Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంత పెద్ద హీరోయిన్ ఐతేనేం, మేం సారీ చెప్పము గాక చెప్పము…

November 19, 2025 by M S R

.

డైరెక్టర్ దేవీప్రసాద్… ఆ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యే ముందు నిర్మాత గారు మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని పిలిచి “మీరు క్షమాపణ చెప్పకపోతే తను షూటింగ్‌కి రానని హీరోయిన్ కబురుచేసిందయ్యా” అన్నారు.

“ఆమె ఎంత పెద్ద హీరోయిన్ అయినా, సమస్య ఆమె నుండే మొదలైంది కాబట్టి, ఆమెకి ఎంత మొండి పట్టుదల ఉన్నప్పటికీ మా సెల్ఫ్‌ రెస్పెక్ట్ మేము వొదులుకోలేము కనుక మేము క్షమాపణ చెప్పము సర్. కానీ మావల్ల షూటింగ్ ఆగకూడదు కనుక మేము షూటింగ్‌కి రాకుండా మానేస్తాము” అన్నాము.

Ads

“అదేంటయ్యా మీరు సిన్సియర్‌గా కష్టపడి పనిచేసేవాళ్ళు. మీరు తప్పు చెయ్యరని నాకు తెలుసు. మీరు మానెయ్యక్కర్లేదు. ఏమిజరుగుతుందో చూద్దాం” అన్నారా నిర్మాత. కష్టపడి పనిచేసేవాళ్ళని బాగా ఇష్టపడేవారాయన.

ఆ నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావు గారు. (సూపర్‌స్టార్ కృష్ణ గారితో ఎన్నో సినిమాలు తీశారు). మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ U.నాగేశ్వరరావు, దేవీప్రసాద్, వీరశంకర్ (“గుడుంబా శంకర్” దర్శకుడు), రాంబాబు (“బావ” దర్శకుడు).

  • మేము క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని పట్టుబట్టిన హీరోయిన్ “నగ్మా”.
    ఆ సినిమా పేరు “ఆవేశం”

ఆ సినిమాలో రాజశేఖర్ గారు హీరో. నగ్మా, మధుబాల (రోజా ఫేం) గార్లు హీరోయిన్స్. సినిమా ప్రారంభంలో నగ్మా గారు అందరితో బాగానే ఉండేవారు. ఓసారి ఆమె కోసం మా సెట్‌కి వచ్చిన ఓ తమి ళదర్శకుడిని చూసి ఆయనతో సినిమా చెయ్యబోతున్నారా అని నగ్మాని అడిగాము.

దానికామె “ఆయనేదో ఒక్క సినిమా చేశారట. పైగా నేనిక్కడ పెద్ద హీరోలతో నటిస్తుంటే తమిళంలో కొత్త హీరోతో నటించమంటున్నారు.చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను” అన్నారు.
“ఆయన తీసిన తొలి సినిమా సూపర్‌హిట్. మేము చూశాము. అద్భుతమైన దర్శకుడాయన. మీరు ఆ అవకాశాన్ని అస్సలు ఒదులుకోవద్దు “అని చెప్పాము మేము.

మరుసటిరోజు సెట్‌కొచ్చినప్పుడు “ఆ సినిమా ఒప్పేసుకున్నాను. కధ కూడా బాగుంది” అని చెప్పింది. తరువాత వచ్చిన ఆ సినిమా పేరు “ప్రేమికుడు”. ఆ దర్శకుడు”జంటిల్మెన్ శంకర్”.
మాతో గొడవెక్కడొచ్చిందంటే…..

ఆమెకి తెలుగు రాదు గనుక సన్నివేశాన్ని, డైలాగుల్ని ఆమెకి హిందీలో వివరించి చెప్పటానికి “దాసు” గారనే ఓ పెద్దాయన ఆమెతో వచ్చేవారు.
డైరెక్టర్ కోడిరామకృష్ణ గారు కూడా ఆమెకి నటించి చూపేవారు తప్ప డైలాగ్స్ దాసు గారే చెప్పేవారామెకి.

మరో హీరోయిన్ “మధుబాల” కి మాత్రం మేమే అన్నీ అప్పటికి మాకొచ్చిన తమిళంలో వివరించి చెప్పేవాళ్ళం. భాష ప్రాబ్లం లేదు కనుక ఆమె కూడా మాతో చక్కగా మాట్లాడుతుండేవారు.
ఇదంతా దూరం నుండి నగ్మా గారు చూస్తుండేవారు.

మధ్యలో దాసు గారు ఉండటం వల్ల, భాష సమస్య వల్ల మాకూ ఆమెకూ ఇంటరాక్షన్ బాగా తగ్గిపోయింది.
“ఈ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు మహా పొగరు. ముఖ్యంగా దేవీప్రసాద్, వీరశంకర్ లు నాకు మర్యాదివ్వటంలేదు అని అందరి దగ్గరా చెప్పటం ప్రారంభించింది.
ఎందుకలా చెబుతోందో మాకూ అర్ధమయ్యేది కాదు.

ఇక ఆమె వైపుకేపోకుండా మా పని మేము చేసుకుంటుంటే ఆమెకింకా కాలింది.
మధుబాలని ఒకలా తననొకలా చూస్తున్నారనీ, తను సెట్‌లోకి రాగానే తనకు నమస్కారం పెట్టటం లేదనీ ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా ఓ గొప్ప దర్శకుడి పేరు ప్రస్తావించి “ఆయనే నేను సెట్లోకి రాగానే లేచి నిలబడి నాకు విష్ చేస్తారు తెలుసా” అన్నదట.

జరుగుతున్నదంతా గురువు గారి చెవిన వేశాము. ఆయన నవ్వి పట్టించుకోకండి అన్నారు.
కానీ మా కుర్రతనపు ఈగో బుస్సున పడగ విప్పింది.
అంతే… రోజూ ఆమె సెట్‌కి రాగానే ఆమెకి విష్ చెయ్యకపోవటం సరేసరి, ఆమెకి కనిపించేలా పుష్ప రేంజ్‌లో కుర్చీలలో కాలి మీద కాలు వేసుకు కూర్చొనేవాళ్ళం.

సినిమా చివరి షెడ్యూలుకొచ్చింది. వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపట్టింది.
జరిగిందంతా అప్పటి ఆమె పి.ఆర్.ఓ. మా మిత్రులు “ప్రభు” కి చెప్పి, అవసరమైతే సౌతిండియన్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఈ విషయాన్ని పెడతామని చెప్పాము.
ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె షూటింగ్‌కి వచ్చింది.

చివరిగా మద్రాస్ జె.జె.ఫిలిం సిటీలో “నిన్నేమడగను ఎట్టా అడగను” అనే పాట షూట్ ప్రారంభమైంది.
రామలింగేశ్వరరావు గారు “ఈ గొడవంతా ఇంతటితో ఒదిలేయమంటుదయ్యా నగ్మా” అన్నారు.
“మాకు మాత్రం ఆమె మీద పగెందుకుంటుంది సార్” అన్నాము.
ఆ పాటకి దాసు గారు రాకపోవటంతో ప్రతి షాట్ కి ముందు మేమే వెళ్ళి ఆమెకి లిరిక్స్ చెప్పాము. ఏమీ జరగనట్టే షూటింగ్ చేసింది.

అంతా అయిపోయాక ఆమె నవ్వుతూ మా అందరికీ బై చెప్పింది. మేమూ నవ్వుతూ వీడ్కోలు చెప్పాము.
నిజానికి ఆమె కానీ, మేము కానీ చెడ్డవాళ్ళం కాదు.
మెచ్యూరిటీ లేని వయసు వల్ల ఆమెకీ మాకూ మధ్య “అహం” దోబూచులాడింది.
“నేను” మేము” అనే అహం హద్దులు మీరినప్పుడు సహజంగానే అక్కడ “మనం” అనే మాటకు చోటుండదు.
____ దేవీ ప్రసాద్ డైరెక్టర్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!
  • మైండ్‌లెస్ ట్రోలింగ్..! సౌత్ టాప్ స్టార్ల ‘వేషాలు’ మరిచిపోయారా..?!
  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions