మనం తీహార్ జైలు అనగానే అదొక దుర్భేద్యం, ఖైైదీల ఆటలు సాగవ్, మస్త్ స్ట్రిక్ట్ మన్నూమశానం అనుకుంటాం కదా… తూచ్… ఉత్తదే… అదీ అన్ని జైళ్లలాంటిదే… కాదు, కాస్త ఎక్కువే… డబ్బుంటే అక్కడ ఏదంటే అది చల్తా… అక్కడి అధికారులకు సిగ్గూశరం లేవు… అరెరె, ఈమాట అంటున్నది మనం కాదు… సాక్షాత్తూ సుప్రీంకోర్టే కామెంట్ చేసింది… Absolutely Shameless… ఇంత ఘాటు వ్యాఖ్య చేసిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం… ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందీ అంటే… ఆ జైలులో ఇద్దరు ఖైదీలున్నారు… వాళ్ల పేర్లు అజయ్ చంద్ర, సంజయ్ చంద్ర… ఇద్దరూ బ్రదర్సే… తండ్రి రమేష్ చంద్ర… వీళ్లు డీఎల్ఎఫ్ తరువాత అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోట్ చేశారు… దాని పేరు యూనిటెక్… 2జీ స్కాంలో ఇరుక్కోవడం, నీరారాడియా టేపుల్లోనూ ప్రస్తావన రావడం, కేసులు నమోదు కావడం దరిమిలా జైలుపాలయ్యారు… మనీలాండరింగ్ కేసులో చాలారోజులుగా జైలులో ఉంటున్నారు…
అక్కడి నుంచే తమ వ్యవహారాలు నడిపించుకుంటున్నారు… అమ్మకాలు, కొనుగోళ్లు… వాట్ నాట్… జైలు కూడా వాళ్లకు ఓ అడ్డా… సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీ సాగుతోంది, దర్యాప్తుకు ఆటంకాలు కలుగుతున్నాయి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రెండుసార్లు ఢిల్లీ పోలీసులకు లేఖలు రాసింది… కానీ ఎవరూ పట్టించుకోలేదు… సుప్రీంలో విచారణ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది… సుప్రీం బెంచ్ ఈడీ లేఖల్ని పరిశీలించి, తీహార్ జైలు అధికారులకు నిజంగానే సిగ్గులేదు అని వ్యాఖ్యానించింది… అంతేకాదు, ఆ ఇద్దరిని ఆ జైలు నుంచి ముంబైకి తరలించాలని ఆదేశించింది… అక్కడ కూడా ఒకే జైలులో ఇద్దరిని పెట్టడం గాకుండా… అర్థర్ రోడ్ జైలులో ఒకరిని, తలోజా జైలులో మరొకరిని ఉంచాలని చెప్పింది… ఇది ఒకరకంగా తీహార్ జైలు అధికార యంత్రాంగాన్ని అభిశంసించడమే… ఇక్కడే సుప్రీం మరొకటీ ఆదేశించింది… అసలు ఈడీ అధికారులు లేఖలు రాసినప్పుడు ఢిల్లీ పోలీసులు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించింది… సో, స్వయంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ దర్యాప్తు జరిపి, అసలు ఆ జైలులో అధికారుల వైఖరి ఏమిటో, స్థితిగతులు ఏమిటో, ప్రస్తుతం తీసుకున్న చర్యలేమిటో తెలుపుతూ ఓ సమగ్ర నివేదికను నాలుగు వారాల్లో ఇవ్వాలని సూచించింది… ఇదీ వార్త… ఇది గురువారం నాటి తీర్పు… ఇది మన జైళ్ల అధికారులు, సిబ్బందికీ… డబ్బులున్న ఖైదీలకు నడుమ సహకారాన్ని బట్టబయలు చేస్తోంది… దేశరాజధానిలోని ఓ సెంట్రల్ జైలులోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రాల్లో జైళ్లు, సబ్ జైళ్లలో పరిస్థితి ఏమిటి.?!
Ads
Share this Article