బార్క్ రేటింగులు చూస్తుంటే ఓచోట దృష్టి చిక్కుబడిపోయింది… ఈటీవీలో ఆరో తారీఖు, ఆదివారం సాయంత్రం ప్రైమ్‌టైంలో ఓ సినిమా ప్రీమియర్ ప్రసారం అయ్యిందట… దాని పేరు యు అండ్ ఐ… మీరు చదివింది నిజమే… ఆ సినిమా పేరే అది… ప్రేమ, శృంగారం, ఆత్మహత్య అని ఇంగ్గిషులో ట్యాగ్‌లైన్…
నిజమా..? ఆ పేరుతో ఓ సినిమా వచ్చిందా అనే డౌట్ రావడం సహజం కదా… నిజంగానే 2010లో వచ్చిందట… కార్తీక్ మ్యూజిక్, అనంతశ్రీరాం గీతాలు, దేవిశ్రీప్రసాద్ ఓ గాయకుడు, గోపిక పూర్ణిమ గాయకురాలు… నెట్‌లో ఎంతసేపు ఈదినా ఇతరత్రా పెద్ద వివరాలు కనిపించలేదు… ఈ సినిమాకు వచ్చిన రేటింగ్స్ తెలుసా..? 1.28 మాత్రమే… సింపుల్‌గా చెప్పాలంటే దాన్ని ఎవడూ దేకలేదు…
నడుం లేవలేని జెమిని కూడా కొత్త సినిమాలు కొంటుంది… జీవాడు, మాటీవీ వాడూ కొత్త సినిమాల్ని కొంటారు… తమ చానెళ్ల రీచ్‌ను నిలుపుకోవడానికి తప్పవు… కానీ మరీ ఈ అనామక సినిమాను ఈటీవీ ఎక్కడ కొన్నది..? ఎంతకు కొన్నది..? ఎవరిని రంజింపచేయడానికి ఈ పుష్కరం క్రితం సినిమా ప్రసారం చేసినట్టు..? ఇప్పుడర్థమైంది ఈటీవీ వేగంగా మూడో స్థానికి ఎందుకు పడిపోయిందో…
Ads
మరో సినిమా గురించి చెప్పుకోవాలి… ఇలాంటి అనామక సినిమాయే ఇది… ఈమధ్య విజయ్ సేతుపతి సినిమాలన్నీ అడ్డంగా బోల్తాకొట్టి, తనను నేల మీదకు తీసుకొస్తున్నయ్ కదా… కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు పోయాయో తెలియదు… అసలు వచ్చాయా అని డౌట్ పడే స్థాయిలో..!! అలాంటిదే ఓ సినిమా… పేరు తుగ్లక్ దర్బార్… నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసినట్టున్నారు…
ఆ హీరోతోపాటు రాశీఖన్నా, మంజిమా మోహన్, సత్యరాజ్ పార్తీపన్ తదితరులు కూడా ఉన్నట్టుంది… డౌటెందుకు..? డిజాస్టర్ అది… సేతుపతి మంచి నటుడైనంత మాత్రాన సినిమా బాగాలేకపోతే ఎవడు చూస్తాడు..? దాన్ని మాటీవీవాడు కొన్నాడు… కానీ ప్రసారం చేయడానికి మాటీవీలో ప్రైమ్ టైమ్, స్పేస్ వేస్ట్ చేయడం దేనికి అనుకున్నారేమో… లేదా సిగ్గుపడ్డారేమో… మా మూవీస్‌లో రిలీజ్ చేసేశారు… 11వ తారీఖు, శుక్రవారం… అదీ యూఅండ్ఐ రేంజులోనే బోల్తాకొట్టింది… దేకినోడు లేడు… 1.47 రేటింగ్స్ వచ్చినయ్… ఏం అంచనా వేసుకుని కొన్నారో ఈ సినిమాను..?
ఇంకో సినిమా ఉందండోయ్… దాని పేరు రాజా విక్రమార్క… గత నవంబరులో రిలీజైన కొత్త సినిమాయే… కార్తికేయ హీరో… తాన్యా హీరోయిన్… సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా ఎప్పుడో వచ్చేసింది… సినిమా హిట్ కాలేదు… నిజం చెప్పాలంటే లాస్ ప్రాజెక్టు… కాకపోతే కార్తికేయ కాస్త నోన్ హీరో కదా… కాస్త ఉపయోగపడింది… దీన్ని జెమిని వాడు ఆరో తారీఖు ఆదివారం ప్రైమ్ టైమ్‌లో ప్రసారం చేశాడు… కానీ ఆ టీవీని జనం చూడటం మానేశారు కదా… అది కూడా మైనస్ అయిపోయింది… 3.54 రేటింగ్స్ వచ్చినయ్… ఇలా మూడు సినిమాల ప్రీమియర్స్ ప్రసారం కాగా… టీవీ రేటింగ్స్ పరంగా ఒకటి బిలో యావరేజ్, ఒకటి ఫ్లాప్, ఒకటి డిజాస్టర్… ఏం సినిమాల్ని చూపిస్తున్నార్రా బాబూ…!!
Share this Article