Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!

August 18, 2026 by M S R

.

“TIMS దగ్గరలోని ఓ మెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాడు కేటీయార్… అక్కడ రోగులతో చిట్‌చాట్… నేనే టీఐఎమ్ఎస్ (TIMS) నిర్మించిన వాడిని, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా?’ అని అడిగాడు…. దానికి అక్కడున్న ఒక రోగి ఇలా సమాధానమిచ్చాడట… ‘పర్లేదు బాబూ; మొదట్లో నేను కూడా సరిగ్గా ఇలాగే ఏదేదో మాట్లాడేవాడిని… కానీ రానురాను వ్యాధి తీవ్రత తగ్గిపోతుందిలే… అవునూ, ఒకవేళ నువ్వే దాన్ని నిర్మించి ఉంటే, పదేళ్లలో దానిని ప్రారంభించడానికి నీకు టైమే దొరకలేదా మరి..?’ అనడిగాడట ఓ పేషెంట్…’’

…. కేటీయార్, హరీష్ రావుల ‘టిమ్స్’ శోక రాజకీయ క్షుద్ర విమర్శలకు రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇస్తాడని ఎదురుచూశారు చాలామంది… రేవంత్ రెడ్డి ఇలా ఓ పర్‌ఫెక్ట్ కౌంటర్ వేశాడు… వ్యంగ్యాన్ని దట్టించి పేల్చాడు… నిజమే కదా… సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంకల్పించాడు కేసీయార్… కానీ అర్థంతరంగా వదిలేశాడు…

Ads

మూడేళ్లలో వరల్డ్ రికార్డు కాళేశ్వరం కట్టామని జబ్బలు చరుచుకునే వాళ్లు వీటిని ఎందుకు పూర్తి చేయలేదు మరి..? శ్రద్ధ లేక..! కేసీయార్‌కు పేరొస్తుందనే తుచ్ఛమైన ఆలోచన చేయలేదు కదా రేవంత్ రెడ్డి, హుందాగా ఆ పనులు పూర్తి చేయించి, సనత్‌నగర్ టిమ్స్ తనే ప్రారంభించాడు… అంతేకాదు, ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీలను కూడా వచ్చే ఏడాది చివరికల్లా కంప్లీట్ చేస్తానని, 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ వైద్యం తెలంగాణ సమాజానికి అందుబాటులోకి వస్తుందని చెప్పాడు…

ప్రభుత్వం అంటేనే ఓ నిరంతర ప్రక్రియ… ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అనేది కాదు, అది నడుస్తూనే ఉంటుంది… పైగా ఈ నిర్మాణాలకు ఆ డబ్బులేవీ కేసీయార్ సొంత జేబులోవి కావు… తను ప్రారంభించి, పూర్తిచేయలేకపోతే, రేవంత్ రెడ్డి పూర్తిచేస్తున్నాడు… అది ప్రశంసనీయం… కానీ బీఆర్ఎస్ క్యాంపు దేన్నీ అలా స్వీకరించదు కదా, శోకాలు మొదలుపెట్టింది…

అయ్యో, అయ్యో, అన్యాయం, అక్రమం, దుర్మార్గం… సంకల్పం కేసీయార్‌ది, ప్రచారం రేవంత్ రెడ్డిది అని ఏడుపు స్టార్ట్… సేమ్, నర్మెట్ట పామాయిల్ ఫ్యాక్టరీ విషయంలోనూ, ప్రభుత్వ కొలువుల నియామక పత్రాల జారీ విషయంలోనూ అంతే కదా… కానీ ఎవరు వద్దన్నారు పూర్తి చేసి, వాళ్లే ప్రారంభించవచ్చు కదా… ఉస్మానియా కొత్త భవనాల్ని ఎందుకు వదిలేసినట్టు..? ఇవన్నీ నిష్ఠుర నిజాలు… పోనీ, ఇప్పుడు ‘‘కేసీయార్ దివ్య సంకల్పంతో నిర్మాణాలు ప్రారంభించబడిన టిమ్స్’’ అని అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ఉండాల్సిందా..? అసలు ఇదేం పోకడ..?

కేసీయార్ బాపూ, నువ్వు వచ్చి రిబ్బన్ కట్ చేయి అని ఆహ్వానించడానికి మంత్రుల్ని పంపించి ఉండాల్సిందా..? (అలా పిలిచినా రాడు కదా, అది వేరే సంగతి)… అటు రేవంత్ రెడ్డి టిమ్స్ ప్రారంభానికి వెళ్తున్నాడని తెలియగానే… ఇది మాదే, ఘనత మాదే, మా బాపుదే, తను రిబ్బన్ కట్ చేస్తున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడనే అఘోరా మార్క్ క్షుద్ర మాటలు దేనికి..? ఎక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుందేమోననే కుళ్లుబోతుతనం… ఇది కరెక్టు కాదు…

సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డే కాదు, ఇంకెవరున్నా, వాళ్లు పూర్తి చేస్తే, ప్రారంభిస్తే, వాళ్లకే క్రెడిట్ దక్కుతుంది, అది సహజం… ఈమాత్రం బేసిక్ సోయి చూపించకపోతే ఎలా..? అసలు ఇవే కాదు, ఆ మిగిలిన టిమ్స్, ఉస్మానియా, వరంగల్ హాస్పిటల్స్‌ను కూడా పూర్తిచేస్తాననే సంకల్పాన్ని బహిరంగంగానే ప్రకటించాడు… అదీ మింగుపడని అసలు గులాబీ శోకం !

పైగా రేవంత్ రెడ్డి తనదైన ఆ తొండలు- లాగుల భాష వదిలేసి… సెటైర్ ఆశ్రయిస్తున్నాడు ఈమధ్య… ‘‘మీకు హాస్పిటల్స్ పూర్తిచేయడం తెలియదు, చేతకాలేదు, కానీ ఎర్రవల్లి, జన్వాడ, మొయినాబాద్, శంకర్‌పల్లిలో ఫామ్‌హౌస్‌లు మాత్రం పూర్తిచేసుకున్నారు’’ అని మరో కౌంటర్ వేశాడు అక్కడే… అతనికంటే ఘనుడు అచంట మల్లన్న అన్న రీతిలో..! హరీష్, కేటీయార్ ఒకటి వదిలితే, రేవంత్ ఉల్టా పది అంటిస్తున్నాడు ఇలా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?
  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…
  • ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!
  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…
  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions