సాక్షాత్తూ సిరి తల్లి హౌజులోకి వచ్చి బుద్దిచెప్పింది… ఐనాసరే, ఆరోజు రాత్రే ‘‘పర్లేదు, అమ్మ అర్థం చేసుకుంటుందిలే’’ అంటూ షణ్నూతో ఒకే బెడ్ మీద దుప్పట్లోకి దూరిపోయిన సిరి మెంటాలిటీ అర్థమైంది కదా… నిజానికి షణ్నూ పేరొందిన యూట్యూబరే… ఈ సిరి కూడా తనతో కలిసి నటించిందే… కానీ అప్పటికే శ్రీహాన్‌తో సిరి బంధం, షణ్నూతో దీప్తి బంధం బయట నడుస్తూనే ఉన్నయ్… ఐనా ఏమిటీ రోగం అంటారా..? దటీజ్ సిరి…
Ads
నిజానికి షణ్నూ కోసం దీప్తి బోలెడంత ఖర్చు పెట్టింది… చివరకు హౌజులో ఉండటం కోసం బ్రాండెడ్ షర్టులు కూడా కొనిచ్చింది దీప్తే… తీరా ఆ షర్టులు సిరి వేసుకుని తిరిగేది… పైగా ప్రేక్షకులు ఛీకొడుతున్నా సరే, వెగటు వేషాలకు దిగారు… ఆ హౌజులోనే ప్లాన్ వేశారు… కలిసి ఉందామని బాసలు చేసుకున్నారు… ఇంకేముంది..? బయటికి వచ్చాక దీప్తికి, శ్రీహాన్‌కు అర్థమైంది… శ్రీహాన్‌కు సిరి దూరంగా ఉంటోంది… దీప్తికి షణ్నూ దూరంగా ఉంటున్నాడు… అంతేకాదు, వైజాగ్ వెళ్లి షణ్నూ సిరితో ఉంటున్నాడని వార్తలు… ఇక దీప్తికి తప్పేదేముంది..? ఫోఫోరా అని ఇన్‌స్టా విడాకులు ఇచ్చేసింది… ఇంకా శ్రీహాన్ స్పందించడం లేదు…
సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..? ఈ గ్లామర్ రంగుల ప్రపంచంలో ఉన్నన్నిరోజులు జీవితాలు, బంధాలు, స్థిరమైన భవిష్యత్తు, ప్రేమల్లో నమ్మకాలు, విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నాలు… ఇవన్నీ ఏమీ లేవు… ఉండవు… ఈ రెండు జంటల కథ చెప్పేది కూడా అదే… తరచి చూస్తే ఇండస్ట్రీలో బోలెడు మంది బ్రేకప్పులు, ఒంటరి జీవితాలు… తీరా ఓ వయస్సు దాటాక ఏడుపులు… వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రేమలు తడారిన ఎడారులు… ప్రేమ, పెళ్లి గొప్ప విషయాలు కావు… వాటిని కాపాడుకోవడమే అసలు పరీక్ష… అదుగో, అందులోనే చాలామందికి పాస్ మార్కులు కూడా రావడం లేదు…!!
Share this Article