Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైమ్ వచ్చేసింది… ఐపీఎల్‌కు కూడా బైబై తప్పదు ధోనీ భాయ్..!!

April 26, 2025 by M S R

.

మళ్లీ మళ్లీ చెప్పుకోవడం దేనికిలే గానీ… ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది… అనేక ప్రశంసలకు అర్హుడు… చాలా వివాదాలున్నా సరే, ఆట కోణంలో మాత్రమే చూస్తే తన లెజెండ్…

డౌట్ లేదు… కానీ ఇప్పుడు సరైన సమయం తను అన్నిరకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ కావడానికి… నిజానికి ఇప్పటికే లేటయింది… పరువు పోగొట్టుకున్నాడు… ఇంకా వేలాడటం కరెక్టు కాదు… చాలామంది తన ఫ్యాన్లలో కూడా అదే భావన ఉంది…

Ads

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు తెలివైనవాడు… ఇప్పుడిక పూర్తిగా తగ్గడమే శరణ్యం… ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎలాగూ వీడ్కోలు, ఐపీఎల్‌కు కూడా బైబై చెప్పాల్సిందే… కాకపోతే నేను లేక చెన్నై టీమ్ లేదనే భావనలో ఉన్నాడు కదా… కోచ్‌గానో, అడ్వయిజర్‌గానో ఉండి, చెన్నై టీమ్ మొత్తం ప్రక్షాళన చేసుకుని, కొత్త రక్తాన్ని ఇంజక్ట్ చేసుకోవడం బెెటర్…

ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో దిగువ రెండు జట్ల నడుమ రాత్రి మ్యాచ్ … హైదరాబాద్ వర్సెస్ చెన్నై… ఈసారి దొందూ దొందే… మరీ హైదరాబాద్ జట్టులో కోవర్టులున్నారనే విమర్శలూ ఉన్నాయి… మ్యాచుకు ముందు దాదాపు రెండూ సేమ్ పాయింట్లతో, సేమ్ రన్‌రేట్‌తో ఉన్నాయి…

తీరా ఈ మ్యాచులో అంతటి పేలవ జట్టు హైదరాబాద్ గెలిచింది… అంటే ఇక చెన్నై ఇంకెంత పేలవంగా ఆడిందో అర్థం చేసుకోవాలి… ఎప్పటిలాగే సిక్స్‌త్ డౌనులో వచ్చిన ధోనీ ఎప్పటిలాగే ఆరో ఏడో చేసి ఔట్… నిజం చెప్పొద్దూ… తన చెన్నై స్టేడియం ఓరకంగా జాలిగా చూస్తూ సైలెంటు…

రెండు జట్లూ ఎలాగూ ప్లే ఆఫ్ వెళ్లే చాన్స్ లేదు… 9 మ్యాచులు, రెండే గెలుపులు… కాకపోతే ఈ మ్యాచు గెలుపుతో హైదరాబాదు దిగువ నుంచి మూడో ప్లేసుకు వెళ్లి, ప్లే ఆఫ్ ఆశల్ని కాస్త కాపాడుకుంది… చెన్నై చాప్టర్ ఈ సీజన్‌కు ఇక క్లోజ్ అన్నట్టే… ధోనీ విషయానికే వస్తే, పాత కెప్టెన్సీ మెరుపుల్లేవు… ఫీల్డర్ల ప్లేస్‌మెంటులో కూడా నిరాసక్తత కనిపించింది…

నిజానికి ఈసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, కోహ్లి, ధోనీల మీద ఉంది మొదటి నుంచీ… ధోనీని ఇక వదిలేయండి… కోహ్లి ఏవో తిప్పలు పడుతూ టాప్ త్రీలో ఉంచాడు జట్టును… తను కూడా ఫామ్‌లోకి వచ్చాడు… రోహిత్ శర్మ కథ వేరు… ధోనీలాగే ఫ్లాపవుతూ ఉన్నా… రెండుమూడు మ్యాచులతో మళ్లీ ఫుల్లు ఫామ్‌లోకి వచ్చేశాడు…

సరే, ఆటగాడు అన్నాక ఫామ్ కోల్పోవడం, తిరిగి తెచ్చుకోవడం సాధారణం… కానీ ధోనీ ఇక ఆడే సిట్యుయేషన్ దాటిపోయినట్టున్నాడు… సో, మరిప్పుడు ఈ స్థితిలో నీ కర్తవ్యం ఏమిటి ధోనీ భాయ్..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇష్టసఖి త్రిష కాదు… తిరుచ్చి నుంచి బహుశా రాఘవ లారెన్స్…!
  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions