.
ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి… సూపర్ స్టార్లు అయినా సరే, అంతులేని సంపదను, కీర్తి ప్రతిష్టలను సంపాదించినా సరే… ఈ వయస్సులోనూ ప్రయోగాలకు రెడీ అంటారు… తమలోని నటులకు ఇప్పటికీ పరీక్షలు పెట్టుకుంటారు… అది స్పిరిట్…
మన వెటరన్ హీరోలు..? వద్దులెండి, ఆ పోలికే వేస్ట్… నో టేస్ట్… తమలోని నటుల్ని చంపుకున్న హీరోలు… మలయాళంలో యంగ్ హీరోలు కూడా ప్రయోగాలకు రెడీ అంటారు… భిన్నమైన కథాంశాలకు వోకే చెబుతారు… మనసు పెట్టి పనిచేస్తారు… సాధన చేస్తారు… డబ్బూ, ఫేమ్ సరే, తమలోని నటుల్ని శాటిస్‌ఫై చేస్తారు… వైవిధ్యం కోరుకుంటారు…
Ads
సేమ్, అక్కడి దర్శకులు కూడా కథల్లో, కథనాల్లో కొత్తదనం కోసం పరితపిస్తారు… తాజాగా దుల్కర్ సల్మాన్ సినిమా కాంత టీజర్ రిలీజైంది… దీన్ని దగ్గుబాటి రానా సమర్పిస్తున్నాడు… టీజర్ చూస్తుంటేనే ఇది భిన్నమైన సినిమా అని అర్థమవుతూనే ఉంది… దుల్కర్‌తోపాటు సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సె కూడా ఉన్నారు… 1940, 50లలో పాపులర్ హీరో, తనను మోల్డ్ చేసిన ఓ గురుదర్శకుల అహాల మధ్య ఘర్షణ సీన్లున్నాయి… అయితే..?
తమిళ మ్యాగజైన్లు, సైట్లు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… ఇది ఎంకె త్యాగరాజ భాగవతార్ (ఎంకేటీ) అనే తొలితరం సూపర్ స్టార్ బయోపిక్ అని తెలుస్తోంది… లేదా కొంత క్రియేటివ్ ఫిక్షన్ కూడా కలిపిన ఎంకేటీ సినిమా కావచ్చు… సముద్రఖని పాత్ర ఎవరిదో క్లారిటీ లేదు.., (బహుశా ఎంకేటీకి బాగా క్లోజ్ దర్శక నిర్మాత, స్టూడియో ఓనర్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు..?)
ఈ ఎంకేటీ మొదట్లో గాయకుడు, థియేటర్ ఆర్టిస్టు… తరువాత సినిమాల్లో సూపర్ హిట్ స్టార్… 1944 నాటి తన చిత్రం హరిదాస్ మద్రాసులోని బ్రాడ్‌వే థియేటర్‌లో వరుసగా మూడు సంవత్సరాలు ప్రదర్శింపబడింది… అయితే…
ఒక ఫిలిమ్ జర్నలిస్టు లక్ష్మికాంతన్ హత్య కేసులో త్యాగరాజతోపాటు ఎస్ఎస్‌కే అనే సహనటుడు, పైన చెప్పుకున్న దర్శక నిర్మాత శ్రీరాములు నాయుడు కూడా అరెస్టయ్యారు… మూడేళ్ల జైలు తరువాత త్యాగరాజతో అందరూ సరైన ఆధారాల్లేక విడులయ్యారు…
తరువాత ఆ హీరోను జనం పెద్దగా ఆదరించలేదు… జైలులో ఉండివచ్చిన తనను ఓ హీరోలాగా జనం రిసీవ్ చేసుకోలేదు… వైరాగ్యంతో సంపద మీద, సినిమాల మీద విరక్తి పెంచుకుని, ఇక ఆధ్యాత్మిక బాటపట్టాడు… మధుమేహం… ఓచోట కచేరీ ఇచ్చాక ఎవరో తనకు మధుమేహానికి మంచిది అని ఏదో ఆయుర్వేద పసరు మందు ఇచ్చారు… దాంతో పరిస్థితి విషమించి, చికిత్స తీసుకుంటూనే మరణించాడు…
ఒక సినిమా కథకు కావల్సినన్ని చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలు, కష్టాలు- విజయాలు అన్నీ ఉన్నాయి… నేరం షేడ్ ఉంది… చివరకు వైరాగ్యం… దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దీన్ని ఎలా చిత్రించాడో చూడాల్సిందే… 1950 మద్రాస్ పరిస్థితుల నేపథ్యం..!
Share this Article