.
- ఆహా ఓటీటీలో వచ్చే ఇండియన్ ఐడల్ షోలో జడ్జిల రాగద్వేషాలు, సెలక్టర్ల అతి వేషాల మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి నాకు… పలు మైనసులు ఉన్నా సరే కానీ ప్రస్తుతం సినిమా పాటల పోటీలో ఇదే టాప్… ఎందుకంటే..?
లాంచింగ్ ఎపిసోడ్లను పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే ఓ అంశం.,. గాత్ర వైవిధ్యం… అదీ కొత్తగా… ఈటీవీ పాడుతా తీయగా ఎస్పీ చరణ్ కొంత నేర్చుకోవాలి తెలుగు ఇండియన్ ఐడల్ చూసి… పాత వాళ్లను, ఆల్రెడీ పాపులర్ అయినవాళ్లను తీసుకుని, మళ్లీ పోటీకి పెట్టడంకన్నా… కొత్త గొంతులను పరిచయం చేయడం బెటర్ కదా…
అదే ఆహా చేస్తోంది… ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్ చేసి… కొన్ని వేల మందితో… ఈటీవీకి చేతకాదా..? కొత్త గొంతుల్ని పరీక్షించలేదా..? సరే, జీతెలుగు సరిగమప ఎలాగూ ఇక చక్కదిద్దలేని రీతిలో భ్రష్టుపట్టించారు, దాన్నలా వదిలేస్తే… తెలుగు ఇండియన్ ఐడల్‌ను సంగీత ప్రియులను ఆకట్టుకునేలా పాడుతా తీయగాను రక్తికట్టించే సాధనసంపత్తి ఈటీవీకే ఉంది… కానీ ఆ సంకల్పం, ప్రయత్నం లేదు ఫాఫం…
Ads
- సంగీత జ్ఞానం, రాగాలు, శృతులు, స్కేల్, పిచ్చింగ్, డైనమిక్స్, గమకాలు వంటి స్వర వ్యాకరణం ఎలా ఉన్నా… ఏమాత్రం స్వరజ్ఞానం లేని వాళ్లు కూడా సాధన చేసి, ఆకట్టుకుంటున్నారు కొందరు కంటెస్టెంట్లు ఆహా ఓటీటీలో… లాస్ ఏంజెల్స్ నుంచి వచ్చిన ఒకామె వాయిస్ టెక్స్‌చర్ బాగుండి, గీత ఏదో తిక్కవాదనకు దిగినా సరే థమన్, కార్తీక్ ఆమెకు టికెట్ ఇచ్చారు… బాగుంది…
- ఒక డార్జిలింగ్, ఒక స్కాట్లండ్, ఒక డెట్రాయిట్, ఒక బెంగుళూరు, ఒక షిమోగా, ఒక కేరళ పాలక్కాడ్, ఒక అబుదాబి, ఒక లాస్ ఏంజెల్స్… వావ్ కదా… కొందరు సరైన తెలుగే పలకలేరు, తెలియదు… పైగా అమెరికన్, నార్తరన్ యాస మిళితం.,.
కానీ సాధనతో తెలుగు పాటను సరిగ్గా ఆలపిస్తున్న తీరు బాగుంది… చివరకు అంధులు కూడా… అదే గాత్ర వైవిధ్యం… ఆసక్తికరంగా ఉంది… చాలామందికి పాట ఓ ప్యాషన్… వాళ్లు టాప్ 12లో చేరతారా లేదా వేరే విషయం… ఈ ఐడల్ వేదిక వరకూ వచ్చి, పాడటమే అదృష్టంగా భావిస్తున్నవాళ్లు కూడా..! వావ్… థమన్ భాషలో చెప్పాలంటే… గాత్ర వైవిధ్యం ఈ చీపురుపల్లి నుంచి ఆ డలాస్‌పల్లి దాకా… ఆముదాలవలస నుంచి అబుదాబి దాకా…
ఒకరిద్దరు సొంత బ్యాండ్లు, అంటే ఆర్కెస్ట్రాలు… చాలా జానర్ల పాటలు… ఐతే వీళ్లలో ఎవరెవరు టాప్ 12కు చేరతారనేది పక్కన పెడితే… నిజానికి లాంచింగ్ ఎపిసోడ్లే రక్తికడుతున్నాయి…
అవునూ, ఇలాంటివి భారీ స్థాయిలో ఆపరేట్ చేయగల స్టార్ మాటీవీకి మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షో ఎందుకు చేతకావడం లేదు..? ఒకప్పుడు సూపర్ సింగర్ పేరిట ఉర్రూతలూగించిన చానెలే కదా..!! అన్నట్టు… ఒక సీజన్ విజేత వాగ్దేవి సోదరి వైష్ణవి కూడా వచ్చింది ఈసారి పోటీకి…! సో, నాలుగు ఎపిసోడ్లతో టాప్ 12 ఫిక్సయ్యారు… ఇక అసలు పోటీ చూద్దాం…
Share this Article