Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెల్‌బాటమ్ పాంట్లూ… ఏనుగు చెవుల కాలర్లు… అప్పట్లో ‘టైగర్లు’…

December 8, 2024 by M S R

.

( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) యన్టీఆర్ , రజనీకాంతు కలిసి నటించిన సినిమా . 1979 లో వచ్చిన ఈ టైగర్.. ఈ సినిమా రజనీకాంతుకి యాభయ్యో సినిమా . నవశక్తి బేనరుపై నిర్మించబడిన ఈ సినిమాకు నందమూరి రమేష్ దర్శకుడు .

1977 లో వచ్చిన హిందీ సినిమా ఖూన్ పసీనాకు రీమేక్ . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , నిరూపరాయ్ తదితరులు నటించారు . ఎందుకోగానీ హిందీలో ఆడినంతగా తెలుగులో ఆడలేదు . పాటలు కూడా బాగుంటాయి మరి !

Ads

ఇద్దరు స్నేహితులు చిన్నప్పుడు దోపిడీదారులు తమ గ్రామాన్ని తగలబెట్టడంతో విడిపోతారు . వారిలో ఒకడయిన రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు . ఇంకొకడు NTR దీన జన రక్షకుడు అవుతాడు . ఇద్దరూ విలన్ని తుదముట్టిస్తారు .

సినిమాలో యన్టీఆర్ పేరు టైగర్ . సినిమాలో టైగరుతో కూడా పోరాడతాడు . ఈ సినిమాలో అంజలీదేవి యన్టీఆర్ తల్లిగా నటించింది . సాధారణంగా ఆడవారికి వయసు పెరగదు ; ఏ ముప్పై దగ్గరో , పాతిక దగ్గరో వయసు ఆగిపోతుంది అని అంటారు .

సినిమాల్లో మాత్రం హీరోల వయసు పెరగకుండా ఆగిపోతుంది . హీరోయిన్లుగా నటించిన యస్ వరలక్ష్మి , జి వరలక్ష్మి , అంజలీదేవి , శ్రీరంజని , పుష్పలత NTR , ANR ఇద్దరికీ తల్లులుగా నటించారు . వాళ్లు మాత్రం ఎవర్ యంగ్…

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . క్షణం క్షణం నిరీక్షణం , అంతా చూసాను ఎంతో చూసాను , ఒకటి రెండూ మూడు , ఏం దెబ్బ తీసావు ఏం ఎత్తు వేసావు , ఏ తల్లి కన్నదిరో నీటుగాడా , మారింది మారింది కాలం పాటలు బాగానే ఉంటాయి .

రాధా సలూజా నటించిన ఏకైక తెలుగు సినిమా ఇది . మరో హీరోయిన్ గా జయసుధ చెల్లెలు సుభాషిణి నటించింది . ఈ సినిమాకు వీరిద్దరూ మైనస్ పాయింట్లే . ఇతర పాత్రల్లో సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , గుమ్మడి , అన్నపూర్ణ , అల్లు రామలింగయ్య , సారధి , హాస్యనటుడు బాలకృష్ణ , జగ్గారావు , తదితరులు నటించారు .

సినిమాలో డైలాగ్స్ బాగుంటాయి . విద్వాన్ కణ్వశ్రీ , ప్రభాకర్లు వ్రాసారు . యాక్స్ టైలర్లు యన్టీఆర్ దుస్తుల్ని కుట్టారు . బెల్ బాటం పేంట్లు , ఏనుగు చెవుల్లాంటి కాలర్లు , వగైరా . యన్టీఆర్ని చూసి మేమూ కుట్టించుకున్నాం వీటన్నింటినీ .

సినిమా యూట్యూబులో ఉంది . యన్టీఆర్ , రజనీకాంత్ అభిమానులు చూసి ఉండకపోతే చూడవచ్చు . పాటలు బాగానే ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions