.
మోడీ ఖండించలేదు… అమెరికాకు భయపడ్డాడు… ట్రంపుకి ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ ఆగిపోయింది… ఇవన్నీ కువిమర్శలు… విదేశాంగ విధానంలో ప్రతి మాటకూ, చివరకు మౌనానికి కూడా విలువ, వ్యూహం ఉంటాయి…
కొన్నిచోట్ల మాట్లాడాలి, కొన్నిచోట్ల మాట్లాడకూడదు… ప్రత్యేకించి మనకు చమురు ముఖ్యం… అలాగే ట్రంపు చెప్పినట్టు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే మన రైతుల నోట్లో మట్టిగొట్టినట్టే… అందుకని సైలెంట్ స్ట్రాటజీలు ఉంటాయి…
Ads
ఓ ముఖ్య విషయం చెప్పుకుందాం… సీరియస్ సబ్జెక్టే… ఎనర్జీ డిప్లొమసీ..! మొన్న వెనెజులాను అమెరికా కబ్జా చేసింది కదా… కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా… అది ఇండియాకు చమురు అమ్ముతాం అని ప్రకటించింది… అంతేకాదు, వెనెజులాలో చమురు రంగంలో మనకు పెట్టుబడులు, ఒప్పందాలున్నాయి… మనమే తవ్వుకుని, ఇండియాకు తెచ్చుకోవచ్చు… మనం గత కథనాల్లో ఇది చెప్పుకున్నాం… సో, వెనెజులాపై నిశ్శబ్దమే మన మార్గం… ఆచరణీయం…
-
ONGC ఒప్పందాలు..: వెనిజులాలోని ‘శాన్ క్రిస్టోబల్’ వంటి ప్రాజెక్టుల్లో ONGC విదేశ్ (OVL) కు భారీ వాటాలు ఉన్నాయి… మదురో హయాంలో ఆంక్షల వల్ల నిలిచిపోయిన లాభాలు (దాదాపు $600 మిలియన్లు) ఇప్పుడు చమురు రూపంలో భారత్‌కు అందనున్నాయి…
-
కొత్త ప్రభుత్వం – భారత్ స్నేహం..: “భారత్ మాకు నమ్మకమైన భాగస్వామి, మా చమురును భారత్‌కే ప్రాధాన్యత ఇచ్చి అమ్ముతాము” అని అక్కడి కొత్త ప్రభుత్వం ప్రకటించడం మన ప్రభుత్వ దౌత్య విజయానికి నిదర్శనం…
రష్యా నుంచి చమురు కొనడమే కాదు, రష్యాలో మన ONGC (ONGC Videsh Ltd – OVL) కు భారీ ఎత్తున చమురు, గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి… అవి…
1. సాఖాలిన్-1 (Sakhalin-1) ఇది రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో ఉంది… ఇందులో ONGC విదేశ్‌కు 20% వాటా ఉంది… ఇది ఒక భారీ చమురు, సహజ వాయువు ప్రాజెక్టు… ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా కంపెనీ ‘ఎక్సాన్ మోబిల్’ తప్పుకున్నప్పటికీ, భారత్ మాత్రం తన 20% వాటాను అలాగే ఉంచుకుంది…
2. వాంకోర్ చమురు క్షేత్రం (Vankor Field) సైబీరియాలో ఉన్న ఈ భారీ చమురు క్షేత్రంలో ONGC కి 26% వాటా ఉంది… ఇది రష్యాలోనే రెండో అతిపెద్ద చమురు క్షేత్రం… ఇక్కడ నుండి వచ్చే చమురు భారత్‌కు ఇంధన భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది…
3. ఇంపీరియల్ ఎనర్జీ (Imperial Energy) రష్యాలోని టామ్స్క్ (Tomsk) ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీని 2009లోనే ONGC పూర్తిగా కొనుగోలు చేసింది… ఇక్కడ కూడా చమురు అన్వేషణ, ఉత్పత్తి జరుగుతోంది… వెరసి రష్యా మన ఇంధన భద్రతకు ఓ భరోసా… విశ్వసనీయమైన భాగస్వామి… ట్రంపు బెదిరిస్తే రష్యాకు దూరం కాలేం, ఇది కాలపరీక్షకు నిలిచిన దోస్తీ…
మరో కీలక పరిణామం… గయానా
-
డ్రిల్లింగ్, ఉత్పత్తి…: గయానాలోని 11 బిలియన్ బ్యారెళ్ల నిల్వల్లో భాగస్వామ్యం కోసం గయానా ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది…
-
ONGC & రిలయన్స్ ఎంట్రీ…: 2026 వేలంలో భారతీయ దిగ్గజాలు పాల్గొనడం ద్వారా, అక్కడ చమురును వెలికితీసే హక్కులను భారత్ దక్కించుకోబోతోంది… అంటే, మన చమురును మనమే సొంతంగా భూమిలోంచి తీసుకునే స్థాయికి భారత్ చేరుతోంది…
- అంటే… వెనెజులాలో మనం పెట్టుబడిదారులం, కొనుగోలుదారులం, పాత బాకీల వసూలు… గయానాలో మనం అన్వేషకులం, డ్రిల్లింగ్ పార్టనర్లం… దీర్ఘకాలిక ఇంధన భద్రత…
అమెరికా తన “అమెరికా ఫస్ట్” నినాదంతో వెనిజులాలో రాజకీయ ప్రక్షాళన చేయగా, భారత్ మాత్రం ఆ ప్రక్షాళన వల్ల వచ్చే ఫలితాలను (Oil flows) ముందే అంచనా వేసి గయానాలో వేళ్లను పాతుకుంది…
“మదురో అరెస్ట్ కాకముందే గయానాతో ఒప్పందం.. అరెస్ట్ అయిన వెంటనే వెనిజులాతో కొత్త బంధం…”
ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక దీర్ఘకాలిక వ్యూహంతో కూడిన చదరంగపు ఎత్తుగడ… రష్యా నుండి చమురు తెచ్చుకోవడంలో ఎలాగైతే భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందో, ఇప్పుడు లాటిన్ అమెరికాలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది… 2030 నాటికి భారత్ ఇంధన దిగుమతుల భారం గణనీయంగా తగ్గి, పెట్రోల్ ధరలపై మనకు పూర్తి నియంత్రణ వచ్చే అవకాశం ఉంది…
Share this Article