Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…

July 6, 2025 by M S R

.

( Gopu Vijay Kumar Reddy  ) …. వాణిజ్య కోణంలో తెలుగు సినిమా గతి తప్పి, ఓ దిశ లేకుండా… ప్రణాళికరహితంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే గుడ్డిగా పరుగు తీస్తూ బోలెడు నష్టాల్ని మూటగట్టుకుంటూ… ఈ బుడగ ఎప్పుడు పేలుతుందో అన్నట్టుగా ఉంది…

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే కాదు… మీడియం రేంజ్ హీరోలు కూడా ఓ ముఖ్య కారణమే… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం… ఆధారాలతో సహా చెప్పుకుందాం… ఇది సవివర, సాధికార విశ్లేషణ…

Ads

అక్షరాలా మీడియం రేంజ్ హీరోల మీద లాస్ట్ వన్ ఇయర్ లో టాలీవుడ్ పోగొట్టుకుంది దాదాపు 200 కోట్లు… సరైన లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువే తేలుతుంది… ఈ మీడియం రేంజ్ హీరోలు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు.., ఇంకా నేను తోపు, నేను తురుము, మా అయ్య, మా వంశం, నా ఫ్యాన్స్ అనే గొప్పలే తప్ప ఒక్కరికీ రియాలిటీ చెక్ తెలియటం లేదు…

  • ఈ OTT యుగంలో ఆడియన్స్ అభిరుచులు, మార్కెట్ డైనమిక్స్, టికెట్ రేట్లు, థియేటర్ల-  కాంటీన్ దోపిడీలు చూసి జనాలు థియేటర్‌కే రావటం మానేసినా వీళ్ళు మాత్రం ఇంకా మారట్లేదు…

దీనికి రెండు సినిమాలు ఎక్సంప్షన్ తండేల్, విరూపాక్ష… ఈ రెండు సినిమాలు కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా క్లీన్ హిట్ కాలేదు.., కాస్తో కుస్తో హీరో నాని నయం, కనీసం మినిమం అయినా కలెక్షన్స్ వస్తాయి…

telugu movie

ఓవరాల్ గా మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 150- 160 సినిమాలు డైరెక్ట్ గా, దాదాపు 15 నుంచి 20 డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతాయి.., దానిలో క్లీన్ సినిమా సక్సెస్ రేట్ కేవలం 7- 8 % … అంటే దాదాపు 10-11 సినిమాలు మాత్రమే…

దాంట్లో పెద్ద హీరోల సినిమాలు, అంటే 100 కోట్లకు పైన మార్కెట్ షేర్ ఉన్న హీరోలవి 3- 4 నాలుగు ఉంటాయి. అది కూడా పెద్ద డైరెక్టర్స్ కావడం వల్లనే… ఇంకా మిగిలిన 5- 6 సినిమాలు కంటెంట్ driven సినిమాలు నడుస్తున్నాయి…

పైన చెప్పిన లిస్టులో హీరోలందరు నడిమంత్రపు సిరిగాళ్లు బ్యాచ్.., వాళ్ళ సినిమా సెలక్షన్ అయినా మారాలి, లేదా దానికంటే ముందు మేము తోపు హీరోలం అనే మెంటాలిటీ అయినా మారాలి… ఒక్కరికీ ఒక షో ఫుల్ చేసే కెపాసిటీ ఉండదు కానీ రెమ్యూనరేషన్లు మాత్రం కోట్లకు కోట్లు కావాలి.

పైన చెప్పిన నంబర్స్ అన్నీ థియేటర్ బిజినెస్ మీద నష్టాలు మాత్రమే.,. హీరోల మెంటాలిటీల వల్ల సరైన కంటెంట్ రాకపోయేసరికి OTT లు కూడా పెద్దగా డబ్బులు పెట్టట్లేదు… దీంతో రెంటికీ చెడ్డట్టు అవుతోంది…

వీళ్ళందరూ స్టార్ హీరోలే అయితే, వీళ్లు తెలుగు సినిమాను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయించే పక్షంలో… మరి ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా కూలి 45 కోట్లకు మన ప్రొడ్యూసర్స్ ఎగబడి ఎందుకు తీసుకున్నారు..? అంటేనే మనం ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి…

ఇప్పుడు సినిమా  థియేటర్లకి వచ్చి హౌస్ ఫుల్స్ చేసేదే యూత్.., కరెంట్ యూత్ కీ చాలా ఎక్సట్రార్డినరీ కన్విన్సింగ్ హీరోయిజం ( Ex : విక్రమ్, జైలర్, పుష్ప ) అన్నా ఉండాలి… లేదా కోర్ట్, టూరిస్ట్ ఫ్యామిలీ, సీతారే జమీన్ పర్ లాంటి హార్ట్ టచింగ్ లాంటి కంటెంట్ సినిమాలైనా కావాలి… అంతే గానీ పైన చెప్పుకున్న బాపతు సినిమాల్ని యూత్ మొహం మీదనే మార్నింగ్ షోకే రిజెక్ట్ చేస్తున్నారు…

ఒక ‘వాల్యూ ఫర్ మనీ’ కంటెంట్ ఆడియన్స్ కీ ఆఫర్ చెయ్యనప్పుడు రిజల్ట్స్ ఇలానే ఉంటాయి… చివరకు పైన సినిమాలకంటే యూట్యూబులో ఐడ్రీమ్స్, సుమన్ టీవీ వీడియోలకే ఎక్కువ వ్యూస్ ఉంటాయి… రియాలిటీ ఇదే… ఎవరూ భుజాలు తడుముకోనక్కర్లేదు… ఎందుకంటే, అందరూ అందరే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions