Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎయిడ్స్‌ చికిత్సకు ఓ దివ్యౌషధం… మన కాకినాడ డాక్టరూ చెప్పారు…

July 8, 2024 by M S R

కొన్ని మనకు చిన్న వార్తలుగానే కనిపిస్తాయి… మన మీడియాలో చాలామంది వాటిని అస్సలు పట్టించుకోరు, ప్రత్యేకించి పొలిటికల్ బురదను మాత్రమే పాఠకులకు అందించే మీడియా… ఈరోజు నచ్చిన వార్తల్లో ఇదీ ఒకటి… హెచ్ఐవీ ఎయిడ్స్ చికిత్సకు రకరకాల మందులు, మార్గాలు అవలంబిస్తుంటారు వైద్యులు…

ఈరోజుకూ ఇదొక విపత్తు వంటి వ్యాధి… ప్రపంచవ్యాప్తంగా రోగులు పెరుగుతూనే ఉన్నారు… మన తెలుగు రాష్ట్రాలు కూడా తక్కువేమీ కాదు… ఖరీదైన వైద్యం… అన్నింటికీ మించి సరైన వైద్యులు, అంటే వ్యాధి తీవ్రతను సరిగ్గా అంచనా వేసి, అన్ని కోణాల్లో మదింపు చేసి, మందులు రాసివ్వగలిగిన వైద్యులు దొరకడం కష్టం…

aids

Ads

ఈ నేపథ్యంలో ఒక వార్త కనిపించింది… అదేమిటంటే..? ఏటా రెండు ఇంజక్షన్లతో ఎయిడ్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చుననేది వార్త… లెనాకాపవిర్ పేరుతో డెవలప్ చేశారు… దక్షిణాఫ్రికా, ఉగాండాలలో ట్రయల్స్ నిర్వహించినప్పుడు 100 శాతం సక్సెస్ రేటు… మరిన్ని అధ్యయనాలు, అనుమతుల తరువాత మార్కెట్‌లోకి తీసుకొస్తారు అనేది సారాంశం… గుడ్…

కొన్ని లక్షల మంది రోగులకు జీవితం మీద ఆశల్ని నిలబెట్టి ఉంచగల వార్తలు ఇవి… ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది… ఐతే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… ఈ క్లాస్ డ్రగ్స్ రీసెర్చ్ మీద, ఆ డ్రగ్స్ చేయబోయే ఉపయోగాల మీద మన దేశంలోనూ కొందరు డాక్టర్లకు అవగాహన ఉంది… రెగ్యులర్ పరిశీలనలోనే ఉన్నారు… అందులో ఒకరు మన కాకినాడకు చెందిన యనమదల మురళీకృష్ణ…

సాంక్రామిక వ్యాధుల మీద మంచి అవగాహన ఉండటమే కాదు, తనకు ప్రయోగాలు, పరిశోధనల మీద ఆసక్తి… ఈ క్లాస్ డ్రగ్స్ గురించి తను రాసిన పుస్తకంలో కూడా ఉంది… 2022 చివరి నాటికే ఈ పరిశోధనలు ఫలించి ఓ కొలిక్కి వస్తాయనీ డాక్టర్ అంచనా వేశారు… ఈ పుస్తకం హెచ్ఐవీ- ఎయిడ్స్ మీద సాధికారికంగా రాయబడింది… ఓ సమగ్ర చిత్రణ… (9491031492 నంబరుకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా 155 రూపాయలు పంపించి ఈ పుస్తకం తెప్పించుకోవచ్చు…)

hiv

ఎయిడ్స్- క్షయ సంబంధిత అంశాలపై తను వెలువరించిన ఓ పరిశోధన పత్రం మెడికల్ వెబ్‌సైట్ మెడ్ స్కేప్ గుర్తించిన 10 అత్యుత్తమ పరిశోధన పత్రాల్లో ఒకటి… అంతేకాదు, ఇన్నాళ్లూ ఎయిడ్స్ చికిత్సకు త్రీ టైర్ మెడికేషన్ ఆచరణలో ఉండగా, టూ టైర్ మెడికేషన్ ఎలా సరిపోతుందో కూడా వెల్లడిస్తే… అంతర్జాతీయ ఎయిడ్స్ చికిత్స సమూహం దాన్ని గుర్తించి, ఆమోదించి, ఆచరణలోకి తీసుకొస్తోంది…

అవును, ప్రాణాంతకమైన ఈ ఎయిడ్స్ విపత్తును ఎదుర్కోవడంలో మనిషి ఇంకా చాలా అడుగులు ముందుకు వేయాల్సి ఉంది… అదే ఈ వార్తకు ప్రాధాన్యత… ఇలాంటి వార్తలు మన మీడియాకు ఎందుకు పట్టవు అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions