నేరుగా ఓ వింత ప్రణయ, పరిణయ గాథలోకి వెళ్లిపోదాం… నుస్రత్ జహాన్ గర్భిణి… సో వాట్..? లోకంలో ఎవరికీ పెళ్లిళ్లు కావడం లేదా..? గర్భం ధరించడం లేదా..? అందులో వింత ఏముంది అంటారా..? వెయిట్… ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన… అంటే మమతా బెనర్జీ పార్టీకి చెందిన లోకసభ సభ్యురాలు… రెండేళ్ల క్రితం ఓ వ్యాపారి నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది… ఆ వార్త కూడా ఎప్పుడో పాతబడిపోయింది… హిందూ సంప్రదాయాల మేరకు జరిగిన ఆ పెళ్లిని కొందరు ఇష్టపడలేదు, కొందరు విపరీతంగా ఇష్టపడ్డారు… అదీ వదిలేద్దాం… ఆమె ఓ సినిమా నటి… పైగా ఇప్పుడు ఎంపీ… అందమైన సెలబ్రిటీ కాబట్టి, ప్రజాజీవితంలో ఉంది కాబట్టి సహజంగానే ప్రజల ఆసక్తి ఉంటుంది… ఇప్పుడు ఆమె కడుపు చుట్టూ, ఇంకా లోకంలోని రాని ప్రాణి చుట్టూ ఓ కథ చక్కర్లు కొడుతోంది… రచయిత్రి తస్లీమా ఏదో ఫేస్‌బుక్ పోస్టు పెట్టి మరింత చర్చకు తెరలేపింది…
‘‘స్థిరంగా లేని బంధాన్ని పట్టుకుని గబ్బిలంలాగా వేలాడటం దేనికి..? ఎవరో నటుడు యష్‌తో ప్రేమాయణంలో ఉందంటున్నారు… అలాంటప్పుడు జైన్‌తో విడాకులు తీసుకుని, స్వేచ్ఛగా ఉండొచ్చు కదా…’’ అని ప్రశ్నించింది, అది నుస్రత్‌కు ఓ బహిరంగలేఖ అన్నమాట… అందులోనే ‘‘కథలు ఏవైనా అంతిమంగా మగాడు మగాడే… ఆనందం కోసం మరో విషపూరిత పెళ్లి వైపు వెళ్లాలా..? అదీ బాగా లేకపోతే..? మరొకటా..? ఇక ఈ పరుగుకు అంతం ఎక్కడ..? ఒక మహిళకు అత్యంత ఆదర్శుడైన భర్త కలలోనే సాధ్యం, రియాలిటీలో దొరకరు… ఒక మహిళ తన సంతానాన్ని ఒంటరిగా పెంచలేదా..? కేవలం తన బిడ్డగా పెంచితేనేం..?’’ అంటూ అదోరకం ఆధునిక వైరాగ్యంలోకి వెళ్లిపోయింది… ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్‌కు తన భర్త నిఖిల్ జైన్‌తో ఇప్పుడు సంబంధాలు సరిగ్గా లేవు, ఆమె యష్ అనే మరో నటుడితో ఉంటోంది అనేది కథ… ఈ యష్‌దాస్‌గుప్తా ఎవరు..? నటుడే కాదు, మొన్నటి ఎన్నికల ముందు బీజేపీలో చేరి, ఏదో స్థానం నుంచి పోటీచేశాడు కూడా…
Ads
సో వాట్..? ఆమె టీఎంసీ ఎంపీ అయితేనేం..? అతను బీజేపీ లీడర్ అయితేనేం..? వాళ్ల వ్యక్తిగత జీవితాలు వేరు… పార్టీల పట్ల వేర్వేరు దృక్పథాలు, ఆచరణ ఉండకూడదా..? ఇదీ ప్రశ్న… ఉండొచ్చు… కానీ ఇక్కడ ఇష్యూ ఏమిటీ అంటే..? ఆమె మొదటి పెళ్లి మతాంతరమే… ఈ రెండో సంబంధమూ మతాంతరమే… అదీ అసాధారణం ఏమీ కాదు… ఇంకో ఇంట్రస్టింగు చర్చకు తెరలేచింది ఎక్కడంటే..? ఆమె భర్త తమ పెళ్లి రద్దుకు కోల్‌కతా కోర్టులో దరఖాస్తు చేశాడు… ‘‘గత నవంబరు నుంచే నాకూ ఆమెకూ నడుమ ఏ బంధమూ లేదు… ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి నన్నెందుకు అడుగుతున్నారు..?’’ అంటున్నాడు… మరెవరు తండ్రి..? నిజానికి అది కూడా కాదు, మరో ఇంట్రస్టింగు పాయింట్ ఉంది… ‘‘అసలు మా పెళ్లి చట్టబద్ధమే కాదు, అదసలు పెళ్లే కాదు, పెళ్లే లేనప్పుడు విడాకులు ఏమిటి..? రద్దు ఏమిటి..?’’ అంటోంది ఆమె…
ఒక ఎంపీ, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపీ సాక్షాత్తూ తన పెళ్లిపైనే లేవనెత్తిన ఒక ప్రశ్నకు ఓ లీగల్ ఇంపార్టెన్స్ ఉంది, దీన్ని చర్చించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది… ఎలాగంటే..? ‘‘మాది డెస్టినేషన్ మ్యారేజీ… టర్కీలో పెళ్లి చేసుకున్నాం… రెండు వేర్వేరు మతాలు… మేం అక్కడి పౌరులం కూడా కాదు… సో, అక్కడ జరిగిన పెళ్లికి టర్కీలో లీగల్ వేలిడిటీ (చట్టబద్దత) ఎలాగూ లేదు… జస్ట్, మేం టూరిస్టుల్లా వచ్చాం, వెళ్లాం… ఆ దేశానికి సంబంధించి ఆ ఈవెంట్ విలువ అంతే… ఇండియాలో మా పెళ్లి జరగలేదు… మతాంతరం కాబట్టి, ప్రత్యేక వివాహచట్టం కింద రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంది… కానీ చేసుకోలేదు… అంటే ఇండియాలోనూ మా బంధానికి లీగల్ వేలిడిటీ లేదు… ఏదో కలిసి ఉన్నాం, అంతే…’’ అంటోంది ఆమె… అంటే లీగల్ వేలిడిటీ లేని పెళ్లి పెళ్లే కాదా..? హిందూ సంప్రదాయాల మేరకు జరిగిన తంతుకు అర్థమేమిటి..? అది వాళ్లిద్దరూ భార్యాభర్తలే అని నిర్ధారించదా..? బహిరంగంగా జరిగిన ఆ తంతుకు నిజంగానే ఏ విలువా లేదా..? డెస్టినేషన్ మ్యారేజీలకు లీగల్ వేలిడిటీయే లేదా..? మరి దీనికి పరిష్కారం, భార్యకు చట్టబద్ధమైన హక్కు ఎలా సాధ్యం..? పైగా ఇప్పుడు ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..? ఆ ప్రశ్నను ఎవరూ అడగలేరు కదా… ఎలాగూ విడిపోయింది కదా, తన ఆస్తుల్ని, తన బ్యాంకు ఖాతాల్ని భర్త నిఖిల్ ఎలా దుర్వినియోగం చేశాడో ఇప్పుడు ఏకరువు పెడుతోంది… ఇవన్నీ సరే… ఇంతకీ ఆమెతో కలిసి తిరుగుతున్న యష్‌దాస్‌గుప్తా ఏమంటున్నాడు..? ఏమీ లేదు… సైలెంట్…!!
Share this Article