Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాతి రథసారథులు… టాప్-100 వ్యక్తుల జాబితా, పరిచయాలు…

March 29, 2026 by M S R

.

“ఈ టాప్100 జాబితా చెబుతున్న అసలు నిజం ఏమిటంటే… భారత్‌లో ప్రభావం అంటే ఫేమ్ కాదు, ఫాలోవర్స్ కాదు… నిర్ణయాలు తీసుకునే శక్తి.” Indian Express పబ్లిష్ చేసిన టాప్ 100 ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల జాబితాను ఓసారి పరిశీలిస్తే, విశ్లేషిస్తే అర్థమయ్యేది ఇదే…

ముందుగా ఆ జాబితా, వారెవరెవరో ఓసారి చూద్దాం, సంక్షిప్త అభిప్రాయంతో సహా… తరువాత ఇంకాస్త వివరమైన విశ్లేషణకు వెళ్దాం…

Ads



The Indian Express Top 100 Influential Indians

  1. Narendra Modi – భారత ప్రధాని. దేశీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రస్థాన ప్రభావం.
  2. Amit Shah – హోం మంత్రి. బీజేపీ వ్యూహాలకు ప్రధాన శిల్పి.
  3. Mohan Bhagwat – ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి. భావజాల దిశా నిర్దేశకుడు.
  4. Rajnath Singh – రక్షణ మంత్రి. సైనిక వ్యవస్థకు కీలక నాయకుడు.
  5. Piyush Goyal – వాణిజ్య మంత్రి. ఆర్థిక విధానాల్లో చురుకైన పాత్ర.
  6. Nirmala Sitharaman – ఆర్థిక మంత్రి. దేశ బడ్జెట్‌కు బాధ్యత .
  7. S. Jaishankar – విదేశాంగ మంత్రి. దౌత్యంలో నైపుణ్యం.
  8. Yogi Adityanath – యూపీ సీఎం. కఠిన శ్రేష్ట పాలనకు గుర్తింపు.
  9. Rahul Gandhi – కాంగ్రెస్ నాయకుడు. ప్రతిపక్ష ముఖచిత్రం.
  10. Ashwini Vaishnaw – ఐటీ, రైల్వే మంత్రి. డిజిటల్ రంగంలో కీలకం.

11–20

  1. Mukesh Ambani – భారత వ్యాపార దిగ్గజం. ఎనర్జీ నుంచి టెలికాం వరకు విస్తరణ.
  2. Gautam Adani – ఇన్‌ఫ్రా రంగంలో భారీ పెట్టుబడులు. వేగంగా ఎదిగిన బిజినెస్ టైకూన్.
  3. N. Chandrababu Naidu – ఏపీ సీఎం, ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామి.
  4. Devendra Fadnavis – మహారాష్ట్ర సీఎం, బీజేపీ వ్యూహాల్లో బలమైన స్థానం.
  5. Mamata Banerjee – బెంగాల్ సీఎం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి.
  6. Nitin Gadkari – రోడ్ల మంత్రి, హైవేల్లో విప్లవాత్మక మార్పులు.
  7. Justice Surya Kant – సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. కీలక తీర్పుల్లో పాత్ర.
  8. Sanjay Malhotra – ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక పరిపాలనలో కీలకాధికారి.
  9. Noel Tata – టాటా వారసత్వంలో ముఖ్య భాగం. వ్యూహాత్మక నిర్ణయాల్లో పాత్ర.
  10. Gyanesh Kumar – చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ‘సర్’ వ్యూహకర్త.

21–40

  1. Nitin Nabin – బీజేపీ అధ్యక్షుడు, వేగంగా ఎదుగుదల.
  2. Jay Shah – ఐసీసీ బాస్, అమిత్ షా కొడుకుగా ప్రభావశీలి.
  3. M. K. Stalin – తమిళనాడు సీఎం, ప్రతిపక్షాల్లో పవర్ ఫుల్.
  4. Himanta Biswa Sarma – అస్సోం సీఎం, ఈశాన్య రాజకీయాల్లో ప్రభావశీలి.
  5. Revanth Reddy – తెలంగాణ సీఎం, కాంగ్రెస్ పార్టీలో కీలకం.
  6. Nita Ambani – సామాజిక సేవల్లో ప్రముఖురాలు. అంబానీ భార్య.
  7. Shivraj Singh Chouhan – కేంద్ర మంత్రి, ఎన్డీయేలో కీలకనేత.
  8. Dharmendra Pradhan – విద్యా మంత్రి, విద్యా రంగ సంస్కరణలు.
  9. Ajit Doval – జేమ్స్ బాండ్, అలుపెరుగని భద్రతా వ్యూహకర్త.
  10. Bhupender Yadav – పర్యావరణ విధానాల్లో చురుకైన కేంద్ర మంత్రి.
  11. Vikram Misri – విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శి.
  12. P. K. Mishra – ప్రధాని కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి.
  13. Shaktikanta Das – ఆర్థిక విధానాల్లో కీలకం. పీఎంవోలో కార్యదర్శి.
  14. Manohar Lal Khattar – హర్యానా నేత, కేంద్ర ఎనర్జీ మంత్రి.
  15. Priyanka Gandhi Vadra – రాహుల్ సోదరి. సోనియా కూతురు.
  16. Arvind Kejriwal – ఢిల్లీ రాజకీయాల్లో బలమైన నాయకుడు. ఆప్ అధినేత.
  17. Hardeep Singh Puri – కేంద్ర పెట్రోలియం మంత్రి. కీలక నిర్ణయాలు.
  18. Dattatreya Hosabale – ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేత. ప్రధాన కార్యదర్శి.
  19. Mansukh Mandaviya – కేంద్ర మంత్రి. కీలక నేత కేంద్రంలో.
  20. Siddaramaiah – కర్ణాటక సీఎం. సంక్షేమ పాలనకు గుర్తింపు.

41–60

  1. Chirag Paswan – లోకజనశక్తి పార్టీ బాస్, యువ నేత, ఎన్డీయే భాగస్వామి.
  2. Omar Abdullah – జమ్మూ కాశ్మీర్ సీఎం, కశ్మీర్ రాజకీయాల్లో ప్రముఖుడు.
  3. Mallikarjun Kharge – ప్రధాన ప్రతిపక్షం ఎఐసీసీ అధ్యక్షుడు.
  4. Bhagwant Mann – పంజాబ్ సీఎం. కీలక రాష్ట్రానికి అధినేత.
  5. R. N. Ravi – గవర్నర్‌గా కీలక పాత్ర. తరచూ వివాదాల మాస్టర్.
  6. Uday Kotak – బ్యాంకింగ్ రంగంలో ప్రముఖుడు. కొటక్ బ్యాంక్.
  7. Sanjiv Bajaj – ఫైనాన్స్ రంగంలో ప్రభావం. బజాజ్ ఫిన్ సీఎండీ.
  8. Tushar Mehta – కేంద్ర ప్రభుత్వ న్యాయవాది. సొలిసిటర్ జనరల్.
  9. T. V. Somanathan – కేబినెట్ సెక్రెటరీ, కేంద్ర పాలనయంత్రాంగ సారథి.
  10. B. L. Santhosh – బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ. సంఘ్‌తో సంధానం.
  11. Sajjan Jindal – స్టీల్ రంగంలో కీలక వ్యక్తి. జిందాల్ గ్రూప్ సీఎండీ.
  12. Jyotiraditya Scindia – కేంద్ర మంత్రి, బీజేపీ భావి స్టార్లలో ఒకరు.
  13. Sunil Bharti Mittal – టెలికాం దిగ్గజం. ఎయిర్‌టెల్ బాస్.
  14. J. P. Nadda – బీజేపీ మాజీ అధ్యక్షుడు. ఇప్పటికీ కీలకనేత. మంత్రి.
  15. Asaduddin Owaisi – దేశ మైనారిటీ రాజకీయాల్లో ప్రధాన స్వరం.
  16. C. R. Patil – పార్టీ సంస్థాగత నేత. కేంద్ర జలశక్తి మంత్రి.
  17. Arjun Ram Meghwal – చట్టపరమైన వ్యవహారాల్లో కీలక పాత్ర. మంత్రి.
  18. Pralhad Joshi – బీజేపీ పార్టీ కీలక నాయకుడు. మంత్రి.
  19. Pinarayi Vijayan – కేరళ సీఎం. లెఫ్ట్ నుంచి ఏకైక సీఎం.
  20. N. Chandrasekaran – టాటా గ్రూప్ చైర్మన్.

61–80

  1. Rekha Gupta – ఢిల్లీ సీఎం. బీజేపీ కీలక మహిళ నేతల్లో ఒకరు.
  2. Kiren Rijiju – కేంద్ర మంత్రి. మైనారిటీ వ్యవహారాల్లో కీలకం.
  3. Bhupendra Patel – దేశంలోని కీలక రాష్ట్రం గుజరాత్ సీఎం.
  4. Pema Khandu – అరుణాచల్ సీఎం. యంగ్ టర్క్, ఈశాన్య కిరణం.
  5. Vishnu Deo Sai – ఛత్తీస్‌గఢ్ సీఎం. యాంటీ నక్సల్ ఆపరేషన్లతో పాపులర్.
  6. Vijay – తమిళ స్టార్ హీరో. టీవీకే ఫౌండర్, తాజా సంచలనం.
  7. Mohan Yadav – మధ్యప్రదేశ్ సీఎం. బీజేపీ కీలక నేతల్లో ఒకరు.
  8. Pawan Kalyan – జనసేన అధినేత. టీడీపీ- బీజేపీ సంధానకర్త.
  9. Bhajan Lal Sharma – రాజస్థాన్ సీఎం. బీజేపీ తదుపరి నాయకశ్రేణిలో ఒకరు.
  10. Tejashwi Yadav – బీహార్ ప్రతిపక్ష నేత. ఆర్జేడీ బాస్, లాలూ కొడుకు.
  11. Akhilesh Yadav – సమాజ్‌వాది పార్టీ నాయకుడు. ములాయం కొడుకు, ఎస్పీ బాస్.
  12. Nayab Singh Saini – హర్యానా సీఎం. సెకండ్ టైమ్ చీఫ్ మినిస్టర్.
  13. Pushkar Singh Dhami – ఉత్తరాఖండ్ సీఎం. బీజేపీ కీలకనేత.
  14. Gautam Gambhir – మాజీ క్రికెటర్. కోచ్‌గా కీలక పాత్ర.
  15. Virat Kohli – ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్. మోస్ట్ పాపులర్.
  16. Sharad Pawar – సీనియర్ రాజకీయ నేత. మహారాష్ట్ర పొలిటిషయన్. ఎన్సీపీ.
  17. Tuhin Kanta Pandey – ఆర్థిక వ్యవహారాల్లో కీలక అధికారి. సెబి చైర్మన్.
  18. Manoj Sinha – జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. పవర్ ఫుల్ రోల్.
  19. Kiran Nadar – విద్యా, కళా రంగాల్లో సేవలు. శివ నాడార్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్.
  20. Harsh Sanghavi – యువ నేత, గుజరాత్ డిప్యూటీ సీఎం. బీజేపీలో కీలకం.

81–100

  1. Shashi Tharoor – రచయిత, పార్లమెంటేరియన్. కాంగ్రెస్ మేధావి.
  2. Jasprit Bumrah – ప్రపంచ స్థాయి బౌలర్. పరిచయం అక్కర్లేని పేరు.
  3. Shankaran Naren – ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ప్రముఖుడు. ఐసీఐసీఐ.
  4. Nitin Kumar – పరిపాలనలో కీలక పాత్ర. బీహార్ మాజీ సీఎం, జేడీయూ.
  5. Virat Bhatia – పబ్లిక్ పాలసీ నిపుణుడు. ఎండీ, యాపిల్ ఇండియా.
  6. Harish Salve – ప్రముఖ న్యాయవాది. టాప్ న్యాయవాదుల్లో ఒకరు.
  7. Gajendra Singh Shekhawat – కేంద్ర మంత్రి. బీజేపీ సీనియర్ నేత.
  8. Sarbananda Sonowal – పోర్ట్స్ మంత్రి. అస్సాం- ఈశాన్య రాజకీయాల్లో కీలకం.
  9. Rishad Premji – ఐటీ రంగ నాయకుడు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్.
  10. Rammohan Naidu – కేంద్ర మంత్రి. టీడీపీలో కీలక నేత.
  11. Kumar Mangalam Birla – వ్యాపార దిగ్గజం. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్.
  12. Hemant Soren – జార్ఖండ్ సీఎం. బీజేపీ ప్రభావం దాటి పవర్ నిలబెట్టుకున్న నేత.
  13. Aditya Dhar – బాలీవుడ్ దర్శకుడు. దురంధర్ సినిమాలతో బాగా పాపులర్.
  14. Arvind Srivastava – కేంద్ర పరిపాలనలో కీలక అధికారి. రెవిన్యూ సెక్రెటరీ.
  15. Shah Rukh Khan – బాలీవుడ్ కింగ్. ఇప్పటికీ టాప్ వన్ స్టార్.
  16. Diljit Dosanjh – పంజాబీ పాప్ స్టార్. యాక్టర్.
  17. Karan Johar – ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు.
  18. Kamakoti – డైరెక్టర్, ఐఐటీ మద్రాస్.
  19. Arijit Singh – భారత ప్రముఖ గాయకుడు. మోస్ట్ పాపులర్ కంపోజర్.
  20. Amitabh Bachchan – భారత సినీ లెజెండ్


జాబితాలో మహిళల పాత్ర నామమాత్రం… నిర్మల, నీతా, కిరణ్ నాడార్, ప్రియాంక, రేఖ గుప్త వంటి ఐదారుగురు, అంతే… సోనియా గాంధీ పేరు లేకపోవడం విచిత్రం. “పాలిటికల్ పవర్” డామినేషన్… టాప్ 10లో 8 మంది పాలిటిషన్స్… టాప్ 50లో సగానికి పైగా రాజకీయ నాయకులు… భారతదేశంలో అసలు పవర్ ఇంకా రాజకీయాల్లోనే కేంద్రీకృతం…


కార్పొరేట్ దిగ్గజాలు — కానీ టాప్‌లో కాదు … Mukesh Ambani, Gautam Adani ఉన్నా కూడా, వాళ్లు టాప్ 10లో లేరు. బిజినెస్ ప్రభావం పెద్దదే. కానీ “పాలిటికల్ పవర్” కంటే దిగువన . డబ్బు ఉంది… కానీ నిర్ణయాధికారం రాజకీయాలదే…


బాలీవుడ్ షాక్ — దిగువ స్థానాలు Shah Rukh Khan (#95), Amitabh Bachchan (#100), అంతే, ఇంకెవరూ లేరు… పాన్ ఇండియా తోపులు కూడా లేరు… గొప్పలు చెప్పుకునే రాజమౌళి, సుకుమార్ ఎట్సెట్రా కూడా లేరు… జస్ట్, దర్శకుల్లో ఓన్లీ ఆదిత్య థర్… ఒకప్పుడు “సాఫ్ట్ పవర్”కి చిహ్నాలు స్టార్లు… ఇప్పుడు లిస్ట్ చివర్లో…


క్రికెట్ — పరిమిత ప్రాతినిధ్యం Virat Kohli (#75), Jasprit Bumrah (#82) కేవలం 2 క్రికెటర్లు మాత్రమే… ధోనీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్ల పేర్లూ లేవు… Jay Shah (#22) మాత్రం పరిపాలన వల్ల, సెలక్టర్‌గా గౌతమ్ గంభీర్ పేర్లు పైకి… గేమ్ కంటే గవర్నెన్స్‌కు ఎక్కువ విలువ ఇచ్చారు…


బ్యూరోక్రాట్స్ & బ్యాక్‌రూమ్ పవర్ … Ajit Doval, P. K. Mishra, Shaktikanta Das … పీఎంవో సెక్రెటరీలు, కేబినెట్, రెవిన్యూ సెక్రెటరీలు గట్రా… ప్రజలకు పెద్దగా కనిపించని వ్యక్తులు … కానీ పాలసీని అసలు నడిపేవాళ్లు… “అదృశ్య శక్తి” చాలా బలంగా ఉంది…


సీఎం‌ల ప్రాబల్యం … Yogi Adityanath, Mamata Banerjee, M. K. Stalin, రేవంత్ రెడ్డి… రాష్ట్ర స్థాయి నాయకులు కూడా జాతీయ ప్రభావం చూపుతున్నారు.  ఫెడరల్ పాలిటిక్స్ బలంగా ఉంది…


ఫ్యామిలీ & నెట్‌వర్క్ పవర్ … Jay Shah , Priyanka Gandhi Vadra, Nita Ambani, నాడార్ తదితరుల పేర్లు మహిళా వారసత్వాలే… కుటుంబ సంబంధాలు కూడా ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి…


“సాఫ్ట్ పవర్” తగ్గుదల … సినిమాలు, క్రీడలు → దిగువ స్థానాలు … పాలసీ, రాజకీయాలు → టాప్ … దేశాన్ని ప్రభావితం చేసే వారు = నిర్ణయాలు తీసుకునేవారు


న్యాయ వ్యవస్థ & లీగల్ పవర్ … Harish Salve, Tushar Mehta… కోర్టులు కూడా పాలసీని ప్రభావితం చేస్తున్నాయి…


అందరూ ఈ జాబితాతో ఏకీభవించకపోవచ్చు… జాబితా ఖరారును ప్రభావితం చేసే అంశాలూ బోలెడు ఉండొచ్చు… కానీ స్థూలంగా ఈ దేశం రథాన్ని నడిపిస్తున్న ముఖ్యులెవరో చెప్పడానికి ఈ కథనం… ఈ జాబితా… సుదీర్ఘంగా ఉన్నా సరే, ఆసక్తి ఉన్నవారి కోసం….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతి రథసారథులు… టాప్-100 వ్యక్తుల జాబితా, పరిచయాలు…
  • నో కేసీయార్… నో జగన్… టాప్-25 జాబితాలో రేవంత్ రెడ్డి…
  • స్వామి పర్వర్షన్‌‌కు తోడుగా కిష్వర్ పైత్యం… మోడీని గోకుతున్నారు…
  • శిఖరాగ్రం నుండి శూన్యం వరకు… రేమండ్స్ విజయపథ్ ‘డెస్టినీ’…
  • శెట్టి గ్యాంగ్ కకావికలు… డబుల్ హేపీతో రష్మిక పకపకలు…
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర … ఆకట్టుకోని ఎన్టీయార్ సొంత సినిమా…
  • మీడియా వార్ కాదు… ఇగో వార్… టీవీ5 Vs ఎన్టీవీ… నాయుడు Vs చౌదరి…
  • ఆట ఆడితే, ఆడిస్తే కోట్లు జలజలా రాలాలె… మేం అస్సలు ఆడం పో…
  • యుగాంతం..! విశ్వ వినాశనం దిశలో అమెరికా- రష్యా ప్రాక్సీ వార్..!!
  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions