Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…

May 20, 2025 by M S R

.

నేడు సిరివెన్నెల జయంతి… నో డౌట్… మంచి సినీగీత రచయిత… అనేక భావస్పోరక గీతాల్ని వెలువరించింది ఆయన కలం… అయితే..?

సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన కవిత్వాన్ని గుమ్మరించడం కోసం రాయడు సినిమా పాట…

Ads

సిరివెన్నెల పాటలనూ ఇంతకు భిన్నంగా చూడాల్సిన పనిలేదు, కాకపోతే మంచి పదాలు, సందర్భానుగుణ వ్యక్తీకరణకు ఆయన పడిన తపనను మెచ్చుకోవచ్చు… మనం పదే పదే చెప్పుకుంటాం కదా, ఏ పాటయినా సరే సందర్భోచితంగా ఉండాలి, పాత్రోచితంగా ఉండాలి, సహజంగా ఉండాలి అని… అంతేకాదు, దర్శకుడు చెప్పే కంటెంటుకు సరిగ్గా సూటవ్వాలి పాట… ఈ కోణంలో సిరివెన్నెల రాసిన రెండు పాటల మీద మిత్రుడు  Chakradhar Rao..  ఏమంటాడంటే…



sirivennela

‘‘ఇందాక సిరివెన్నెల గారి పాటలు వింటూంటే.. జగమంత కుటుంబం నాదీ అనే పాట మళ్ళీ చెవిన పడింది. ఈ పాట, అర్థం , అంతరార్థం.. ఫిలాసఫీ చాలామందికి ఇష్టం. ఒకరకంగా మహా తపస్సు తరవాత అయ్యే జ్ఞానోదయం తాలూకు ఆనంద విస్పొటనంలో ప్రపంచం, సకల ప్రాణులూ జీవ నిర్జీవులూ ఈ చరాచర సృష్టి, అనంత విశ్వం, విశ్వంలోని శూన్యం.. అన్నింటినీ తనలో కలిపేసుకునే కాలం, అన్నీ తానే అనిపించే అద్వైత స్థితిని తెలిపే సాహిత్యం…

కానీ ఈ పాట పెట్టిన సినిమా, సినిమా కథ ప్లస్ సందర్భం అంతా అందుకు విరుద్దం… కాన్సర్‌తో చావబోతున్న హీరోతో దీనంగా పాడించి.. ఒక సానుభూతి పాటని చేసేశారు. సినిమా పర్పస్ సాల్వ్ అవుతుంది కాని.. ఆ సాహిత్యం పర్పస్ అది కాదు… ఎక్టసీ ఇవ్వాల్సిన పాట ఏడుపు పాట అయిపోయింది. ఒకానొక మిత్రుడు దీన్ని ఏడుపుగొట్టు పాట కింద లెక్కేశాడు.

అలాగే … జానూ సినిమాలో లైఫ్ ఆఫ్ జానూ పాట, మళ్ళీ సీతారామశాస్త్రి గారే రాశారు. తమిళ మాతృకలో హీరో ఒంటరివాడా కాదా, పెళ్లైందా లేదా అనేట్టు మచ్చుకయినా కనపడకుండా… చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నాడూ అన్నట్టుగా ఉంటుంది. ప్రకృతిలో మమేకమై, ఇంటెన్స్‌గా జీవించే మనిషిగా పరిచయం అవుతాడు.

తరవాత కథలో అతడి ఒంటరితనం… లవ్ స్టోరి వస్తుంది.. అదే తెలుగు సినిమాకి వచ్చేసరికి….. నేను ఒంటరిని అని అడక్కండీ.. అంటూ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లాగా ధ్వనిస్తుంది.. ఐతే రాసిన సాహిత్యం ఉద్దేశ్యం అది కాదు. కాని కథాపరంగా ఆ ఉద్దేశ్యం వచ్చేసింది. అలాగే ఆ ట్యూన్, ఆ టోన్ కూడా ఒక నైరాశ్యత కలిగి ఉండటం వల్ల మాతృకలోని ఉద్దేశ్యం ప్రకటన కాలేదు తెలుగులో… !! మీరేమంటారూ..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions