Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మిక బాగా హర్టయింది… ఓరి దేవుడా, దానికీ కాంతార సినిమాయే కారణం…

November 9, 2022 by M S R

చాలా బాధపడిపోయింది రష్మిక మంథన… ఇన్‌స్టాలో అంత పెద్ద నోట్ పెట్టి, మరీ మథనపడిపోతుందని ఎవరూ అనుకోలేదు… నా లైఫ్, నా కెరీర్ పాడుగాను, ఫస్ట్ నుంచీ ఇంతే, నెటిజన్లు ఎవరూ సహించరు, దారుణమైన ట్రోలింగుతో ద్వేషాన్నే చూపిస్తున్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది తన నోట్‌లో… ఆమెకు అకస్మాత్తుగా ఈ ట్రోలర్స్ మీద ఇంత కోపం ఎందుకొచ్చింది..?

దీనికీ కాంతార సినిమాయే కారణం… నిజం… అందరికీ తెలుసు కదా… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి, రాజ్.బి.శెట్టి, రక్షిత్‌శెట్టి తదితరులు చాలా క్లోజ్… కెరీర్ మొదటి నుంచీ సేమ్ సిట్యుయేషన్లు ఫేస్ చేస్తూ, ఢక్కామొక్కీలు తింటూ, ఇప్పుడు విజయాలతో, మంచి సంపాదనతో గాడినపడ్డారు… మొదట్లో రష్మిక కూడా వీళ్ల పార్టీయే… ఇందులో రక్షిత్ శెట్టితో రష్మికకు లవ్వు,.. నిశ్చితార్థం కూడా అయ్యింది…

ఏమైందో ఏమో గానీ… అది పెళ్లికి ముందే బ్రేకప్పు… సరే, మనం ఇప్పుడు మళ్లీ ఆ కథలోకి వెళ్లడం లేదు… కానీ రిషబ్ గానీ, రష్మిక గానీ, రక్షిత్ గానీ ఇండస్ట్రీలో నిలబడింది కిరిక్ పార్టీ అనే సినిమాతోనే… దానికి దర్శకుడు రిషబ్, హీరో రక్షిత్, హీరోయిన్ రష్మిక… సీన్ కట్ చేస్తే… నిశ్చితార్థం తరువాత పెళ్లి జరగలేదు… ఇద్దరి దారులూ వేరయ్యాయి… తరువాత ఆ బ్యాచుతో రష్మికు పెద్దగా మంచి రిలేషన్స్ లేనట్టున్నాయి… ఆమె కన్నడంకన్నా తెలుగులో, ఇప్పుడు తమిళంలో కూడా బిజీ అయిపోయింది…

Ads

మనసులో రక్షిత్, రిషబ్ బ్యాచు మీద ఏదో ఆమెకు ఇప్పటికీ రగులుతూనే ఉంది… ప్రభాస్, ధనుష్, రజినీకాంత్ సహా ఎందరో కాంతార సినిమాను ప్రశంసించినా రష్మిక మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు… ఈమధ్య విమానాశ్రయంలో మీడియాకు కాస్త లీజర్‌‌గా దొరికింది… ఇవీఅవీ అడుగుతూ అకస్మాత్తుగా ఓ విలేఖరి ‘కాంతారా చూశారా..?’ అనడిగాడు… ఆమె సింపుల్‌గా ‘ఇంకా చూడలేదు’ అని జవాబు ఇచ్చింది… మీడియాకు, ట్రోలర్లకు అది చాలు కదా…

‘‘అవునులే, ఎందుకు చూస్తావు..? చూడవు… నీకు అసలు రూట్స్ గుర్తుంటే కదా… ఏం..? రిషబ్ సాయం లేకుండానే ఇండస్ట్రీలో నిలబడ్డావా..? ఇప్పుడు బాగా సక్సెస్ రాగానే పాత సాయాల్ని మరిచిపోతావా..? నీ తొలి సినిమా కిరిక్ పార్టీకి దర్శకుడు ఎవరో గుర్తులేడా..? అందరూ సినిమా గురించి బాగా చెబుతున్నారు, చూడాల్సి ఉంది అనైనా చెప్పడం లేదు నువ్వు… అంత పెరిగిపోయిందా..? కన్నడ ఇండస్ట్రీని కూడా మరిచిపోయినట్టున్నావు కదా…’’

ఇలా జోరుగా ట్రోలింగ్ సాగింది… ‘వార్నీ, ఆ సినిమా గురించి నేనొక్కమాట కూడా నెగెటివ్‌గా మాట్లాడలేదు… ఇంకా చూడలేదు అన్నాను… నిజంగానే చూడలేదు… దానికి ఇంత ట్రోలింగా..?’ అని షాక్ తిన్నది రష్మిక… ఆ బాధతోనే ఇంత పెద్ద నోట్ రాసుకొచ్చింది….

rashmika

ఈ స్టార్‌డం, ఈ ట్రోలింగ్ ఎట్సెట్రా హ్యాండిల్ చేయలేకపోతే… ఏదైనా 9-5 జాబ్ చూసుకోవాలి… అప్పుడు ఎవ్వడూ ఏమీ అనడు నిన్ను’’ అంటూ ఆమె నోట్ మీద కూడా ట్రోలింగ్ సాగుతోంది… అంతేకాదు, అప్పట్లో ఏదో ఇంటర్వ్యూలో ఇదే రిషబ్ ఓ మాటన్నాడు… ఏదో సినిమాకు సంబంధించి రష్మికకు బదులు సమంతను హీరోయిన్‌గా తీసుకుంటాను, ఆమే బెటర్ అని…

అది ఏదో కాంటెక్స్ట్… ఏదో పాత్ర గురించి… అంతేతప్ప రష్మికను కించపరచడానికి కాదు… ఇప్పుడు ఆ వీడియో బిట్‌ను కూడా షేర్ చేస్తూ ట్రోలర్స్ రష్మిక మీద దాదాపు దాడి చేస్తున్నారు… అదీ రష్మిక బాధకు కారణం… సహజమే… ‘‘నేను అనని మాటల్ని అన్నట్టుగా రాసేస్తున్నారు… నేను ఇంటర్వ్యూల్లో ఏదో చెబితే వంకర బాష్యాలు రాసేస్తున్నారు… నిర్మాణాత్మక విమర్శలు అవసరమే… కానీ ఈ అకారణ ద్వేషం, ఈ వ్యతిరేకత ఏమిటి..? సుదీర్ఘంగా…

నా కెరీర్ మొదటి నుంచీ ఇంతే… ఐనాసరే, ఎప్పటికప్పుడు ఇగ్నోర్ చేస్తుంటాను, కానీ ఇంకా వరస్ట్‌గా మారుతోంది… నేనూ ఓ మనిషేనని, మీ ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసమే నేను వర్క్ చేస్తున్నానని కూడా వాళ్లు గుర్తించడం లేదు…’’ రష్మిక బాధలో న్యాయం ఉంది…!! సో వాట్… కాంతార గురించి మాట్లాడకపోతే ఏంటట..? అది ఆమె ఇష్టం… సినిమా చూడాలా వద్దానేది కూడా ఆమె ఇష్టం… చూడాలని అనిపించకపోవచ్చు… అయితే ఇక ఆమె ఇండస్ట్రీకి, భాషకు ద్రోహం చేసినట్టుగా మీదపడి రక్కేస్తే ఎలా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…
  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions