నంబర్ వన్ ప్లేసులోకి రావడానికి హైదరాబాదులో ఈనాడు, సాక్షి తన్నుకుంటున్నాయి… పర్ సపోజ్, ఆ పోటీలోకి హఠాత్తుగా ఎక్కడో నాలుగో ప్లేసులో బిక్కుబిక్కుమంటూ ఉండే నమస్తే తెలంగాణ వచ్చేసి, సాక్షిని పడగొట్టేసి సెకండ్ ప్లేసులోకి వస్తే..? అబ్బే, కష్టమండీ అంటారా..? రాష్ట్ర ప్రసార రేటింగ్స్‌కు సంబంధించి టీవీ9 చానెల్‌ను ఎన్టీవీ కొట్టేసి, నంబర్ వన్ కుర్చీలో కూర్చుని, ఇక టీవీ9కు ఇప్పటిదాకా మళ్లీ కోలుకునే చాన్స్ ఇవ్వడం లేదు…
కానీ హైదరాబాదులో మాత్రం ఆది నుంచీ టీవీ9 చానెలే ఫస్ట్ ప్లేసు… రాష్ట్రమంతా కొట్టగలిగినా ఎన్టీవికి హైదరాబాద్‌లో టీవీ9ను కొట్టేయలేకపోతోంది… ఏదో కష్టపడుతోంది గానీ టీవీ9 హైదరాబాద్‌లో తన నంబర్ వన్ ప్లేసును కాపాడుకుంటోంది… అకస్మాత్తుగా టీన్యూస్ పోటీలోకి వచ్చింది… ఎన్టీవీని దాటేసింది… సెకండ్ ప్లేసులో వచ్చి కూర్చుంది… హైదరాబాదులో ఇప్పుడిక నంబర్ వన్ కావాలంటే ఎన్టీవీ ఒక్క టీవీ9తో మాత్రమే కాదు, టీన్యూస్‌తో కూడా పోరాడాలి…
Ads
భలేవారే… టీన్యూస్‌ను అసలు ఏపీలో ఎవరూ చూడరు కదా, మరి రెండో ప్లేసుకు ఎలా వచ్చింది అనే చొప్పదంటు ప్రశ్న వేయకండి… టీన్యూస్ సెకండ్ ప్లేసులోకి వచ్చింది కేవలం హైదరాబాదులో మాత్రమే… ఐనా సరే, రాష్ట్ర ప్రసారాల లెక్కల్లో ఎక్కడో ఆరో ప్లేసులో అనామకంగా ఉండే చానెల్ హఠాత్తుగా రేటింగుల్లో హైదరాబాదులో నంబర్ టూ కావడం ఏమిటీ అంటారా..? బార్క్ రేటింగ్స్ అలాగే ఉంటాయి కొన్నిసార్లు… ఇదీ హైదరాబాద్ బార్క్ పొజిషన్…
అసలు అన్నింటికన్నా చిత్రం మరొకటి… రాష్ట్రంలో మూడో ప్లేసులో ఉండే టీవీ5 చానెల్ హైదరాబాదులో నాలుగో ప్లేసుకు ఎదగడం… పచ్చరంగు పులుముకున్న ప్రసారాలు తప్ప అందులో ప్రొఫెషనాలిటీ ఎక్కడుంది అనే మరో చొప్పదంటు ప్రశ్న సంధించకండి… టీన్యూస్ కేవలం గులాబీ రంగు వార్తలే ప్రసారం చేయడం లేదా…? టీడీపీ చానెల్‌గా ముద్రపడిన ఏబీఎన్ చానెల్ కూడా పెద్ద చానెళ్లతో బలంగా పోటీపడుతోంది… ఫాఫం, సాక్షి, ఈటీవీల పరిస్థితే ఎక్కడో కొట్టుమిట్టాడుతోంది… టీన్యూస్ కాస్త గర్వంగా చెప్పుకోవడానికి మరో విశేషమూ ఉందండోయ్…
బార్క్ 52వ వారం… గత ఏడాది… రేటింగ్స్‌కూ ఇప్పటికీ తేడాను చూస్తే టీవీ9, ఎన్టీవీ కూడా రేటింగ్స్ కోల్పోయాయి ఎంతోకొంత… కానీ టీన్యూస్ 19 శాతం గ్రోత్ సాధించింది… ఎహె, ఈ లెక్కలన్నీ పిచ్చి రేపుతున్నాయి అంటారా..? అవును మరి… టీవీ డిబేట్లు, ప్రసారాల్లాగే వాటి రేటింగ్ లెక్కలు కూడా అంత త్వరగా జీర్ణం కావు…!! సరళంగా, ప్లెయిన్‌గా ఉంటే వాటిని చానెళ్లు, రేటింగ్స్ అనరు… అనకూడదు..!!
Share this Article