ప్చ్… సీపీఐ నారాయణ నాగార్జున మీద మళ్లీ ఓ కౌంటర్ వేశాడు… బిగ్‌బాస్ హౌజ్ వ్యభిచార్ల కొంప అని ఒకటే మొత్తుకుంటున్నాడు… మనం ఆ రచ్చలోకి మళ్లీ వెళ్లడం ఎందుకులే గానీ… నిజానికి ఈసారి బిగ్‌బాస్ హౌజులో అంత పెద్ద సీనేమీ కనిపించడం లేదు నారాయణా..? తిడుతూనే నువ్వూ చూస్తుంటావుగా… రెండోవారం నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది… ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క లవ్ ట్రాకూ స్టార్ట్ కాలేదు… ఇక థ్రిల్ ఏమున్నట్టు కామ్రేడ్..?
గత సీజన్లలోనైతే ఇలా తొలివారం గడిచీ గడవక ముందే ఎవరో అందుకునేవాళ్లు… కొన్ని స్ట్రెయిట్ లవ్ ట్రాకులు… కొన్ని ట్రయాంగిల్స్… రాత్రిళ్లు ముద్దులాటలు, హగ్గులాటలు… అలకలు, బాత్రూముల్లోకి వెళ్లి శోకాలు… హౌజ్ చాలాసార్లు ముంపుకు గురయ్యేది… ఈసారి అంతా డ్రై స్పెల్… ఎల్‌నినో… అసలు బిగ్‌బాస్ టీం ఏం చేస్తున్నట్టు..? ఇలాగే ఉంటే వీకెండ్ షోలో నాగార్జున ఇంకే మాట్లాడాలి..? ఏం ముచ్చటించాలి..?
గీతూ రాయల్… ఎవరైనా తన ముందు నిలిచి లవ్వూ గివ్వూ అనేంత సీన్ ఉందా..? పగిలిపోద్ది కదా..! సింగర్ రేవంత్ కూడా ఏవేవో పిచ్చి మాటలతో అందరినీ దూరం చేసుకుంటున్నాడు తప్ప అసలు రొమాంటిక్ యాంగిలే కనిపించడం లేదు… వాటీజ్ దిస్ బిగ్‌బాస్..? అసలు ఈసారి హౌజులో కంటికి నదురుగా కనిపించే విగ్రహాలే తక్కువ… మగ తోపులు కూడా దేభ్యం మొహాలేసుకుని తిరుగుతున్నారు గానీ అసలు బిగ్‌బాస్ లవ్ ట్రాకుల స్పిరిట్ అర్థం చేసుకున్నవాళ్లెంత మంది..?
Ads
మొదట్లో ఇనయ రెహమాన్ హడావుడి కనిపించింది… కానీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది… ఎవరితోనూ మాటాముచ్చట కూడా పెద్దగా లేదు… అందగత్తె శ్రీ సత్య అందరికీ ముందే బంధనాలు వేస్తోంది… నేనసలే పర్సనల్ సమస్యలతో వచ్చాను, అందరితోనూ కలవడం లేదు, కాస్త టైం పడుతుందీ అని…! ఫాఫం, వాసంతి బాగుంటుంది, కానీ ఒక్క మగ కేరక్టర్ ఆమె దగ్గరకు వెళ్లి, మాటమాట కలిపే ప్రయత్నమే చేయడం లేదు…
జబర్దస్త్ ఫైమా ఉంది గానీ, ఆమెకు ఆల్‌రెడీ బయట ప్రవీణ్ అనే లవర్ ఉన్నాడు… ఇక్కడ ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే, తను బయట కత్తులు కటార్లు నూరి రెడీగా ఉంటాడు మరి… అఫ్‌కోర్స్, గత సీజన్‌లో బయట శ్రీహాన్ ఉన్నాసరే, సిరి షన్నూతో రొమాన్స్ పండించలేదా అంటారా..? ఆ శ్రీహాన్ సైతం ఈ సీజన్‌లో హౌజులో ఉండీ, చలిమిడి ముద్దలా కనిపిస్తున్నాడు… బాలాదిత్య అనే హీరో మెటీరియల్ ఉంది… ఫస్ట్ కెప్టెన్… కానీ ఎంతసేపూ పెద్ద మనిషిలా సుద్దులు చెప్పడానికే టైం సరిపోతోంది…
హౌజులో ‘‘అన్నా, అన్నా’’ అనే అనురాగాలే వినిపిస్తున్నయ్… ఆరోహి ఉంది, కొలీగ్ కొండబాబు ఉన్నాడు… కానీ ట్రాక్ కుదరడం లేదు, అసలు రెండూ వేర్వేరు ధ్రువాలు… చంటి వెటరన్… ప్రతి మాట్రిమోనీలో నా వివరాలు ఇచ్చాను అని నేహా పరోక్షంగా నేను ఒంటరిగానే ఉన్నానోయ్ అని చెప్పినా ఆమె దగ్గరకు ఎవరూ రావడం లేదు… సేమ్, టీవీ నటి కీర్తి కూడా… పింకీ అలియాస్ సుదీపకు పెళ్లయ్యింది… బాహుబలి ఆదిరెడ్డి జోలికి ఎవరూ పోలేరు గానీ, అర్జున్, రాజశేఖర్ కూడా ఎందుకో పప్పూస్‌లా కనిపిస్తున్నారు…
నాన్ స్టాప్ ఓటీటీ బిగ్‌బాస్ హౌజులో మరీ అశ్లీలం, అసభ్యత మరీ శృతిమించి, ఏ సర్టిఫికెట్ సినిమాలాగా, ఏ సర్టిఫికెటూ అవసరం లేని వెబ్ సీరీస్‌లాగా ఉండిందట… కానీ ఈ సీజన్ ఏమిటో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది… ఎంతసేపూ గీతూ, రేవంత్… ఉప్పూనిప్పూ… ఇంతేనా ఈ సీజన్ గతి..? నారాయణ, నారాయణ… ప్రేక్షకులకు ఎంత అసంతృప్తి…!!
Share this Article