.
1) గతంలో సినిమాల్లో కథానాయకుడు రిక్షా తొక్కేవాడు, పేపర్లు వేసేవాడు, సైకిల్ పోటీల్లో ఒళ్లు వొంచేవాడు, రైల్వే స్టేషన్లలో మూటలు మోసేవాడు… లక్షలు సంపాదించేవాడు, ఒరేయ్ ఇప్పుడేమంటావురా అని విలన్ను సవాల్ చేసేవాడు… కానీ మారిపోయింది…
2) కాలం మారింది కదా… ఒకడు వంగిపోయిన గూని భుజంతో ఎర్రచందనం కింగ్ పిన్ అవుతాడు… ఒకడు మట్కా సామ్రాట్ అవుతాడు… ఒకడు స్టాక్ మార్కెట్ ఇల్లీగల్ బ్రోకర్ అవుతాడు… వాళ్లంతా మన ఖర్మకాలి తెలుగు హీరోలు అవుతారు… ఒరేయ్, అబ్బాయిలూ మీకూ ఇదే మార్గదర్శనం అంటారు…
Ads
3) ఎస్, ఒకడు పాకిస్థాన్ నుంచి ముంబై వచ్చి ఇండియా మట్కా సామ్రాట్ అవుతాడు… లీగల్ చేయండి, మీ అప్పులన్నీ తీర్చేస్తా అని కేంద్ర ప్రభుత్వానికే ఆఫర్ ఇస్తాడు… ఆ స్ఫూర్తే ప్రస్తుత మట్కా సీనిమా కథాంశం… కాకపోతే దాన్ని వైజాగీకరించాడు దర్శకుడు… దరిద్రంగా…
ఫాఫం… అసలే వరుణ్ తేజుడు… అసలే బన్నీ బ్యాచ్ కసి మీద ట్రోలింగ్ చేస్తున్నారు… రానీ, తాడోపేడో తేలిపోనీ, మెగా క్యాంపో, నాన్ మెగా క్యాంపో చూద్దాం అన్నట్టుగా ఉన్నారు… ఇంకెన్నాళ్లు ఈ మెగా నీడ, బయటపడి బన్నీ క్యాంపు ఎస్టాబ్లిష్ చేద్దామన్నట్టున్నాడు బన్నీ…
అసలే కొన్నాళ్లుగా వరుణ్ సినిమాలన్నీ వీర ఫ్లాపులు… ఈ స్థితిలో కాస్త రక్తికట్టించే సినిమా తీయాల్సిన సదరు దర్శకుడు చేతులెత్తేశాడు… ఎక్కడా ఒక్క సీన్ కూడా బాగుందీ అనిపిస్తే ఒట్టు… ఇంతకుముందు వేరే కథనంలో చెప్పుకున్నాం కదా, వరుణ్ తేజకు ఓ సీరియస్ ఆత్మమథనం అవసరం అని… ఎస్, ఈ సినిమా కూడా అదే చెబుతోంది…
హీరోయిన్ మీనాక్షి చౌదరి… లక్కీ భాస్కర్ సినిమాతో హిట్… హఠాత్తుగా ఈ మట్కాతో ఫ్లాప్… ఫాఫం, ఆమెకు నటించడానికి కూడా స్కోపేమీ లేదు… మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడం వేస్ట్… ఈ సినిమాలో వాళ్లకు అంగీలు చింపుకునే చాన్స్ కూడా ఏమీ ఇవ్వలేదు దర్శకుడు…
సంగీతం వెరీ పూర్… మరీ ఓసారి పది నిమిషాల స్పాన్‌లో రెండు పాటలు, అవీ పెద్దగా బాగోలేవు… బీజీఎం మరీ పూర్… జీవీ ప్రకాషేనా..? సోదరా, దెబ్బతీశావు కదరా బ్రో… ఏమోలే, బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చీ, మరీ బలమైన ఓ సినిమా కుటుంబం సపోర్ట్ ఉన్నా సరే… వరుసగా ఫ్లాపులు ఇవ్వడం కొందరు వారసులకు అలవాటు…
వరుణ్ తేజ మొదటి వాడు కాదు… చివరి వాడు కాదు… చివరగా… జబర్దస్త్ గెటప్ సీను కూడా పలు వేషాలు వేస్తాడు… కానీ స్కిట్ బాగుంటేనే అవి రక్తికడతాయి… ఇదీ అంతే… వరుణ్ తేజా, గెటప్పులు కాదోయ్… ముందు సినిమా కథలో, కథనంలో, ప్రజెంటేషన్‌లో వైవిధ్యం, కొత్తదనం ఉండాలి… సినిమా రిలీజుకు ముందు ఎలాగూ నువ్వు దర్శకుడి కాలర్ పట్టుకోలేకపోయావ్… ఇప్పుడిక చేయదగిందీ ఏమీ లేదు..!! (ఇది మట్కా రివ్యూ కాదు… ఫాఫం వరుణ్ తేజ దురవస్థ మీద జాలి… ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… రివ్యూలు కూడా తెలుగు సినిమా కథల్లాగే డొల్ల ఫార్మాట్‌లో ఉండాలనుకునే ఛాందస చక్రవర్తులు మరీనూ…)
అవునూ, డ్రాగ్ కథనం అని చెబితే చాలు… ఆ శ్రీకాంత్ అయ్యంగార్ అనబడే ఓ క్రిమి దొడ్డి భోజనుడు తెర మీదకు వచ్చి పిచ్చి కూతలు కూస్తాడు కదా… వాడేమంటాడో చూద్దామని ఉంది…
.
హైదరాబాద్ సుదర్శన్ లోనే 20% ఆక్యుపెన్సీ అంటే…. ఇక గోవిందాయ నమః…
Share this Article