పార్ధసారధి పోట్లూరి …….. ఆదానీ గ్రూపు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు – సుప్రీం కోర్టు !
హిండెన్ బర్గ్ ఆరోపించినట్లు ఆదానీ గ్రూపు విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు!
సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ విచారణ చేసి తమ రిపోర్ట్ ని సుప్రీం కోర్టుకి సమర్పించింది !
Ads
ఆదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణల మీద నిజాలు తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు :
1. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ AM సప్రె
2. రిటైర్డ్ బాంబే హై కోర్టు జడ్జ్ JV దేవధర్
3. మాజీ స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ OP భట్
4. మాజీ ICICI బ్యాంక్ చీఫ్ KV కామత్
5. ఇన్ఫోసిస్ కొ ఫౌండర్ నందన్ నీలేకని
6. సోమశేఖర్ సుందరేశన్- సెక్యూరిటీస్ & రెగ్యులేటరీ నిపుణుడు
******************************************
పైన పేర్కొన్న కమిటీ అన్ని రికార్డులు పరిశీలించి సుప్రీం కోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది.
1. ఆదానీ గ్రూపుకి సంబంధించి ఎలాంటి కృత్రిమ ట్రేడింగ్ జరగలేదు.
2. ఆదానీ గ్రూపుకి సంబంధించి ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదు.
3. ఆదానీ గ్రూపుకి సంబంధించి ఎలాంటి మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్స్ లో నియమ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు. రెగ్యులేటరీ కి సంబంధించిన అన్ని నియమ నిబంధనలని గౌరవిస్తూ ఆదానీ గ్రూపు తగిన చర్యలు తీసుకుంది. ఈ విషయంలో మాకు ఎలాంటి అవకతవకలు జరిగినట్లు కనపడలేదు.
4. కమిటీ కి ఎలాంటి నియమ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు కనపడలేదు కాబట్టి ఆదానీ గ్రూపుని చట్ట పరంగా విచారించే ఎలాంటి అంశము లేనందున చట్టపరమయిన విచారణ అవసరం లేదు.
5. హిడెనబర్గ్ రిపోర్ట్ రేపు వస్తుంది అనగా కొన్ని విదేశీ సంస్థలు లాభాలకి తమ షేర్లని అమ్ముకున్నట్లుగా రికార్డ్ అయి ఉన్నట్లు మేము గమనించాము ! ఈ సంస్థలు అన్నీ కూడా షార్ట్ ట్రేడింగ్ చేస్తున్నవే అని మేము గమనించాము.
6. ఆదానీ గ్రూపు కి ఇచ్చిన రుణాలు అన్నీ చట్టపరంగా నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకి తావు లేదు.
7. విదేశీ పోర్ట్ ఫోలియో సంస్థలు ఆదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు అన్నీ SEBI నిబంధనల మేరకు పెట్టుబడి పెట్టినవే ఉన్నాయి కానీ ఎలాంటి చట్ట పరమయిన ఉల్లంఘనలు జరగలేదు.
8. ఇప్పటివరకు సుప్రీం కోర్టు నియమించిన విచారణ కమిటీ కి ఎలాంటి ప్రాధమిక సాక్ష్యధారాలు దొరకలేదు.
9. కానీ SEBI తన విచారణని ఇంకా కొనసాగిస్తూ ఉండడం వలన సుప్రీం కోర్టు SEBI కి ఆగస్ట్ 14 వరకు గడువు ఇచ్చింది తన రిపోర్ట్ ని సుప్రీం కోర్టుకి ఇవ్వడానికి !
*********************************
పైన పేర్కొన్న కమిటీ సభ్యులలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నందన్ నీలేకని పక్కా బిజేపి వ్యతిరేకి మరియు కాంగ్రెస్ హయాంలో ఆధార్ కార్డుల కి రూపకల్పన చేసిన వ్యక్తి !
ఇక స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ అయిన OP భట్ కూడా బిజేపి వ్యతిరేకి !
ఇక ఆదానీ అంటూ నోరు పారేసుకునే వాళ్ళు ఇక ముందు ఎలాంటి వాగుడు వాగకుండా ఉంటే మంచిది లేకపోతే భవిష్యత్తులో కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా !
హిండెన్బర్గ్ రిపోర్ట్ ఆరోపణల మీద ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీం కోర్టుని విచారించమని అభ్యర్ధించారు! ప్రధాని అభ్యర్ధన మీద సుప్రీం కోర్టు కమిటీని వేసింది విచారణ చేయమని !
Share this Article