Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…

August 1, 2025 by M S R

.

Pardha Saradhi Potluri.... ముందు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకి ముందుకువచ్చాడు అని నమ్మించినా వైస్ ప్రెసిడెంట్ jd వాన్స్ ని పాకిస్థాన్ వేడుకున్నది దాడులు ఆపమని… అఫ్కోర్స్! అదేదో మీరే నేరుగా భారత్ ని అభ్యర్థిస్తే మేలని jd వాన్స్ సలహా ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో DGMO ( Director General Military Operations) మన DGMO ని హాట్ లైన్ లో బ్రతిమలాడితే అప్పడు ఆపరేషన్ సిందూర్ కి విరామం ప్రకటించాల్సి వచ్చింది!

So! పాకిస్థాన్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోధా ఎయిర్ బేస్ లో ఉన్నవి అమెరికాకి చెందిన అణు వార్ హెడ్స్ అని నిరూపితం అయ్యింది!
ఆపరేషన్ సిందూర్ దెబ్బకి పెషావర్ లో ఉన్న ఆటమిక్ కమాండ్మ, కంట్రోల్ సెంటర్ ని రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు ఉండే వీధిలోకి మార్చింది పాకిస్థాన్ ఆర్మీ! అక్కడైతే భారత్ ఆటమిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద దాడి చేయదు అనే నమ్మకంతో!

Ads

అఫ్కోర్స్! పిన్ పాయింట్ యాక్యురసితో కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్న భవనం మీద దాడిచేయగల సత్తా ఇప్పుడు భారత్ దగ్గర ఉంది!

*******************
పాకిస్తాన్ లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికావి కాబట్టే వాటిని కాపాడుకోవడం, విషయం రహస్యంగా ఉంచడం కోసం డోనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్ ని అమెరికా పిలిపించుకుని మరీ బుజ్జగించాడు!
ప్రధాని మోడీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నా దానిని బయటపెట్టకుండా ఆసిమ్ మునీర్ ని మచ్చిక చేసుకున్నాడు ట్రంప్!

పాకిస్తాన్ కి IMF, వరల్డ్ బాంక్ నుండి దాదాపుగా 70 బిలియన్ డాలర్లు అప్పు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ట్రంప్! బయటి ప్రపంచానికి షరతులతో కూడిన అప్పుగా ప్రచారం చేస్తారు కానీ అవేమి పట్టించుకోకుండా ఆసిమ్ మునీర్ అధునాతన ఆయుధాలు కొనడానికే ఖర్చుపెడతాడు!

టార్గెట్ మోడీ!
ట్రంప్ ఆసిమ్ మునీర్ సమావేశంలో ఆసిమ్ మునీర్ ని పాకిస్తాన్ అధ్యక్షుడిగా చేయడానికి ట్రంప్ హామీ ఇచ్చాడు! ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే అది మునుపటి పర్వేజ్ ముషరఫ్ హయాంలాగా ఉంటుంది!
ఒక పోలిక చెప్పుకోవాలి ఇప్పడు!

కార్గిల్ యుద్ధం తరువాత నవాజ్ షరీఫ్ ని సైనిక కుట్రతో దించేసి ముషరఫ్ అధ్యక్షుడు అయ్యాడు.
ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తరువాత ఆసిమ్ మునీర్ అధ్యక్షుడు అవబోతున్నాడు ట్రంప్ ఆశీస్సులతో!
రాహుల్ & కంపెనీకి ట్రంప్ మద్దతు ఇస్తాడు!

మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్, జై శంకర్ ల కూటమిని విచ్చిన్నం చేస్తేనే కానీ రష్యా, చైనా, ఇరాన్ లకి చెక్ పెట్టడం సాధ్యం కాదు! మోడీ పుతిన్ కి అండగా ఉండడం ట్రంప్ కి ఏమాత్రం నచ్చడం లేదు!
మొత్తం 64 దేశాలలో ప్రభుత్వాలని మార్చిన చరిత్ర అమెరికాది!

To be an enemy of America is dangerous!
But to be a friend of America is Fatal!
So! అనూహ్యమైన పరిస్థితులని కల్పించి మోడీని దించే కార్యక్రమం మొదలుపెడతాడు ట్రంప్!
గత రెండు రోజుల నుండి పార్లమెంట్ లో రాహుల్ అండ్ కంపెనీ చేస్తున్న వ్యాఖ్యలని చూస్తే ఇప్పటికే గేమ్ మొదలు పెట్టినట్లుగా అనిపించడం లేదూ?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…
  • ‘‘నాకు ఇండియాతో అనుబంధం ఉంది… హైదరాబాద్‌లో వర్క్ హేపీ…’’
  • మీకు తెలుసా..? ఇండియాలో ఫస్ట్ మొబైల్ కాల్ ఎప్పుడు, ఎవరు, ఎవరికి..?!
  • ఈ ట్రంపరి వేషాలతో… నాటి జార్జి ఫెర్నాండెజ్ మళ్లీ గుర్తొస్తున్నాడు…
  • ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!
  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions