చాలాసేపు మాట్లాడాను… తనేం అంటాడంటే..? మన తెలుగు కంపోజర్లు లేరా…? ఇండస్ట్రీలో బతక్కూడదా..? ఒకప్పుడు హిట్లు ఇచ్చినవాళ్లు కూడా ఊళ్లు, దేశాలు పట్టిపోయారు… జాడాపత్తా లేరు… ఎంతసేపూ తమిళ, కన్నడ కంపోజర్లే కావల్సి వచ్చారా..? మనవాళ్ల ప్రతిభకు విలువ లేదా..? అవకాశాల్లేవా..? బతకనివ్వరా..?
నిజమే కదా అనిపించింది… ఓ యంగ్ మ్యూజిషియన్‌ను నీ అభిప్రాయం ఏమిట్రా అబ్బాయ్ అనడిగాను… నవ్వాడు… అంకుల్ (హబ్బా… ఇదొక నొప్పి…) సక్సెస్ డిక్టేట్స్… success dictates… భాషకన్నా సంగీతమే ప్రధానం, సంగీతంకన్నా సక్సెసే ప్రధానం అన్నాడు… అవున్నిజమే కదా…
రాగాలకు భాషాబేధాలేమున్నయ్…? ఆ అడ్డంకులే ఉంటే ఆ తమిళ ఇళయరాజా ఇన్నివేల తెలుగు పాటలకు ప్రాణం పోసేవాడా..? తనకు ఈరోజుకూ తెలుగులో సరిగ్గా మాట్లాడటమే తెలియదు… ఐతేనేం, కచేరీలు పెడితే కోట్లకుకోట్లు కురవడం లేదా..? తెలుగు, తొక్కాతోలూ పట్టించుకునే కాలమా ఇది..? కషాయపు చేదు గొంతు అయినా సరే, చెలామణీ కావడం లేదా…? తెలుగు పదాలు పాడటం తెేలియని సిధ్ శ్రీరాంల కాలమిది… చెప్పాను, చెప్యాను నడుమ తేడా తెలియని ది గ్రేట్ శ్రేయా ఘోషాల్‌ల దుర్దినాలివి…
Ads
నిజమే… ఒక డీఎస్పీ… తెలుగు, కానీ చెన్నై బేస్డ్… స్టూడియో కూడా అదే… మంగ్లీలు, ఇంద్రావతులు, ఇతరత్రా అప్ కమింగ్ సింగర్స్ కూడా అక్కడికే వెళ్లి పాడాలి… ఒక థమన్… చెన్నై బేస్డ్… బీజీఎం అదుర్స్… ఎక్కడ కాపీలు కొడతారు వీళ్లనేది వేరే సంగతి… అసలు ఒక్క భీమ్స్ మినహా ఇంకెవరు తెలుగులో శృతులు కలుపుతున్నది..?
‘‘సాలూరి రాజేశ్వర్ రావు నుండి dsp వరకు… Dsp, థమన్ కూడా చెన్నై బ్యాక్‌డ్రాపే… డీఎస్పీకి అసలు హైదరాబాదుకే లింకుండదు… సర్వం చెన్నై… అరవ అడ్డా… వాళ్లు సరే, మరి మిగతావాళ్లు..?
నిర్దిష్టంగా సినిమా సంగీత పురోగతులు లేదా ప్రయోగాలు అన్నీ మొదట తమిళం లేదా ప్రస్తుతం మలయాళం నుండే జనరేటవుతున్నాయి… కొత్త శైలులు… అక్కడ కొత్త మార్కెట్ పుట్టుకొస్తుంది… జానపద సంగీతం లేదా ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా… అంతెందుకు..? ఈరోజుకూ 30 piece Orchestra అంటే… Chennai strings Orchestra లేదా Kochin Strings అంటారు…
అంతెందుకు..? ఇపుడున్న పెద్ద మ్యూజిక్ కంపోజర్లు అందరూ ఇళయరాజా, రెహమాన్ దగ్గర పని చేసిన వాళ్లే… కీరవాణి, మణిశర్మ ఇళయరాజా దగ్గర పనిచేశారు… థమన్, డీఎస్పీ కూడా వాళ్ల దగ్గర నేర్చుకున్న వాళ్లే…
తెలుగు సినిమాలో కొత్తగా వస్తున్న సంగీత దర్శకులు అందరూ మేజర్ గా అక్కడి నుండే మెళకువలు గ్రహించి చేస్తున్నారు… మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ కొత్త స్టైల్స్ బోధించేవి కూడా అక్కడే ఉన్నాయ్… దర్శకులు కూడా రెఫరెన్స్ మ్యూజిక్ లు అవే ఇస్తారు… అక్కడ గల్లీగల్లీకి అద్భుతమైన సంగీత విద్వాంసులు దొరుకుతారు…
అన్నింటికీ మించి మనవాళ్లకు బ్లడ్‌లో కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువ… దాని పర్యాయపదాలు ఏమైనా అనుకొండి… చెన్నైలో ఆ స్కోప్ లేదు… అందరూ అందరిలోనూ కలిసి పనిచేస్తారు… అందుకే దర్శకులు వాళ్లను ఇష్టపడతారు… ఎస్, తెలుగులో ఆ కల్చర్ పెరిగితే మనవాళ్లూ బాగుపడతారు’’ అని ముక్తాయించాడు ఆ యంగ్ మ్యూజిషియన్…
Share this Article