.
మరీ ఆత్మగౌరవం తాకట్టు అని గుండెలు బాదుకునేంత సీరియస్ తప్పో, నేరమో కాదు గానీ… విశ్వసుందరి పోటీ కోసం వచ్చిన అందగత్తెల కాళ్లకు పాదపూజ చేయడం, పోనీ, అధికారికంగా కాళ్లు కడగడం మాత్రం సగటు తెలంగాణీయుడి మనస్సును చివుక్కుమనిపించేదే…
అసలు ఈ సర్కారు ఏ పనీ సరిగ్గా చేసి ఏడవదా అనిపించే అనేకానేక అంశాల్లో ఇది తాజాది… గుడ్, ఆ అందగత్తెలకు చార్మినార్ చూపించాం, జరూర్ హైదరాబాద్ ఆనా అని పిలిచాం కదా, అక్కడి గాజులు, ముత్యాలు చూపించాం, గుడ్…
Ads
చౌమహల్లా ప్యాలెస్‌లో విందు భోజనం పెట్టాం… వరంగల్ తీసుకుపోయాం, చీర కట్టించాం, బొట్టు పెట్టాం, బతుకమ్మలు చేతుల్లో పెట్టాం, చప్పట్లు చరుస్తూ ఆడించాం… వరంగల్ కోట చూపించాం… యాదగిరిగుట్టకు తీసుకెళ్లి దండం పెట్టించాం… పోచంపల్లి ఇక్కత్ చీరెల విశిష్టతనూ చూపిస్తాం… రామప్పకు తీసుకుపోయి మన ఘన సంస్కృతి ఏమిటో చెప్పాం… గుడ్…
ఇదంతా వాళ్లకు చూపించడానికి కాదు, వాళ్లకు ఇవన్నీ ఫోటో షూట్లు, అవి వాళ్లకూ తెలుసు… జస్ట్, వాళ్లు టూరిస్టులు, వర్తమాన సందర్భానికి తగినట్టు నడుచుకోవడం మాత్రమే… పోటీలయిపోయాక ఎవరి బతుకు గోస వాళ్లదే… ఐతే ప్రపంచానికి తెలంగాణను చూపించడం ఇవన్నీ… అక్కడివరకూ వోకే, గుడ్ కూడా…
కానీ దేవాలయం దగ్గర ప్రత్యేకంగా కుర్చీలు వేసి, వరుసగా పళ్లేలు పెట్టి, పోలీసు దిగువ సిబ్బందితో నీళ్లు మోయించి, మన మహిళలతో వాళ్ల కాళ్లు కడగడం ఏమిటి..? ఎస్, పాదపూజలు, కాళ్లు కడిగి తుడవడాలు ఓ అనాగరిక, పాత, మోటు బానిసత్వ ధోరణి…
తివాచీ పరుచు.. ఓకే… సెంటు చల్లు.. ఓకే… హారతి ఇవ్వు.. ఓకే.. నోట్లో స్వీట్ కుక్కు, ఓకే … కానీ, ఇదేం దరిద్రంరా… వేధవాయి… ఆ అడ్డమైన కేసీఆర్ వ్యతిరేకతతో అంతకు మించి దరిద్రాన్ని మోస్తున్న పశ్చాత్తాపం ఫీలింగ్…
ఐతే ఈ నిర్వాకానికి కూడా రేవంత్ రెడ్డినో, ఇంకెవరినో నిందించాల్సిన పనిలేదు, కానీ ఈ ఫుట్ వాష్ ప్రోగ్రాం ఎవరు ప్లాన్ చేశారో గానీ ఖచ్చితంగా సిగ్గుపడాలి… అఫ్‌కోర్స్, ఈ ప్రభుత్వంలో అలాంటివాళ్లను మందలించడం ఎక్స్‌పెక్ట్ చేయలేం, కనీసం ప్రశంసించకుండా ఉంటే సంతోషిద్దాం…
ఎవరో కాంగ్రెస్ నాయకుడు సమర్థించుకున్నాడట… ఇది సంప్రదాయం అని… అతిథులు ఎవరు ఇంటికొచ్చినా కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిస్తామేమో గానీ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోం బాబూ… ఇది మర్యాదా కాదు, సంప్రదాయమూ కాదు… పైగా వాళ్లేమైనా పూజించాల్సిన వ్యక్తులా..? ఏమాత్రం కాదు కదా… మరెందుకిలా..?
తెలియకపోతే, సమర్థన చేతకాకపోతే మౌనంగా ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడి మరింత చులకన కావద్దు… ఐనా వీళ్లకు ఎవడు చెప్పగలడు..? అన్నీ అడ్డదిడ్డమే కదా..!!
Share this Article