అబ్బే, ఈ వార్తలో ఏముందోయ్… రంగుల రంగాల్లో విడాకులు చాలా కామన్ కదా అంటారా..? అవున్లెండి… కానీ తాజా ఉదాహరణ ఏమిటో చెప్పుకోవాలి కదా… అన్ని రంగాల్లో ఉన్నట్టే ఇక్కడా విడాకులు సాధారణం కావచ్చుగాక, కానీ సెలబ్రిటీలు కాబట్టి చర్చ జరుగుతుంది… పాఠకుల్లో ఆసక్తి ఉంటుంది… అంతే… విషయం ఏమిటంటే..? తెలుగు సినిమా దర్శకుల్లో పెళ్లిచూపులు సినిమా తరువాత పాపులరైన దాస్యం తరుణ్ భాస్కర్ బ్రేకప్ కథ ఇది…
అఫ్కోర్స్, కొన్ని వాళ్లంతట వాళ్లే ఏ ట్విటర్‌లోనో, ఏ ఇన్‌స్టాలోనో హింట్స్ ఇస్తే, అధికారికంగా చెబితే ధ్రువీకరణ… లేకపోతే రూమర్… కానీ ఈ తరుణ్ బ్రేకప్ కథలో వాళ్ల అమ్మ చెబుతున్న వివరణ ఒకటి ఇంట్రస్టింగ్… తరుణ్ భాస్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు… వాళ్ల అమ్మ గీతా భాస్కర్ గురించి తెలుసు కదా… ఫిదా, ఉప్పెన, 118 సినిమాల్లో అందరికీ తెలిసిన కేరక్టర్… తరుణ్ భార్య గీతా నాయుడు… ఓ వెడ్డింగ్ ప్లానర్… మామూలు రోజుల్లోనైతే అన్నీ సజావుగా సాగాల్సిన బతుకులే… కానీ..?
Ads
కొద్దిరోజులుగా వారి మధ్య సంబంధాలు సజావుగా లేవని ఇండస్ట్రీ టాక్… విడిపోతున్నారు అనే ప్రచారం… నిజమేనా..? నిజమే అంటోంది తరుణ్ తల్లి… ప్రైవేటు చాట్స్‌లో, సంభాషణల్లో అంగీకరిస్తోంది… ఐతే ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? ఏదో కారణం అంటూ ఉండాలి కదా… కారణాలు ఉన్నాయి అంటోంది తరుణ్ తల్లి గీత… బాధగా ఉంది, కానీ నిజమే, మంచి కోసమే అంటోంది… ఆమె వాదన ఏమిటంటే..? ‘‘విడాకుల వార్తలు నిజమే, దాచుకునే పనిలేదు… నా కోడలికి నేనే టార్గెట్ అయ్యాను… అదీ విషాదం… ఇంతకుముందు నా భర్త, నా కోడలికీ పడేది కాదు…
ఆయన పోయిన తరువాత నేను నా కోడలికి టార్గెట్ అయ్యాను… అనుకోకుండా సినిమాల్లో నటిగా చేస్తున్నాను… ఆమె ధోరణి, ఈ పరిస్థితులు గమనిస్తూ కాస్త దూరం మెయింటెయిన్ చేస్తున్నాను కూడా… ఐనా ఆ జంట ప్రైవసీలో నేనేదో జోక్యం చేసుకుంటున్నాను అని బదనాం చేశారు… నాకు కరోనా సోకాక కోడలి నిర్లక్ష్యం నన్ను బాధించింది… నా కొడుకును కూడా… విడిగా బతకాలని ఆమే కోరుకుంటోంది… వాళ్ల పేరెంట్స్‌కు కూడా ఏమీ పట్టలేదు… ఒకసారి విడాకుల ప్రచారం మొదలయ్యాక అందరూ వివాహేతర సంబంధాలే కారణమని నిందిస్తారు, రాళ్లేస్తారు… తరుణ్ ఇంకా చాలా సాధించాల్సింది ఉంది… జరిగేదేదో జరగనివ్వండి, అంతా మంచికే అని భావిద్దాం’’ అంటోంది ఆమె… సో, మరో జంట బ్రేకప్ నిజమేనన్నమాట… కానివ్వండి… ఫీల్డ్‌లో కామనే కదా…!!
Share this Article