మన తెలుగు తారలు ఎలాగూ మన సినిమా పెద్దల కళ్లకు ఆనరు… కారణాలు అనేకం… రాశీ ఖన్మా, రకుల్ ప్రీత్‌సింగ్, రష్మిక మంథన, లావణ్య త్రిపాఠీ, పాయల్ రాజ్‌పుత్… అబ్బే… ఇంకేమీ కొత్త పేర్లు లేవా..? ఇంకా ఆ నిత్యామీనన్, నివేదా థామస్, నిధి అగర్వాల్, కియరా అద్వాణీ, సాయిపల్లవి దగ్గరే ఆగిపోయారేం… ఇంకా… ఇంకా… న్యూ, ఫ్రెష్… ఇదుగో ఇలాగే వెతుకుతున్నారు… దేశమంతా తిరుగుతున్నారు, కంటాక్ట్స్ అన్నీ తిరగేస్తున్నారు…
అపర్ణ బాలమురళి… సింగర్… ఆకాశం నీ హద్దురా హీరోయిన్… ఇప్పుడు నాని కొత్త సినిమా ‘అంటే… సుందరానికీ’ హీరోయిన్ నజ్రియా ఫహాద్… కేరళ నటుడు ఫహాద్ భార్య… ఇంట్రస్టింగు… ఇంకా… ఇంకా… బాలయ్య పక్కన పూర్ణ కాశిం… తను పాత నటే… అందరికీ పరిచయమే… ప్రయాగ మార్టిన్… పర్లేదు, కానీ వర్కవుట్ కాలేదు… ఛలో, సాయేషా సైగల్… ఆమె కూడా వద్దు, పోనీ, ప్రజ్ఞా జైస్వాల్… వీరిలో ప్రజ్ఞా పరిచయమున్న పేరే… ఇంకెవరైనా కొత్త మొహాలు దొరుకుతాయా..? వెతకండి, వెతకండి…
Ads
త్రిష, కాజల్, అనుష్క, నయనతారలు కాదు… చిరంజీవి పక్కన కూడా ఓ కొత్త హీరోయిన్ కావాలి… ఎవరు..? ఎవరు..? ఈ అన్వేషణ సరిహద్దులు దాటేసి మరీ సాగుతోంది… అదీ ఇప్పుడు విశేషం…
నాగశౌర్య కొత్త సినిమా కోసం ఓ సింగర్ దొరికింది… పేరు షిర్లీ సేటియా… పుట్టింది మన కేంద్రపాలిత ప్రాంతం డామన్లోనే అయినా… పెరిగింది న్యూజిలాండ్… గొంతుతోపాటు మొహం కొత్తగా ఉంది… కమాన్, బుక్ చేసేశారు… మన హీరోలకు ఇంకా కొత్త మొహాలు కావాలి…
రాజమౌళి సినిమాలో ఓ ఐరిష్ మోడల్… పేరు అలిసాన్ డూడీ… ఆర్ఆర్ఆర్ సినిమాను బాహుబలికి మించి… ప్రపంచంలోని పలు భాషల్లోకి, పలు దేశాలకూ తీసుకుపోవాలి… అదీ ప్లాన్… ఆలియా భట్… అఫ్ కోర్స్, పాత మొహమే, బాలీవుడ్ తారలు మనకు కొత్తేమీ కాదు… కానీ హిందీ మార్కెట్ కోసం ఓ పాపులర్ ఫిగర్ కావాలి… అదీ ఆలోచన…
ఒకప్పుడు కొత్త మొహాలు కావాలంటే ముంబై వెళ్లేవాళ్లు… ఎవరో ఓ తెల్లతోలు అమ్మాయి దొరికితే చాలు, పట్టుకొచ్చేసేవాళ్లు… నాలుగైదు సినిమాలు… అంతే మళ్లీ పత్తాకు దొరకరు… మళ్లీ కొత్త మొహాలు… ఇప్పుడు కేరళ తీరాల్లో అన్వేషణ… అదీ దాటి విదేశాల నుంచి కూడా… రాను రాను దీపిక పడుకోన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ కూడా ఆనరేమో… ఎమ్మా హాట్సన్, ఆంజిలినా జూలీ, అన్నే హతవే, మార్గల్ రాబీ… మోడల్స్, సింగర్స్, యాంకర్స్, డాన్సర్స్… ఎవరైనా సరే… టాలీవుడ్ పిలుస్తోంది… విశ్వసుందరులకు స్వాగతం… తెలుగు అమ్మాయిలా… ఛఛ…! అసలు తమిళ, హిందీ, మళయాళీ తారలే ఆనడం లేదు… ఇంకా తెలుగు తోళ్లు ఏల..? కొత్త మొహాలు మాత్రమే కావలెను…! అంతే…!!
Share this Article