మనం పదే పదే చెప్పుకుంటున్నదే… మీడియా పాలకుల కాళ్లపై పడి ఎలా పాకుతున్నదో… అప్పుడెప్పుడో ఎవరో అన్నారు కదా, నేన కేవలం వంగమనే చెప్పాను, వాళ్లే పాకుతున్నారు అని… తెలుగు ప్రముఖ మీడియా గతి… అవును, మీరు చదివింది నిజమే… మీడియా గతి అలాగే ఉంది… సోషల్ మీడియాలో మిడిమిడిజ్ఙానం పోస్టులు అని నిందిస్తారు గానీ… మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా వేల రెట్లు నయం అనిపించేది ఇలాంటప్పుడే… అంతెందుకు, వోట్ల భయంతో కిక్కుమనని పార్టీల ప్రముఖ నేతలకన్నా…! విషయానికి వద్దాం… నిన్న కేసీయార్ కౌశిక్ రెడ్డి అనే గొప్ప తెలంగాణ ఉద్యమనేతను తన పార్టీలోకి చేర్చుకున్నాడు… తెలంగాణ అలవికానంత సంబరంతో పులకించిపోయింది… ఆ సందర్భంగా కేసీయార్ మాట్లాడుతూ ఏమన్నాడు..? ఇది చదవండి…
ఏమంటున్నాడు..? తను జీవితంలో స్టేట్స్‌మన్ కాలేడు, ఉత్త స్టేట్‌మన్… అవునోయ్, మాదేమైనా సన్నాసుల మఠమా…? రాజకీయ పార్టీ… బరాబర్ ఇలాగే చేస్తం, ఎన్నిక కోసమే దళితబంధు స్కీం పెట్టినం, అందుకే హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నం… రాజకీయ లాభం ఎందుకు కోరుకోం అని నొక్కివక్కాణించాడు… ఎస్, ఏం చేసుకుంటారో చేసుకొండి అంటున్నాడు… నిజానికి ఎవరైనా చేయగలిగేది ఏముంది..? బాజాప్తా ఖజానా నుంచే డబ్బులు ఖర్చు పెట్టి వోట్లు కొంటాను అంటున్నాడు పరోక్షంగా..!! ఇలాంటివి అరికట్టేందుకు మన వ్యవస్థలో ఏమైనా చెక్స్, బారియర్స్, క్రాస్ చెక్స్, యాక్షన్స్, రూల్స్ ఏమైనా ఉన్నాయా..? ఏమీ లేవు… నేరుగా 10 లక్షలు ఇస్తాడట, ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చునట… మరి ఈ ప్రేమ బీసీలపై ఎందుకు లేదు..? బీసీబంధు ఎందుకు ఉండదు..? ఈబీసీ బంధు అనేది కేసీయార్ కలలో కూడా ఆలోచించలేడు… పోనీ, తను అమితంగా ప్రేమించే మైనారిటీ బంధు ఎందుకు లేదు..? తరతరాలుగా అన్నిరకాలుగా అన్యాయానికి గురవుతున్న ఎస్టీలకు బంధువు ఎందుకు కాలేడు..?
Ads
పైగా నాది సన్నాసుల మఠం కాదు అనేది అన్నింటికీ ఎక్స్‌క్యూజ్ అవుతుందా..? సహజంగానే చచ్చుబడి, అమ్ముడుబోయిన లేదా సాగిలబడిపోయిన తెలంగాణ మేధోసమాజం అన్నీ మూసుకుంది… మరి మీడియా..? పైన క్లిప్పింగులు చూశారు కదా… నమస్తే ప్రభ అనిపించుకుని, కీర్తనలే లోకంగా బతికే ఆంధ్రప్రభ కూడా సరైన హెడింగ్ పెట్టింది… కేసీయార్ చెప్పిందే పెట్టింది… ఆంధ్రజ్యోతికి ఎన్ని అవలక్షణాలున్నా సరే, వార్తకు వీసమెత్తు అన్యాయం చేయలేదు… సేమ్, ఆంధ్రప్రభలాగే ఆలోచించింది హెడింగ్ పెట్టింది… కేసీయార్ అనాలోచితంగా మాట్లాడాడు, అయ్యో, మా పోషకుడికి నష్టం జరిగితే ఎట్లా..? మరి మా బతుకులెందుకు..? అని బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈబీసీల్లో ఆలోచన రేకెత్తితే ఎలా..? అని ఈనాడు, సాక్షి తెగబాధపడిపోయినయ్… అసలు కేసీయారే కావాలని చెబుతున్నాడు అలా… తను కోరుకున్నదే రాజకీయలబ్ది… నేను పథకం పెడుతున్నా, నాకే వోట్లు వేయాలి సుమా అని ప్రజలు గుర్తించడం కోసమే… అలా బహిరంగంగా, బరి దాటి మాట్లాడాడు… కానీ వీళ్లకెందుకో కలవరం..?
ఇది సాక్షి జర్నలిజం… పూర్తిగా దిగజారిందనే మాట నిజమే గానీ… మరీ ఇంతగానా అని హాశ్చర్యమేసేలా..!! జనమే గెలిపిస్తున్నరు అనే ఓ రంగూరుచీవాసన ఏమీ లేని హెడింగ్ ఒకటి పాఠకుడి మొహాన పారేసి… హవ్వ, ఎన్నికల రాజకీయాలు చిల్లర ముచ్చట అని రాసేసింది… అరె, కేసీయారే స్వయంగా చెప్పుకుంటుంటే రాయడానికి నీకెందుకు వణుకు, జంకు..? అంత భక్తి ఉన్నవాడివి, ఆయన చెప్పింది రాయకుండా, ఆయనకు నష్టమేమైనా జరుగుతుందో ఏమో అనే కలవరం నీకెందుకు..? ఈ భక్తి పేరేమిటో..?! అందులోనే ఇన్‌సర్ట్ చేశాడు మళ్లీ… ‘దళితబంధు’తో రాజకీయ లాభం కోరుకుంటే తప్పా అని కేసీయార్ మాట్లాడినట్టు..! దాన్నే హెడింగ్ పెట్టి, హైలైట్ చేయడానికి మాత్రం సాక్షికే వెన్నులో ఏదో చలి…!
ఇది ఈనాడు వార్త… దీనంత దరిద్రపు కవరేజీ దాని జీవితంలో ఎప్పుడూ చేయలేదేమో… కాదు, కాదు, ప్రపంచంలో ఏ పత్రికకూ చేతకాదేమో… దీనికి ఏ రీతీ లేదు… ఇక అది దిగిపోవడానికి వేరే లోతులు కూడా లేవు… అవును, నేను రాజకీయ లబ్ది కోసమే దళితబంధు పెట్టాను అని కేసీయారే చెప్పుకుంటే, ఆ ప్రచారమే కోరుకుంటే… ఈనాడు ఏం రాసింది చూశారుగా… ‘‘మావి ఎన్నికల పథకావు కావు’’ అని చెప్పినట్టు రాసింది… పూర్తి విరుద్ధంగా… ఉర్దూ, హిందీ, ఇంగ్లిషు పత్రికల జోలికి అవసరం లేదు… అవి మరీ అంత బయాస్డ్‌గా ఏమీ లేవు… ప్రధాన పత్రికలు, తెలంగాణలో రీచ్ ఉన్న పత్రికల గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం… నిజానికి చిన్న పత్రికలు నయం… నమస్తే వంటి పత్రిక అవునో కాదో చెప్పలేని కాగితాల గురించి చెప్పుకోనవసరం లేదు… ఎప్పుడు చెప్పండి… తెలంగాణలో ఉన్న జర్నలిజాన్ని ఏమనాలి..? ఏమని పిలవాలి..?! (స్టోరీ మీకు నచ్చితే దిగువకు వెళ్లి ముచ్చటను సపోర్ట్ చేయండి…)
Share this Article