.
ఆహా.,. ఇక చూడలేం అనుకున్నాం… టీవీ రేటింగ్సుల్లో ఇక సినిమాల ప్రీమియర్ ప్రసారాలకు మంచి రేటింగ్స్ చూడలేం, ఆ తరం ముగిసింది, అందరూ ఓటీటీల్లో సినిమాలు చూస్తుంటే ఇక టీవీల్లో ఎవడు చూస్తాడురా అనుకున్నాం…
కానీ చాన్నాళ్ల తరువాత టీవీ సీరియళ్లను దాటి… టాప్ 30 సినిమా రేటింగుల్లో ప్రథమ స్థానం ఓ తెలుగు సినిమా ప్రీమియం ప్రసారానికి దక్కింది… చివరకు స్టార్ మా వాడు కావాలని పదే పదే ‘ప్రమోట్ చేస్తూ’, టీవీ ఇండస్ట్రీ అంతా వాడిదే కదా… వాడేది చెబితే అది…
Ads
వాడేం చేసినా అడిగేవాడు, అడ్డుకునేవాడు, దిద్దేవాడు, యాక్షన్ తీసుకునేవాడు ఎవడూ లేడు కదా ది గ్రేట్ మోడీ ప్రభుత్వంలో… జాతీయ చానెళ్ల దగ్గర నుంచి ప్రాంతీయ చానెళ్ల దాకా…
.
వావ్, వెంకీ మామా… వయస్సు ముదిరినా, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ అనిల్ రావిపూడిని పట్టుకుని ఓ బ్లాక్ బస్టర్ సంపాదించావు, ఒక సినిమా టీవీ ప్రసారానికి టాప్ రేటింగ్ సంపాదించావ్ అని అభినందించాలని ఉంది…
ఎస్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా టీవీ ప్రీమియర్ ఏకంగా దాదాపు 18 రేటింగ్స్ సంపాదించింది… పెద్ద పెద్ద తోపు స్టార్ హీరోల బంపర్ హిట్స్ సినిమాల టీవీ ప్రసారాలకే 5, 6 రేటింగ్స్ కూడా రాని రోజుల్లో… హబ్బ, వెంకీ మామా సూపర్, డూపర్, అనిల్ రావిపూడి బంపర్, మస్తు రేటింగ్స్ సాధించార్రా అని భుజాలు చరుచుకోకండి…
.
ఇదీ ఓ డ్రామా, ఓ మార్కెటింగ్ స్ట్రాటజీ… గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్… శాటిలైట్ ప్రసార హక్కులు కొన్నవాడు నేలకరిచాడు… దాంతో దిల్ రాజు అండ్ కో ఏం చేసింది..? కాంబో అగ్రిమెంట్… గేమ్ చేంజర్‌కూ సంక్రాంతికి వస్తున్నాంకూ ముడిపెట్టి…
గేమ్ చేంజర్ లేటుగా… సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ రిలీజు లేటుగా… సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టీవీల్లో ఎర్లీగా రిలీజ్ చేయాలని ఓ ప్లాన్… పక్కా కమర్షియల్… నిజమే కదా… ఓటీటీలో వచ్చాక టీవీల్లో ఎవడు చూస్తాడు..?
సో, ప్లాన్ అలా వర్కవుట్ అయ్యింది… ఓటీటీలో రాలేదు కదాని… టీవీల్లో చూశారు… అందుకే అంత రేటింగ్… అర్థమైంది కదా… కానీ ప్రతిసారీ అది వర్కవుట్ కాదు… పైగా 300 కోట్లు, బంపర్ హిట్ అనేది వేరు… సినిమా నాణ్యత వేరు…
సంక్రాంతికి వస్తున్నాం అనేది ఓ పరమ చెత్తా కామెడీ జానర్… జబర్దస్త్ స్కిట్లు చాలా బెటర్… ఆ బుల్లిరాజు కేరక్టర్ దగ్గర నుంచి, భాగ్యం కేరక్టర్ ప్లస్ మీనాక్షి కేరక్టర్ దాకా అన్నీ అతి, ఓవర్, ఇల్లాజికల్…. అవున్లెండి, తెలుగు కామెడీకి కేరక్టర్, లాజిక్ ఏముంటాయి..? నిజం చెప్పాలంటే..? అనిల్ రావిపూడి సినిమాల్లో పరమ వెగటు సినిమా ఇది… ఐనా సరే…
చెత్తా రొటీన్ తెలుగు హీరోయిక్ కేరక్టర్లతో పోలిస్తే ఇది బెటర్‌రా బాబూ అని సంకేతం ఇస్తున్నారు జనం… ఎవరికి..? ఫార్ములా, సుప్రీం హీరోయిక్ కేరక్టర్లతో సినిమాలు తీసే డొల్ల మెదళ్ల నిర్మాతలకు… దర్శకులకు…!!
Share this Article