.
ఆహా ఓహో, మన నాగదుర్గ, ధనుష్ మేనల్లుడు, ఇక చూసుకో నాసామిరంగా, రెండు భాషల్లో అదుర్స్ అనుకున్నామా..? ఫ్లాప్… కాదు, డిజాస్టర్… సినిమా పేరు లవ్ ఓ లవ్… 9 రోజులు 87 లక్షలు… గ్రాస్… అద్దెలో, వాటాలో… రెండు భాషల్లోనూ కలిపి రోజుకు 10 లక్షలు… థియేటర్ కరెంటు ఖర్చులు ప్లస్ శానిటేషన్ ఖర్చులు వచ్చి ఉంటాయి…
ఇక్కడ రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఒకటి లెనిన్, రెండు మా ఇంటి బంగారం… పాపం, సమంతకూ అక్కినేని నాగార్జున కుటుంబానికి నడుమ భారీ అగాధం… నిజానికి సినిమాల నడుమ పోలిక వేస్ట్, కానీ ఫ్యాన్స్ ఊరుకోరు, పోలుస్తారు… అఖిల్, సమంత ఇద్దరూ బాగానే ఉంటారు, పరస్పరం అభినందనలు కూడా చెప్పుకుంటారు…
Ads
ఎడాపెడా ఫేక్ కలెక్షన్లతో పోస్టర్ వార్స్ కూడా సాగుతుంటాయి… నిజానికి సమంత సినిమా నెల రోజుల్లో 99.35 కోట్లు, అదీ గ్రాస్, అంటే వంద కోట్ల మార్క్ ఇంకా చేరలేదు, కానీ సినిమా సమంత ప్రజెంట్ స్థాయికి హిట్టే… లెనిన్ సినిమా 53.50 కోట్లు… కానీ 9 రోజుల్లోనే… సో, రెండూ ఓ మోస్తరుగా గట్టెక్కినట్టే…
పెద్ది అనే సూపర్ బంపర్ హైప్డ్ సినిమా చాలాచోట్ల బయ్యర్లకు నష్టాలు మిగిల్చిందనేది కఠిన వాస్తవం… దాన్నీ వదిలేసి రీసెంట్ సినిమాల సంగతి చూద్దాం… ది గ్రేట్ రాజేంద్ర ప్రసాదుడు వెంకటేశ్వరుడి వేషం వేసిన, శ్రీకాంత్ హీరో సినిమా… మిస్టర్ మిడిల్ క్లాస్… ఫ్లాపున్నర…
వంద దేవుళ్లు రెండు కోట్లు… హృదయం మురళి ఒక కోటి… దీవానా 3 కోట్లు… అంతటి బడా నిర్మాత, ప్రిస్టేజియస్ దర్శకుడి ప్రయోగాత్మక సినిమా సింగ్ గీతం 6 కోట్లు… పురుషః ఒక కోటి… ఐశ్వర్య రాజేష్ సినిమా ఓ సుకుమారి 2 రోజుల్లో 57 లక్షలు… ఎంత ఘోరంగా ఉందో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అర్థమవుతూనే ఉంది కదా…
ప్రేక్షకుడు థియేటర్లకు రావడం లేదు, ఇది నిజం, నిజం… ఇంకా ఇంకా నిర్మాతలు ఏవేవో కలలు కంటూ పర్సులు, ఆస్తులు కరగదీసుకుంటున్నారు… మరో క్లాసిక్ కావాలా..? మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో బొచ్చెడు తారాగణం కదా… 2 రోజుల్లో 18 లక్షలు… పేరుకు లయ, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ ఎట్సెట్రా… ఏం సుఖం?
ఎమ్మార్పీ, నీకెంత, నాకెంత అనే ఓ సినిమా వచ్చింది, 2 రోజుల్లో 4 లక్షలు… వాచ్‌మెన్ జీతాలకూ సరిపోదు… రాజా ది రాజా వసూళ్లు 4 లక్షలు… ఇంకొన్ని సినిమాల వసూళ్లు రికార్డ్ చేయడానికి sacnilk వాడికే సిగ్గు అనిపించి వదిలేశాడు… వాటిల్లో ది గ్రేట్ పోసాని నటించిన ఆపరేషన్ అరుణారెడ్డి, వెంకట్రామయ్య గారి తాలూకా వంటివి అన్నమాట…
ఈ ఉదాహరణలు చాలు కదా… గతంలోలాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎడాపెడా రేట్లు ఏమీ పెట్టడం లేదు, శాటిలైట్ టీవీ రైట్స్‌ను దేకేవాడే లేడు… ఐనా సరే, తీస్తూనే ఉన్నారు, వదులుతూనేే ఉన్నారు… కొందరు సినిమా పిచ్చోళ్లు తప్ప సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్లకు వీలైనంత దూరంగా జాగ్రత్తగా ఉంటున్నాడు… గుడ్ ఫర్ సొసైటీ… మార్పు ఇండస్ట్రీ పెద్దలకు అర్థమయ్యేంతవరకూ ఇది ఇంతే..!!
Share this Article