3.71 కోట్ల వ్యూస్… ఒక వెబ్ కంటెంటు వ్యూయర్స్ విషయంలో ఇది అసాధారణ సంఖ్య కదా… అవును, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించిన వెబ్ కామెడీ సీరీస్ ఫర్జి ప్రస్తుతం మోస్ట్ వాచ్‌డ్ ఇండియన్ వెబ్ షో… ఇప్పటివరకూ వచ్చిన అన్ని వెబ్ సీరీస్‌ను ఇది కొట్టిపారేసింది… ఇది చిన్న విషయమేమీ కాదు… ఓటీటీలో సూపర్ సక్సెస్ అన్నమాట… అసలు ఇదే కాదు, ఒక్కసారి టాప్ 10 ఇండియన్ వెబ్ కంటెంట్ విషయానికి వస్తే అన్నీ హిందీవే… థియేటర్లలో వందల కోట్లు కొల్లగొట్టిన ఏ సౌత్ క్రియేటర్ కూడా ఇలాంటి సీరీస్ క్రియేట్ చేయలేకపోతున్నాడు…
రుద్ర, (ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్)… హీరో అజయ్ దేవగణ్… ఇదీ తక్కువేమీ కాదు… 3.62 కోట్ల వ్యూస్… మీర్జాపూర్ సీజన్-2 కూడా భలే క్లిక్కయింది… ఇది టాప్ త్రీ ప్లేసులో నిలిచింది… ఈ పంకజ్ త్రిపాఠీ షో 3.25 కోట్ల వ్యూస్ సంపాదించింది… జితేంద్రకుమార్ పంచాయత్ సీజన్-2 కూడా బాగానే సక్సెస్‌గా చెప్పుకోవచ్చు… దీనికి 2.96 కోట్ల వ్యూస్ వచ్చినయ్…
క్రిమినల్ జస్టిస్, (బిహైండ్ ది డోర్స్)… ఇందులో మన ఆశిష్ విద్యార్థి కూడా ఉన్నాడు… పంకజ్ త్రిపాఠీ మరో సూపర్ హిట్ సీరీస్… అనిల్ కపూర్ నటించిన ది నైట్ మేనేజర్ సీరీస్ ఏకంగా 2.72 కోట్ల వ్యూస్ సంపాదించి టాప్ 10 జాబితాలోకి ఎక్కింది… మనోజ్ బాజ్‌పేయ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ హిట్… సెకండ్ సీజన్ కూడా 2.63 కోట్ల వ్యూస్ సాధించింది… భువన్ బామ్ సీరీస్ తాజా ఖబర్ 2.35 కోట్ల వ్యూస్ దక్కించుకుంది…
Ads
ది గ్రేట్ ఇండియన్ మర్డర్… ఈ సీరీస్ 2.3 కోట్ల వ్యూస్ సాధించింది… ఓ మర్డర్ మిస్టరీ ఇది… స్కామ్ 1992 అనూహ్యంగా విపరీతమైన వ్యూస్ సంపాదించుకుని హిట్ సీరీస్‌లో ఒకటిగా నిలబడింది… హర్షద్ మెహతా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్కామ్ మీద తీసిన ఈ సీరిస్‌కు 2.27 కోట్ల వ్యూస్ వచ్చాయి… ఇది ఓటీటీ శకం…
థియేటర్ వెళ్లి వ్యయప్రయాసలకు ఓర్చి ఏదో చెత్తా సినిమాను చూసే బదులు… అంతే క్వాలిటీతో, నిజం చెప్పాలంటే వాటికన్నా కాస్త మెరుగ్గానే తీయబడుతున్న వెబ్ సీరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతోంది అని చెప్పడానికి ఇవీ ఉదాహరణలు… ఈ లెక్కలు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లకు సంబంధించినవి… నిజానికి థియేటర్ సినిమాలతో అదరగొడుతున్న సౌత్ ఇండియన్ క్రియేటర్స్, ద్రవిడ భాషల్లో హిట్ సీరీస్ ఏమీ తీసుకు రావడం లేదనే చెప్పాలి…!!
Share this Article