.
నిజమే… ఏదో సర్వే సంస్థ తమ ఫలితాలను రిలీజ్ చేసింది… అదీ స్థూలంగా ఎమ్మెల్యేల పనితీరు మీద కాదు, ఆ ర్యాంకింగులు కాదు… సామాజికవర్గాల వారీగా, పార్టీల వారీగా… ఈ ధోరణిని ఏమనాలో తెలియదు గానీ… ఇవ్వాల్సింది ర్యాంకులు కాదు, మార్కులు…
అప్పుడే కదా ఒకటికీ రెంటికీ నడుమ ఎంత తేడా ఉందో తెలిసేది… ఐనా కులాల వారీ పనితీరు మదింపు ఏమిటి..? పోనీ, ఒక ఎమ్మెల్యే పనితీరుకు ప్రామాణికాలు ఏమిటి…? సదరు సర్వే సంస్థ ఏ అంశాలను ప్రామాణికాలుగా తీసుకుందో తెలియదు… ఫేస్‌బుక్, వాట్సప్పులో కనిపిస్తున్న వాళ్ల సర్వే డిటెయిల్స్‌లో ఈ కీలకమైన అంశం కనిపించలేదు…
Ads
ఏ సర్వేకైనా ప్రాపర్ మిక్స్ అవసరం… తీసుకునే మూడొందలో నాలుగొందలో శాంపిల్ అనేది ముఖ్యం కాదు, సరైన మిక్స్ అంటే… విద్య, కులం, జెండర్, వృత్తి, వయస్సు వంటివి చాలా అంశాలుంటాయి… సరే, వాళ్ల సర్వే ఎంత అశాస్త్రీయో చెప్పడానికి ఒక్క అంశం, అనగా ఓ మెతుకు చాలు…
ఈ సర్వేలో ఫస్ట్ ర్యాంకు హరీష్ రావు అట… గుడ్, చాలామంది అంగీకరిస్తారు… తను ప్రజాజీవితంలో యాక్టివ్, తన ప్రజలకూ అందుబాటులో ఉంటాడు, స్పందిస్తాడు… వోకే… సెకండ్ ర్యాంకు కేసీయార్ అట… ఎలా..? తను ఓడిపోయాక తన ఓటమిని ప్రజాతీర్పుగా ఆమోదించలేదు, అప్పటి నుంచి ప్రజాజీవితంలోనే లేడు…
రేవంత్ రెడ్డి తనపై అనర్హత వేటు వేస్తాడేమో అనే సందేహంతో ఓసారి ప్రమాణస్వీకారానికి, ఆరు నెలలయ్యాక ఓసారి గవర్నర్ ప్రసంగం సందర్భంగా మాత్రమే అసెంబ్లీకి వచ్చాడు… తనకు వోట్లేసిన నియోజకవర్గ ప్రజల పట్ల కూడా విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు తనకు… వాళ్లెవరికీ అందుబాటులో లేడు…
ఓ ప్రతిపక్ష పార్టీ అధినేతగా కూడా జనానికి రోజూ మొహం చాటేయడమే… మరెలా సెకండ్ ర్యాంకు..? అందుకే సర్వే తీసుకున్న ప్రామాణికాల పట్ల ఈ సందేహాలు… ఇవే సోషల్ మీడియాలో పోస్టులుగా ప్రత్యక్షం అవుతున్నాయి… ఏకంగా ప్రధాని కావాలనుకున్న ఓ వ్యక్తి ఏకంగా అజ్ఙాతంలోకి జారిపోవడమే సెకండ్ ర్యాంకుకు అర్హతా..?
అసలు జనంలోనే లేని ఓ నేతను టాప్ 10 లో సెకండ్ అని తేల్చేయడంతోనే సర్వే విశ్వసనీయత కోల్పోయింది… తనే చెప్పాడు, అన్నీ గంభీరంగా చూస్తున్నాను, నన్ను ఓడించి ఏం తప్పు చేశారో జనానికే తెలిసిరావాలి అని బయటకు రావడం లేదు… అందుకని ఇచ్చారా సెకండ్ ర్యాంకు..?!
రేవంత్ రెడ్డిని కూడా ఎందుకు ఈ సర్వే నుంచి మినహాయించాలి..? తను తన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మేల్యేయే కదా… తను ఈ ప్రామాణికాలు వర్తించవా..? అతీతుడా..? నిజానికి టాప్ 10 జాబితాలో టాప్2లో కేసీయార్ కాదు, ఓలెక్కన కేటీయార్ అంటే అర్థం చేసుకోవచ్చు… తను యాక్టివ్, నియోజకవర్గ ప్రజలకూ అందుబాటులో ఉన్నాడు, ప్రజాజీవితంలో ఉన్నాడు… అసలు తనే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నాడు… హరీష్‌రావు కాదు…
అలాంటి కేటీయార్‌ను మరీ పల్లా రాజేశ్వరరెడ్డికన్నా కిందన పారేశారు… ఇక మిగతా వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరమే లేదు… అవునూ, ర్యాంకులు కాదు మిత్రమా… మార్కులు ప్రకటించాల్సింది… మిగతా వారిని వదిలేద్దాం… హరీష్ రావుకూ కేసీయార్‌కూ నడుమ మార్కుల తేడా ఎంతో..? కేసీయార్‌కూ కేటీయార్‌కూ నడుమ తేడా ఎంతో..? చెబితే కాస్త బెటర్ అండర్ స్టాండింగ్ కదా…!!
Share this Article