ఫైమా గనుక తన చేతిలో ఎన్న ఎవిక్షన్ పాస్ వాడుకుంటే, తను సేవ్ అవుతుంది… ఇక ప్రేక్షకుల ఓట్లు తక్కువున్నా, ఎక్కువున్నా సరే రాజ్ ఎలిమినేట్ అవుతాడు… అలా గాకుండా ఫైమా గనుక ఎవిక్షన్ పాస్‌ను రాజ్‌ను సేవ్ చేయడానికి వాడితే, తీరా ఫైమాకు తక్కువ ఓట్లు వచ్చి ఉంటే తను ఎలిమినేట్ అవుతుంది… తనకు ఎవిక్షన్ పాస్ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది… అలా కూడా గాకుండా ఎవిక్షన్ పాస్ ఎవరికీ వాడకుండా వదిలేస్తే, ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు ఎలిమినేట్ అవతారు, పాస్ వేస్ట్ అయిపోతుంది…
ఇదీ ఈక్వేషన్… ఫైమా వాళ్లమ్మ చెప్పింది, నువ్వే వాడుకో బిడ్డా అని… హౌజులో అందరూ చెప్పారు, నువ్వే వాడుకో అని… సో, రిస్క్ లేకుండా నీ పాస్ నువ్వు వాడుకో అన్నారు… మొదట్లో ప్రేక్షకులు ఎలా చెబితే అలా..? ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే వెళ్లిపోవడానికి కూడా రెడీ అని ఫైమా వాదించింది…
కానీ రాజ్ కూడా ఓ మాట అన్నాడు… నువ్వు గనుక నన్ను సేవ్ చేస్తే, వచ్చే సారి నేను ఎలిమినేట్ కావచ్చు కదా, అలాంటప్పుడు నన్ను సేవ్ చేసినా ప్రయోజనం ఏముంది..? ఒకవేళ నువ్వు లీస్ట్‌లో ఉండి, ఎవిక్షన్ పాస్ నాకు వాడితే అది కరెక్టు కాదు అనేది రాజ్ వాదన… నువ్వు వెళ్లిపోతావు… అలా కాదని పాస్ నాకు వాడితే, నేను లీస్ట్‌లో ఉన్నట్టు తేలినా నువ్వు వెళ్లిపోాతావు… సో, ఏరకంగా చూసినా నీకు సేవింగ్ ఉండీ వెళ్లిపోవడం కరెక్టు కాదనేది రాజ్ వివరణ… కరెక్టు…
Ads
ఈ స్థితిలో చివరకు ఆమె తనను సేవ్ చేసుకోవడానికి పాస్ వాడుకుంటున్నట్టు చెప్పింది… ఫైనల్… ఆమె రిస్క్ తీసుకోదలుచుకోలేదు… సరైన నిర్ణయమే… దీంతో క్లియర్ పిక్చర్ ఏర్పడింది… ఆమె సేవ్ కాబట్టి ఎవరికెన్ని వోట్లు అనేది ఇక కౌంట్‌లోకి రాదు… రాజ్ వెళ్లిపోవాల్సిందే… తనకు ఆ ఈక్వేషన్ తెలుసు, తను మెంటల్‌గా కూడా ప్రిపేరయ్యాడు… వెల్ బ్యాలెన్స్‌డ్, వెల్ మెచ్యూర్డ్…
ఎవరు వోటింగులో దిగువ ఉన్నారు, ఎవరు పైన ఉన్నారు తెలిపే సీన్… ఫైమా దిగువన ఉంది వోటింగులో… రాజ్ ఆమెకన్నా పైన ఉన్నాడు… అంటే ఫైమా ఆ పాస్ వాడి, తనను తాను బతికించుకుంది… కానీ ప్రేక్షకులు ఫైమా ఆటను తిరస్కరించారని తేలిపోయింది… ఆమెనే హౌజు నుంచి వెళ్లిపొమ్మన్నారు… రాజ్ నిజానికి సేవ్ కావాల్సి ఉంది… కానీ ఆ పాస్ పుణ్యమాని ఫైమా ఉండిపోయింది, రాజ్ వెళ్లిపోయాడు… అంటే బిగ్‌బాస్ అంటే కొన్నిసార్లు లాటరీ కూడా… ఎవిక్షన్ పాస్ అంటే అంతే కదా…!! అవునూ, నాగార్జున హఠాత్తుగా కీర్తిని మోస్తున్నాడు దేనికో…!!
Share this Article