.
నిజానికి బిగ్‌బాస్ ఈ సీజన్ పేలవంగా సాగుతోంది… రకరకాల ప్రయోగాలు చేస్తున్నా సరే, పెద్దగా జనం ఆదరణ లేదు… కానీ రాత్రి వీకెండ్ షో మాత్రం బాగుంది… అది ఎందుకో కూడా చెప్పుకుందాం…
1) 36 ఏళ్ల క్రితం నాటి శివ సినిమా జ్ఞాపకాల్లోకి తీసుకుపోయాడు నాగార్జున… ( ఈ సీజన్‌లో తన డ్రెస్సింగ్ బాగుంటోంది… రాత్రి డ్రెస్సు అదిరిపోయింది, శివ నాటికీ ఈనాటికీ అదే లుక్కు…) అమలను తీసుకొచ్చాడు, ఆ సినిమాలో ఆమే హీరోయిన్…
Ads
డాన్సు చేశారు… రాంగోపాలవర్మను కూడా తీసుకొచ్చాడు… ఎప్పటిలాగే తలాతోక లేని తలతిక్క జవాబులు ఏదో చెప్పాడు, ఇగ్నోర్ హిమ్.,. కానీ హౌజులో అందరూ శివ సాంగ్స్‌కు డాన్సులు చేస్తూ రాబోయే 14న జరగబోయే శివ రీరిలీజుకు మంచి ప్రమోషన్ కల్పించారు…
నాగార్జున స్టూడియోస్ 50వ సంవత్సరం, అక్కినేని జయంతి సందర్భంగా ఆ రీరిలీజ్… విశేషం ఏమిటంటే..? 4కే డాల్బీ ఆటమ్ టెక్నాలజీలోకి పాత ఒరిజినల్ మార్చడానికి రాంగోపాలవర్మ 8 నెలలు కష్టపడ్డాడని నాగార్జున చెప్పడం… ఇంకా ఏమేం చేశాడో, ఏం పాడో, ఇప్పుడు డౌట్ కొడుతోంది…

2) రాము రాథోడ్… కొద్దిరోజులుగా హోమ్ సిక్… మనిషి మనిషిలా లేడు హౌజులో… వెళ్లిపోతాను అన్నాడు… బిగ్‌బాస్ ఇచ్చే డబ్బును అలా ఎడమకాలితో తన్నేసి, తన కుటుంబం వదిలి ఉండలేక వెళ్లిపోయాడు, పోయేముందు ఏమైనా చెప్పు అంటే… ‘తిన్నా తిరం పడ్తలే, పన్నా తిరం పడ్తలే, బాధయితుందో, మస్తు బరువయితుందో మనసంతా’ అని పాడిన తీరు నచ్చింది…
పైకి అలా కనిపిస్తాడు కానీ రాము ఎమోటివ్… ‘సార్, మా అమ్మానాయన ఆరేడేళ్లు కూలి పని కోసం మమ్మల్ని వదిలి వెళ్లారు, ఇప్పుడు నేను వాళ్లను చూసుకోవాలి, ఆరేడుగురు పిల్లలు, కుక్కలు, పెద్ద కుటుంబం, ఇక్కడ ఇక ఉండలేను సార్’ అని, హౌజ్‌మేట్స్ వద్దంటున్నా, కొందరు వింతగా చూస్తున్నా, దులిపేసుకుని వెళ్లిపోయాడు… చిత్రమైన ఎలిమినేషన్…
బట్, కన్విన్సింగ్… డబ్బుదేముంది..? 65 కోట్ల వ్యూస్ ఉన్న రానూ ముంబైకి రానూ పాట హీరో తను… అలాంటివి ఎన్నో చేసుకోగలడు… సో, బిగ్‌బాస్ డబ్బు నథింగ్ తనకు… ఏ డ్రామా లేకుండా, సింపుల్‌గా బయటికి వెళ్లిపోయాడు…

3) వోట్ ప్యాడ్లు ఇచ్చి, స్టూడియోకు వచ్చిన వాళ్లతో కంటెస్టెంట్ల ప్రస్తుత పర్‌ఫామెన్స్ మీద వోటింగ్ పెట్టాడు నాగార్జున… ఫస్ట్ ప్లేసు 100 శాతం వోట్లతో సుమన్ శెట్టి… తన ఆటలో నిజాయితీ ఉంది, ప్లానింగ్ ఉంది, శ్రమ- ప్రయాస కూడా ఉంది… సరైన వోటింగే…
తరువాత ఇమాన్యుయేల్… ఎంటర్‌టైనర్ వరకూ వోకే, మూడుసార్లు కెప్టెన్… కానీ ఎప్పుడూ నామినేషన్లలోకి రాలేదు, అదీ మైనస్… తనతో బాగున్న తనూజతో అభిమానం నటిస్తూనే, తన మీద కుట్ర పన్నడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు… సేఫ్ గేమ్ మాత్రమే కాదు, సెల్ఫిష్…! ఈరోజు షోలో ఇమ్మూకు నాగార్జునతో క్లాస్ ఉంటుంది…
తరువాత ప్లేస్ తనూజ… నిజానికి ఆమెకూ వంద రావాలి… కానీ బాగా సెన్సిటివ్, ఎమోటివ్… తను నటి, ఓ ప్లాన్‌తోనే ఆడుతోంది… కానీ అందరూ తననే టార్గెట్ చేస్తున్నారు… బహుశా బయటి నుంచి వచ్చిన శ్రీజ, భరణి వల్ల ఆమె ఎప్పుడూ హయ్యెస్ట్ వోటింగులో ఉంటున్న విషయం హౌజులో తెలిసి టార్గెట్ చేసి కొడుతున్నారేమో…
మొన్న కెప్టెన్సీ టాస్కులో దివ్య వెన్నుపోటు పొడిచింది, అకారణంగా… బహుశా దివ్యకు ఆ ఫలితం నెగెటివ్‌గా రాబోతున్నదేమో వచ్చేవారం, లేదా ఆపైవారం… ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు, అంతెందుకు, ఆమె బాండింగ్ పెంచుకున్న భరణికీ నచ్చలేదు… హౌజులో లాభపడిన ఇమ్మూకు తప్ప ఇంకెవరికీ దివ్య నిర్ణయం నచ్చలేదు…

రీతూకు కూడా మంచి మార్కులే వచ్చాయి… సర్‌ప్రయిజింగే… అఫ్‌కోర్స్, కల్యాణ్, డెమోన్ పవన్ కూడా టాప్ 6లో ఉన్నారు… సరైన వోటింగే… ఈసారి నామినేషన్లలో ఉన్న సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు… ఊహించిందే… తనకు లీస్ట్ వోటింగ్… గౌరవ్, నిఖిల్ కూడా హోప్‌లెస్ గేమ్… ఉన్నంతలో సంజన కూడా బెటరే… బయటి నుంచి భరణిని తీసుకురావడం కరెక్టు కాదు, అది బిగ్‌బాస్ తప్పు..!!
బిగ్‌బాస్ మరో తప్పిదం… ఎవరికో గిఫ్ట్ కోసం ఇంకెవరినో బలి చేయడం… ఉదాహరణకు… ఇమాన్యుయెల్ ప్రియురాటి వాయిస్ నోట్ కోసం గౌరవ్ బ్లెస్సింగ్ పవర్‌ను బలి తీసుకోవడం ఏమిటి..? అదీ ఇమ్మూ కోరితే..! గౌరవ్ ప్లస్సును తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ఇమ్మూ లాగేసుకోవడం ఏమిటి..? ఇలాంటిదే ఆఫర్ వస్తే (రెండు వారాల్లో పెళ్లిచేసుకునే తన సోదరి వాయిస్ నోట్) బ్లంట్‌గా రెఫ్యూజ్ చేసి తనూజ భేష్ అనిపించుకుంది…
Share this Article