కేసీయార్ ప్రసంగాలు వినీ వినీ… పాత సీఎం ఆఫీసులో కార్యదర్శిగా చేసిన స్మిత సభర్వాల్‌కు గోకుడు మీద ఇంట్రస్టు పెరిగినట్టుంది బహుశా… దివ్యాంగుల రిజర్వేషన్లతో ఎందుకు గోక్కుంటున్నట్టు..? దిక్కుమాలిన సంవాదం… పైగా తన కామెంట్స్‌ను సమర్థించుకుంటూ మళ్లీ మళ్లీ ట్వీట్లు… మళ్లీ నెటిజనం నుంచి ఛీత్కారాలు… ఏం పనిలేనట్టుంది ఆమెకు… ఎప్పటిలాగే అలవాటైన రీల్స్, ఫోటోలు పెట్టుకోక ఎందుకమ్మా ఈ గోకుడు జబ్బు..?
ఒకావిడ చాలెంజ్ చేసింది, CSB IAS అకాడమీ చీఫ్ బాలలత… *ఇద్దరమూ సివిల్స్ మళ్లీ రాద్దాం… చూసుకుందామా, నీ పెతాపమో నా పెతాపమో అని..! IAS కొట్టాలంటే అందగత్తెలే అవసరం లేదు…* సరే, నిజానికి ఆమె ట్వీట్లు ఫీల్డ్ యాక్టివిటీ అవసరమయ్యే సర్వీసులో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని… అప్పట్లో కేసీయార్ పదే పదే రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలి అనేవాడు కదా… దాంతో స్పూర్తి పొందినట్టుంది ఈవిడ… రేవంత్ రెడ్డి వచ్చాక ఆమెకు పెద్దగా పనేమీ లేదు కదా…
Ads
ఇంకా నయం, అందగత్తెలకే ఐఏఎస్ పోస్టులు అని డిమాండ్ చేయలేదు ఈవిడ, బతికించింది అనే కామెంట్లు కూడా వస్తున్నాయి… అవునా..? స్మిత సభర్వాల్ అందగత్తేనా..? అందం అంటే రూపమా..? ముఖవర్చస్సా..? ఏమో, ఎవరు నిర్వచించాలి ఇదీ అందమంటే..? ఒకప్పుడు తెలంగాణ అమరుల తల్లిదండ్రులను సన్మానిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న అందం ఇప్పుడేదీ ఆమెలో…
పైగా అందం అంటే… సహజమా..? అందంగా ఉండటమా..? అందంగా కనిపించడమా..? అందంగా చూపించబడటమా..? సరే, ఆ లెక్కల్లోకి, ఆ సబ్జెక్టులోకి వెళ్లడం అనవసరం ఏమో గానీ… ఈ వార్తలు చదువుతుంటే మరో వార్త కనిపించింది… (ముచ్చట కూడా పబ్లిష్ చేసింది..) సీనియర్ ఐఏఎస్ అధికారిణి (బహుశా స్మిత సభర్వాల్‌కు కాస్త అటూఇటూ సర్వీస్ అనుకుంటా) కే వాసుకి వార్త కనిపించింది…
ఆమెను కేరళ విదేశాంగ కార్యదర్శిగా నియమించడం మీద రచ్చ సాగుతోంది… అది వేరే కథ… కానీ ఆమె ఎవరబ్బా అని ఆరా తీస్తే… నిజమైన అందం ఏమిటో అర్థమైంది… ఫిజికల్ ఫిట్‌నెస్‌లో అందం… ఓ ప్రేమికుడికి అండగా నిలబడిన అందం… సొసైటీ మీద కన్సర్న్ ఉన్న అందం… ఛాలెంజ్స్ తీసుకోవడంలో అందం… ఆహా, అందం అంటే అది కదా అనిపించింది…
వాసుకి… తమిళనాడు నేటివ్… ఎంబీబీఎస్ చదువుకుంది, మంచి మెరిట్ స్టూడెంట్… గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసింది… పౌష్టికాహారం లేని పిల్లలు, తల్లులను చూసి తల్లడిల్లిపోయింది… డాక్టర్‌గా ఉంటూ ఏం చేయగలను..? అడ్మినిస్ట్రేషన్‌లోకి వెళ్లాలి అనుకుంది, ఏడాది కష్టపడింది… అదే సింగిల్ అటెంప్టులో ఐఏఎస్ క్రాక్ చేసింది… అది కదా అందం అంటే…!
సేమ్, అదే తమిళనాడుకు చెందిన కార్తికేయన్… తనూ వాసుకి చదివిన కాలేజీలోనే మెడిసిన్ చదివాడు… 2000 నుంచీ ఒకరికొకరు తెలుసు… వాసుకితోపాటే సివిల్స్ రాశాడు… ఒక్క మార్కు తేడాతో ఐఏఎస్ మిస్… నిజానికి అంతకుముందే తను ఐఎఫ్ఎస్… ప్రయారిటీలో అదే టాప్, కానీ తనకు ఐఏఎస్ కావాలి… ఐతేనేం, వాసుకి తన వెంట నిలబడింది… మళ్లీ సివిల్స్ క్రాక్ చేసేవరకూ… డిస్కషన్స్, పుస్తకాలు, నాలెడ్జి షేరింగ్… 2008లో ఆమె ఐఏఎస్ సర్వీసులో చేరింది, కానీ మధ్యప్రదేశ్ కేడర్…
కార్తికేయన్ కూడా ఐఏఎస్ క్రాక్ చేశాక… తనకు కేరళ కేడర్ అలాటయ్యాక పెళ్లి చేసుకుంది… స్పౌజ్ కేసు కింద తను కూడా కేరళ కేడర్‌కు మారింది… గుడ్… అది కదా అందం అంటే… రూపంలో కాదు, తత్వంలో, గుణంలో, అడుగుల్లో… ఇద్దరూ కేరళ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన అధికారులు… సరే, వాళ్లేం ఘనతలు సాధించారనేది కాదు ఇక్కడ… అందం రూపంలో కాదు, జీవనవిధానంలో ఉంటుంది అని చెప్పడం…
ఆమె ఫిజిక్ చూడండి, యోగా చేస్తుంది… నెట్‌లో బోలెడు ఫోటోలు… ఫిట్‌నెస్, గుడ్ మెంటాలిటీ ఈజ్ అల్టిమేట్ సౌందర్యం… అంతేగానీ, గోకుడు మెంటాలిటీ కాదు..!! ఇక్కడే మరో ఉదాహరణ చెప్పడానికి సాహసిస్తున్నా… రోహిణి సింధూరి అని ఓ తెలుగు ఐఏఎస్, కర్నాటక కేడర్… అందగత్తే అంటారు, కానీ అత్యంత వివాదాస్పద ప్రవర్తనతో దిగజారిపోయింది..! అందం అంటే అర్థమైంది కదా..!!
Share this Article