Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీడి ఫుడ్డు వీడే వండుకుంటాడట- ఇంకానయం, చీర్ గరల్స్ కావాలనలేదు!

July 11, 2026 by M S R

.

Priyadarshini Krishna …. జైల్ అంటే క్రిమినల్ కి …. ముఖ్యంగా ఇండియన్ జైల్స్ అంటే మరీ తమాషా అయిపోయింది …
జైల్ కి పోవడం అంటే రాజకీయ నాయకులకు స్వాతంత్ర సమరానికి వెళ్ళినంత గొప్ప … తీహార్ కి పోవడం అంటే గొప్ప విషయం అని , తీహార్ నుండి బెయిల్ పైన బయటకు వస్తే ఏకంగా కడిగిన ముత్యం అయినంత …

అదే స్కామ్స్ చేసిన వ్యాపార వేత్తలు జైల్ కి పోతే … ఏదో హాలిడే వెకేషన్స్ కి పోయినట్లు ఫీల్ అవుతారు …
ఇంకా చోట మోటా చిల్లర క్రిమినల్ జైల్ కి పోయి బెయిల్ పైన బయటకు రావడం అంటే వాళ్ల ప్రొఫైల్ బిల్డ్ అయినట్లు అన్నమాట …

Ads

మొగుళ్ళని హతమార్చి జైలుకెళ్లిన మహిళామణులను చూసి మనం ఆశ్చర్య పోవలసిందే … వాళ్ళు లోపల ఎలా ఉన్నా, లోపలికి వెళ్ళేప్పుడు మాత్రం మీడియాకి తద్వారా ప్రేక్షకులమైన మనకు middle finger చూపించేంత తెగువ కలిగివున్నారు … వుండరా మరి చేసిన నేరాలెలాంటివి మరి …!

వీళ్ళందరూ ఒక ఎత్తు ఐతే….. ఉగ్రవాదులను జైల్ లో పెట్టడం అంటే అబ్బో…. ఏదో ఇంటి అల్లుడిని పండక్కి పిలుచుకోవడం అన్నట్లు ….
అసలు వాడికి చికినీలు, మటన్ బిర్యానిలు, మందు, మర్యాద … ఇంకా ఏమేమి ఉంటాయో మన బోటి వారికి తెలియనివ్వరు….

tihar

తాజాగా , మొన్నామధ్య ఢిల్లీ NIA అరెస్ట్ చేసిన ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాద మాస్టర్మైండ్- Matthew VanDyke, భారత్ కు వ్యతిరేకంగా భారత్ లో తిరుగుతూ యువతను బ్రెయిన్వాష్ చేస్తున్నట్లు NIA గుర్తించి జైల్లో వేసింది….

ఐతే, యధావిధిగా … మన జైల్ అధికారులు ఎప్పటినుండో ఈ విదేశీ అతిథులను కంటికి రెప్పలా చూసుకుంటారు కదా … లేదంటే మానవ హక్కులవాళ్ళు చొక్కాలు చించుకుంటారు కదా … అందుకని సంక్రాంతి అల్లుడులాగా అన్ని మర్యాదలు చేస్తున్నారు…

అయినా కూడా మనోడు ఆ మర్యాదలు నచ్చలేదంటూ ఫిర్యాదు చేస్తున్నాడు …
చాలా మసాలాతో కూడిన కూరలు వడ్డిస్తున్నారని, అవి తాను తినలేక ఎసిడిటీ అవుతోందని… తన staple diet అయినా పాస్టా పిజ్జా బ్రెడ్డు జాం వంటివి తనకు ఆహారంగా ఇవ్వాలని కోరుకున్నాడు … థూ, ప్రతి ఒక్కడూ కసబ్ గాడే…

ఇట్లుంటది మనతోని …
అతిధి కదా అని రోజూ మటన్ బిర్యానీ పెడితే ఎలా ….?!
వీళ్ళు అందరూ ఇలా జైళ్లకు పోతుంటే మనకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవుతాం …
వ్యవస్థ ఎప్పటికీ మారుతుందో …!

ఇంకా నయం, ఒక్కడినే బోర్ కొడుతోంది, చీర్ గరల్స్ కావాలని డిమాండ్ పెట్టలేదు, మరి ఇండియన్ జైళ్లా మజాకా… అన్నీ హక్కులే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions