అయోధ్య బాలరాముడి గుడికి దేశం నలుమూలల నుంచీ భక్తజన ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు… ప్రత్యేక రైళ్లు కూడా నడిపిస్తుండటంతోపాటు రకరకాల రవాణా మార్గాల్లో భక్తులు వచ్చేస్తుండటంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ రామజన్మభూమి మందిర్ ట్రస్టుకు ఇబ్బందవుతోంది… దీనికితోడు విశేష పూజలు, ఎంట్రీ పాసులు, దర్శన వేళలపై భక్తులకు కన్‌ఫ్యూజన్ ఉంటోంది… ఈ నేపథ్యంలో పలు అంశాల్లో ట్రస్టు క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది…
దాని ముఖ్యాంశాలు ఏమిటంటే… అయోధ్యకు వెళ్లే భక్తులు వీటిని గమనంలో ఉంచుకోవాలి… అక్కడికి వెళ్లాక గందరగోళానికి గురయ్యేబదులు అన్నీ తెలుసుకుని దర్శనానికి వెళ్లడమే ఉత్తమం కదా…
Ads
- రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది వస్తున్నారు సగటున… రోజూ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే దర్శనానికి నేరుగా గుడిలోకి ప్రవేశించవచ్చు…
- దర్శనం ప్రక్రియ సరళం, సౌకర్యవంతం… అదీ ట్రస్టు ఆశయం… 60 నుంచి 75 నిమిషాల్లో దర్శనం పూర్తవుతోంది భక్తులకు…
- భక్తులు దయచేసి మొబైల్ ఫోన్లు, చెప్పులు, పర్సులు గుడికి తీసుకురావద్దు… కన్వీనియెన్స్, టైమ్ సేవింగ్ కోసం ఇది తప్పనిసరి…
- అన్నింటికన్నా ముఖ్యంగా దేవుడికి సమర్పించడానికి పూలు, పూలదండలు, ప్రసాదాలు, ఇతర కానుకలు తీసుకురావద్దు…
- ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు మంగళ ఆరతి, 6.15 గంటలకు శృంగార ఆరతి, రాత్రి 10 గంటలకు శయన ఆరతి ఉంటాయి…
- వీటికి మాత్రం తప్పనిసరిగా ఎంట్రీ పాస్ అవసరం… ఇతరత్రా దర్శనాలకు, ఆరతులకు వేరే పాసులు అవసరం లేదు…
- భక్తుడి పేరు, వయస్సు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు తప్పనిసరిగా ఉండాలి… శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెబ్ సైట్ నుంచి ఈ వివరాలు సమర్పించి ఎంట్రీ పాసులు తీసుకోవచ్చు…
- ఈ ఎంట్రీ పాసులు ఉచితం… ఎలాంటి చార్జీలు చెల్లించనక్కర్లేదు…
- ప్రత్యేక దర్శనాలకు ఏర్పాట్లు లేవు, ఎలాంటి ప్రత్యేక పాసులు ఉండవు, వాటికి ఛార్జీలూ ఉండవు…
- ఎవరైనా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తామని చెబితే అది మోసమేనని గుర్తించండి… అయోధ్య గుడి ట్రస్టుకు అలాంటి ఎవరితోనూ సంబంధాలు లేవు… ఎవరినీ అలా నియమించలేదు…
- శారీరకంగా నడవలేని వాళ్లు, వయో వృద్ధుల కోసం ట్రస్టు వీల్ చెయిర్లను ఏర్పాటు చేసింది… వీటిని మందిరం ఆవరణలో మాత్రమే ఉపయోగించాలి…
- వీటిని ఉపయోగించుకున్నందుకు కూడా ఎలాంటి ఛార్జీలు లేవు, ఎవరైనా సాయపడే యువ వాలంటీర్లకు ఏమైనా ఇవ్వాలనుకుంటే భక్తుల ఇష్టం…
- వీటిని బాలరాముడి గుడి దగ్గర మాత్రమే ఉపయోగించాలి… అయోధ్య సిటీలో తిరగడానికి, ఇతర గుళ్ల సందర్శనకు వాడటానికి వీల్లేదు…
Share this Article