Priyadarshini Krishna…. How the total generation is getting killed by unproductive activities:
ఒక పదేళ్ళ క్రితం వరకు ఇంత విరివిగా లేని ఇంటర్నెట్ సౌలభ్యం, ఇంత చవగ్గా దొరికే చైనా వాడి స్మార్ట్ ఫోన్స్ ఒక జనరేషన్ మొత్తాన్ని ఎందుకు కొరగాకుండా మార్చేసింది.
రాగ్‌పికర్స్ చేతిలో మొబైల్ రావడం నిజమైన విప్లవం అనుకున్నాం. సామాన్యుని చేతిలో కమ్యునికేషన్ విప్లవం అని , కనెక్టింగ్ పీపుల్ అని, ఇన్‌ఫర్మేషన్ విప్లవం అని, అభివృద్ధి అని, జెనరేషన్ నెక్ట్స్ అని, గ్లోబల్ విలేజ్ అని….. తెగ సంబరపడ్డాం….!!
Ads
ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్స్ వున్నట్లే…. ప్రతి యుద్ధానికి కొల్లాటరల్ డామేజ్ వున్నట్లే ఈ అత్యాధునిక ఇంటర్నెట్ విప్లవానికి కూడా అదే ప్రమాదం వుందన్న విషయం పదేళ్ళకుగానీ తేటతెల్లంకాలేదు…!
ఈరోజు యువత ఏం చేస్తుందయ్య అంటే ఇన్‌స్టాలో లైవులు, యూట్యూబులో వీడియోలు, ఫేస్బుక్కులో షాట్స్ తో కాలం వెళ్ళదీస్తోంది. యూట్యూబ్ అనేది ఎంత మంచిదో అంత చెడూ చేస్తోంది… ఇక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్కులు సరేసరి…!
వాటివల్ల ప్రతి సగటు మనిషి ఒక సెలబ్రిటీనే, ప్రతి వ్యక్తి తనకుతానో బ్రాండ్…!! యే ముహూర్తాన మన పూరీ ‘ఎవడి సినిమాకి వాడే హీరో’ అన్నడో ఆ శుభముహూర్తం నుండీ ప్రతి వాడూ రితిక్కూ, మహేష్బబూ… ప్రతి టెంకె మొహం అలియా, అనుష్కాలే…!!
పొట్ట కోస్తే అక్షరం రాదు, తిప్పిచూస్తే పది కూడా పాసై వుండరు కానీ సంపాదన లక్షలు….. షబాష్ ! డబ్బులు ఎవరివి పోతున్నాయ్.. మనవే
టైం బొ_ ఎవరికి ?….. మనకే !! మరి తెల్సేదెప్పుడు … మొత్తం సం- సారీ- మొత్తం వృధా అయ్యాక..!!
ఒకప్పుడు 24 గంటల్లో పది గంటలు చదువులు లేదా ఉద్యోగాలు, నిద్రకాలకృత్యాలకు ఎనిమిది పోను, ప్రయాణం సొంత పనులకు కొంతపోను, నాలుగ్గంటలు ఎంటర్‌టైన్మెంట్‌కి – అనగా టీవీ చూడటానికో ఫోనుల్లో బాతాఖానీకో ఉపయోగించేవారు…. మరిప్పుడో…. ఒక్క నిద్రపోయేప్పుడుతప్ప ప్రతి నిముషం ప్రతి క్షణం మొబైల్‌లోకి కళ్ళు దూర్చడమే…!!
హఠాత్తుగా మెలకువ వస్తే వెంటనే మొబైల్‌లోకే చూపులు… ఎంత టైం ప్రొడక్టివ్‌గా మార్చగలుగుతున్నాము… అందులో ఎంత టైం దేశాభివృద్ధికి ఉపయోగపడుతోంది…. ఎంతమంది యువత తమ కాళ్ళపై తాము నిలబడి ఇంకొకరికి చేయూతనిస్తున్నారు… ఎంతమంది సామాన్య ప్రజలకు అవసరమైన వస్తు ఉత్పాదక వ్యవస్థలో శ్రమిస్తున్నారు….
ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రొడక్టివ్ గా పెంచుతున్నారు…. పదేళ్ళ పిల్లలకి సొంతంగా ఫోను, అందులో సోషల్ మీడియా ఆప్స్ …. అసలు స్కూల్సే మొబైల్‌లో హాజరయ్యే దుస్థితికి దిగజార్చాక రేపటి పౌరుల్లో సామర్థ్యం శక్తియుక్తులు ఎక్కడి నుండి వస్తాయి…. యూట్యుబులో ఇన్‌స్టాలో కనపడటమే పరమావధిగా మారుతున్న జనం ఒకవైపు…. ఆ అర్థంపర్థంలేని సోది చూసి తమ కష్టార్జితాన్ని డేటాచార్జి రూపేణా తగలేస్తున్న అమాయక ప్రజానీకం – అంటే మనమే- మరోవైపు……. నిద్రలేచేసరికి ఒక జీవితకాలం వ్యర్థమైపోతుంది…!!
Share this Article