Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!

November 27, 2025 by M S R

.

నిన్న ఒక వార్త… యూట్యూబ్‌లో హనుమాన్ చాలీసా ఏకంగా 500 కోట్ల వ్యూస్ సాధించింది… ప్రపంచ రికార్డు ఏమీ కాదు కానీ ఇండియాలో నంబర్ వన్… దానికి సమీపంలో మరే ఇతర వీడియో లేదు… బహుశా రాదేమో కూడా… ఎందుకంటే… ఈ చాలీసా నిరంతరాయంగా చూడబడుతూనే ఉంది ఇంకా… ఇంకా… ఇంకా…

అందరూ అనుకునేది పాప్ సాంగ్స్, మూవీ సాంగ్స్ మాత్రమే ఈ రేంజులో వ్యూస్ సాధిస్తాయని..! కానీ ఇది భక్తిగీతం… ఇవే కాదు, ప్రాంతీయ భాషల పాటలు, ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి… ప్రజెంట్ ట్రెండ్ తెలంగాణ ఫోక్ సాంగ్స్… (తెలుగుకు సంబంధించి)…

Ads

నో స్టార్స్, నో స్టెప్స్, నో నాన్సెన్స్… ప్లెయిన్‌గా హరిహరన్ పాడిన ఈ చాలీసాను టీసీరీస్ విడుదల చేసింది… ఇంగ్లిష్, మాండరిన్ భాషల్లో అత్యధిక వ్యూస్ ఉన్న వీడియోలు ఉన్నాయి… కానీ వరల్డ్ టాప్ టెన్‌లో కూడా ఈ చాలీసా ఉంది… అదీ విశేషం…

భయం, ఒత్తిడి, అలసట సందర్భాల్లో హనుమాన్ చాలీసా ప్లే చేయడం చాలామందికి అలవాటు… అదీ ఈ వీడియో ప్రత్యేకత… లింక్ కావాలా..?

తరువాత స్థానాల్లో ఏమున్నయ్..?

2 & 3 ర్యాంకుల్లో Lehanga & 52 Gaj Ka Daman (1.8 బిలియన్లకు పైగా వ్యూస్…) ప్రాంతీయ పాటల ప్రభంజనం ఇవి… హిందీ సినిమాలకు దీటుగా పంజాబీ పాట ‘Lehanga’ , హర్యానీ పాట ’52 Gaj Ka Daman’ రికార్డు స్థాయిలో వీక్షణలు సాధించాయి… ఇది దేశంలో ప్రాంతీయ సంగీతానికి ఉన్న విస్తృత ఆదరణను ప్రపంచానికి చూపించింది…

4 వ ర్యాంకు ఏ పాటో తెలుసా..? రౌడీ బేబీ… తమిళ సినిమా పాట… 1.71 బిలియన్లు… దక్షిణ భారత సినీ పవర్.,.. ధనుష్, సాయి పల్లవి నటించిన ఈ తమిళ పాట, మరీ ముఖ్యంగా ప్రభుదేవా కొరియోగ్రఫీ, సాయి పల్లవి డ్యాన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది… దక్షిణాది సినిమాలకు సంబంధించి ఇదే నంబర్ వన్… 2, 3, 4 ర్యాంకులు ప్రాంతీయ భాషలవే… (ఈ పాట తెలుగు వెర్షన్ కూడా కలిపితే బహుశా సెకండ్ ప్లేస్ దీనిదేనేమో…)

5 & 6 ర్యాంకుల్లో ఉన్నవి Zaroori Tha & Vaaste … 1.7 బిలియన్లు… ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ సత్తా… ఈ రెండు పాటలు సినిమా పాటలు కావు... అయినప్పటికీ, వీటిలోని గాఢమైన భావోద్వేగాలు, చక్కటి మ్యూజిక్, వీడియోల నిర్మాణ విలువల కారణంగా, బాలీవుడ్ పాటల కంటే ఎక్కువ వీక్షణలను సాధించి, ఇండిపెండెంట్ మ్యూజిక్ విభాగంలో మైలురాళ్లను నెలకొల్పాయి…

7 వ ర్యాంకు Laung Laachi… 1.62 బిలియన్లు… మొట్టమొదటి మైలురాయి… ఈ పంజాబీ సినిమా పాట యూట్యూబ్‌లో  బిలియన్ వీక్షణలు దాటిన మొట్టమొదటి భారతీయ పాటలలో ఒకటిగా రికార్డు సృష్టించింది… ఇది భారతదేశంలో మ్యూజిక్ వీడియోలకు కొత్త ప్రమాణాలను ఏర్పరిచింది…

8 వ ర్యాంకు… Lut Gaye…  1.51 బిలియన్లు… ఫాస్టెస్ట్ హిట్‌… ఇమ్రాన్ హష్మి నటించిన ఈ పాట విడుదలైన అతి తక్కువ కాలంలోనే బిలియన్‌కు పైగా వీక్షణలను చేరుకుంది, రొమాంటిక్ పాటలకు యూత్ లో ఉన్న క్రేజ్‌ని నిరూపించింది…

9వ ర్యాంకులో Dilbar (Lyrical… 1.50 బిలియన్లు… ఇదేమో లిరికల్ వీడియో ఘనత… పూర్తి మ్యూజిక్ వీడియో కాకుండా, కేవలం లిరికల్ వీడియో (పాట సాహిత్యాన్ని చూపించే వీడియో) టాప్ 10 జాబితాలో ఉండటం ఈ పాటకు ఉన్న విపరీతమైన ప్రజాదరణను తెలియజేస్తుంది….

10 వ ప్లేసులో ‘Bum Bum Bole’… 1.40 బిలియన్లు… 2007లో విడుదలైన ‘తారే జమీన్ పర్’ సినిమాలోని ఈ పాట, పాత పాట అయినప్పటికీ, పిల్లలపై దానికున్న సానుకూల ప్రభావం కారణంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీక్షణలను అద్భుతంగా పెంచుకుంటోంది…



అసలు ఇండియన్ టాప్ టెన్ వీడియోల్లో మన తెలుగు వీడియో కూడా ఒకటి ఉంటుంది… దాని పేరు చల్ చల్ గుర్రం… ఇది సినిమా పాటల కంటే చాలా ఎక్కువ వీక్షణలను కలిగి ఉంది… ప్రపంచవ్యాప్తంగా పిల్లల రైమ్స్‌కు ఉన్న ఆదరణ కారణంగా ఇది ఈ స్థానాన్ని దక్కించుకుంది…

‘చల్ చల్ గుర్రం’ వంటి రైమ్స్ “Kids’ Content” విభాగంలోకి వస్తాయి, అందుకే వాటిని తరచుగా ‘Top Indian Music Videos’ జాబితాల నుండి వేరుగా ఉంచుతారు…



ఇంతకీ తెలుగులో నంబర్ వన్ ఏమిటంటారా..? చల్ చల్ గుర్రం పక్కన పెడితే … అల వైకుంఠపురంలో సినిమాలోని పాట బుట్టబొమ్మా పాట నంబర్ వన్… 89 కోట్లకుపైగా వ్యూస్… (బహుశా త్వరలో రాను బొంబైకి రాను అనే తెలంగాణ ఫోక్ దీన్ని చేరుకోవచ్చు, ఆల్రెడీ 65 కోట్ల వ్యూస్ దాటింది)… ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ ఛాలెంజ్‌లతో వైరల్ అయిన పాట…

తరువాత ప్లేసు కూడా అదే సినిమాలోని పాట… రాములో రాములా… ఫోక్ టచ్‌తో ఇరగదీసింది… 76 కోట్ల వ్యూస్… బొంబైకి రాను సాంగ్ తరువాత ప్లేసు సాయిపల్లవి పాట… ఫిదా… వచ్చిండే పాట… 45 కోట్ల వ్యూస్… ఇవండీ టాప్ యూట్యూబ్ వీడియోల ముచ్చట్లు… వినండి, ఆనందించండి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…
  • బీసీ సీట్లపై బీఆర్ఎస్ ఫేక్ ప్రాపగాండా..! నిజాలేమిటో ఓసారి చూద్దాం..!!
  • ఒకటే చెట్టు… పది పక్షులు… ఒక తుపాకీ గుండు… తర్వాత మీరే చదవండి…
  • బాబోయ్ విలేకర్స్..! సొసైటీకి బెడదగా న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ..!!
  • ఈ విశ్వసుందరి కిరీటం ధగధగల వెనుక కొన్ని చీకటి నీడలు…!!
  • అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions